Rebellion Against God గురించి బైబిల్ వచనాలు: Departing from his instituted worship
Departing from his instituted worship గురించి వచనాలు
నేను వారికి ఆజ్ఞాపించిన మార్గం నుండి చాలా త్వరగా తప్పిపోయి ఒక దూడ రూపంలో పోతపోసిన విగ్రహాన్ని తమ కోసం తయారుచేసుకుని దానికి సాష్టాంగపడి బలి అర్పించి, ‘ఇశ్రాయేలూ, ఈజిప్టులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుళ్ళు వీరే’ అని అన్నారు.
“నేను ఈ ప్రజలను చూశాను” అని అంటూ యెహోవా మోషేతో ఇలా అన్నారు, “వారు మొండి ప్రజలు,
“యెహోవా సమాజమంతా ఇలా అన్నారు: ‘మీరు ఇశ్రాయేలు దేవుని పట్ల నమ్మకద్రోహం ఎలా చేస్తారు? మీరు యెహోవాను విడిచిపెట్టి ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ ఇప్పుడు బలిపీఠాన్ని ఎలా కట్టుకోగలరు?
పెయోరులో చేసిన పాపం మనకు సరిపోదా? యెహోవా సమాజం మీదికి తెగులు వచ్చినా, ఈ రోజు వరకు ఆ పాపం నుండి మనం శుద్ధి చేసుకోలేదు!
ఇప్పుడు మీరు యెహోవా నుండి దూరంగా వెళ్తున్నారా? “ ‘మీరు ఈ రోజు యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే, రేపు ఆయన ఇశ్రాయేలు సమాజమంతటి మీద కోప్పడతారు.
మీరు స్వాధీనం చేసుకున్న భూమి అపవిత్రంగా ఉంటే, యెహోవా సమావేశ గుడారం ఉన్న యెహోవా దేశానికి వచ్చి, ఆ దేశాన్ని మాతో పంచుకోండి. కాని మన దేవుడైన యెహోవా బలిపీఠం కాకుండా మీ కోసం ఒక బలిపీఠాన్ని కట్టుకుని యెహోవా మీద గాని మామీద గాని తిరుగుబాటు చేయవద్దు.