కంటెంట్‌కు వెళ్లండి

Rebellion Against God గురించి బైబిల్ వచనాలు

148 వచనాలు · 63 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. తిరుగుబాటు చేసి యెహోవాకు ద్రోహం చేశాం, మా దేవునికి విరుద్ధంగా ఉంటూ, తిరుగుబాటును ప్రేరేపించడం బాధపెట్టడం, మా హృదయంలో ఆలోచించుకుని, అబద్ధాలు చెప్పడము.

  2. అయినా వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపరిచారు. కాబట్టి ఆయన వారికి శత్రువయ్యారు తానే వారితో యుద్ధం చేశారు.

  3. తమ ఊహల ప్రకారం చేస్తూ చెడు మార్గంలో నడుస్తూ ఉన్న మూర్ఖులైన ప్రజలకు నేను దినమంతా నా చేతులు చాపాను.

  4. “దేశాలకు ఈ విషయం చెప్పండి, యెరూషలేము గురించి ఇలా ప్రకటించండి: ‘దూరదేశం నుండి ముట్టడి చేస్తున్న సైన్యం, యూదా పట్టణాలకు వ్యతిరేకంగా యుద్ధ కేకలు వేస్తుంది.

  5. పొలంలో కాపలా కాస్తున్న మనుష్యుల్లా వారు ఆమెను చుట్టుముట్టారు, ఎందుకంటే ఆమె నా మీదికి తిరుగుబాటు చేసింది’ ” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  6. “మీ ప్రవర్తన మీ క్రియలు దీన్ని మీపైకి తెచ్చాయి. ఇది నీకు శిక్ష. ఎంత చేదుగా ఉంది! అది హృదయాన్ని ఎలా గ్రుచ్చుతుంది!”

  7. అయితే ఈ ప్రజలు మొండితనం, తిరుగుబాటుతనం గల హృదయాలు కలిగి ఉన్నారు; వారు ప్రక్కకు తిరిగి వెళ్లిపోయారు.

  8. కాబట్టి యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను నిన్ను భూమి మీద నుండి తొలగించబోతున్నాను. మీరు ప్రభువుకు వ్యతిరేకంగా తిరుగుబాటు బోధించారు కాబట్టి ఈ సంవత్సరమే మీరు చనిపోతారు.’ ”

  9. “యెహోవా నీతిమంతుడు, అయినా నేను ఆయన ఆజ్ఞకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాను. జనాంగములారా, వినండి; నా శ్రమను చూడండి. నా యువకులు, యువతులు చెరకు వెళ్లారు.

  10. “యెహోవా, చూడండి, నేను ఎంత బాధలో ఉన్నానో! నా లోలోపల చిత్రహింసను అనుభవిస్తున్నాను, నా హృదయంలో నేను కలత చెందాను, ఎందుకంటే నేను ఘోరంగా తిరుగుబాటు చేశాను. బయట, ఖడ్గం హతమారుస్తూ ఉంది; లోపల, కేవలం మరణమే.

  11. ఆయన నాతో, “మనుష్యకుమారుడా, నా మీద తిరుగుబాటు చేసిన ప్రజలైన ఇశ్రాయేలీయుల దగ్గరికి నేను నిన్ను పంపిస్తున్నాను; వారు వారి పూర్వికులు ఈ రోజు వరకు నా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు.

  12. మొండివారును కఠిన హృదయులునైన ప్రజల దగ్గరకు నేను నిన్ను పంపుతున్నాను. ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదేనని వారితో చెప్పు.’

  13. వారిది తిరుగుబాటు స్వభావం కాబట్టి వారు విన్నా వినకపోయినా తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకునేలా వారికి చెప్పు.

  14. మనుష్యకుమారుడా, వారికి, వారి మాటలకు భయపడకు. నీ చుట్టూ ముండ్లపొదలు ముళ్ళు ఉన్నా, తేళ్ల మధ్య నివసిస్తున్నా నీవు భయపడకు. వారు తిరుగుబాటు చేసే ప్రజలు కాబట్టి వారు అన్న వాటికి వారి చూపులకు నీవేమి భయపడకు.

  15. వారిది తిరుగుబాటు స్వభావం కాబట్టి వారు విన్నా వినకపోయినా నేను చెప్పిన మాట వారికి తెలియజేయి.

  16. మనుష్యకుమారుడా, వారు తిరుగుబాటు చేసినట్లే నీవు చేయకు. నా మాట విను. నోరు తెరిచి నేను ఇచ్చేది తిను.”

  17. ఆయన ఇంకా నాతో ఇలా అన్నారు, “మనుష్యకుమారుడా, ఇశ్రాయేలీయుల దగ్గరకు వెళ్లి నా మాటలు వారికి తెలియజేయి.

  18. నీవు అర్థం చేసుకోలేని మాటలు మాట్లాడేవారి దగ్గరకు తెలియని భాష మాట్లాడే ప్రజల దగ్గరకు కాదు ఇశ్రాయేలీయుల దగ్గరికే నిన్ను పంపుతున్నాను.

  19. నీకు అర్థం చేసుకోలేని మాటలు తెలియని భాష మాట్లాడే ఇతర ప్రజల దగ్గరకు పంపలేదు. వారి మధ్యకు నిన్ను పంపితే నీవు చెప్పేది వారు వింటారు.

  20. కాని ఇశ్రాయేలీయులు మొండివారు కఠిన హృదయులు. నా మాటలు వినడానికి ఇష్టపడరు కాబట్టి నీ మాటలు కూడా వినరు.

  21. వారి ముఖంలాగానే నీ ముఖం కఠినంగా పోతుంది. వారి నుదురులా నీ నుదిటిని కఠినంగా చేస్తాను.

  22. నేను నీ నుదుటిని వజ్రం కంటే గట్టి రాయిలా చేస్తాను. వారు తిరుగుబాటుదారులు అయినప్పటికీ వారికి బెదరకు వారిని చూసి భయపడకు.”

  23. “తిరుగుబాటు చేసే ఈ ప్రజలతో ఇలా చెప్పు, ‘ఈ మాటల అర్థం మీకు తెలియదా?’ ఇదిగో, ‘బబులోను రాజు యెరూషలేముకు వెళ్లి దాని రాజును, అధిపతులను పట్టుకుని తనతో పాటు బబులోనుకు తీసుకువచ్చాడు.

  24. అయితే రాజకుటుంబం నుండి ఎంచుకోబడిన వ్యక్తి, తనకు గుర్రాలను పెద్ద సైన్యాన్ని పంపి సహాయం చేయమని అడగడానికి ఈజిప్టు దేశానికి రాయబారులను పంపి బబులోను రాజు మీద తిరుగుబాటు చేశాడు. అతడు విజయం సాధిస్తాడా? అటువంటి పనులు చేసినవాడు తప్పించుకుంటాడా? అతడు ఒప్పందాన్ని ఉల్లంఘించి తప్పించుకుంటాడా?

  25. “ ‘అయితే వారు నా మాట వినకుండా నా మీద తిరుగుబాటు చేశారు; తమకిష్టమైన అసహ్యమైన పనులు చేయడం మానలేదు, ఈజిప్టువారి విగ్రహాలను పూజించడం మానలేదు. కాబట్టి వారు ఈజిప్టు దేశంలో ఉండగానే నేను నా ఉగ్రతను వారి మీద కుమ్మరించి నా కోపం వారి మీద తీర్చుకున్నాను.