కంటెంట్‌కు వెళ్లండి

Rebellion Against God గురించి బైబిల్ వచనాలు: Sent to those guilty of

16 వచనాలు · 63 కోణాలు

Sent to those guilty of గురించి వచనాలు

  1. ఆయన నాతో, “మనుష్యకుమారుడా, నా మీద తిరుగుబాటు చేసిన ప్రజలైన ఇశ్రాయేలీయుల దగ్గరికి నేను నిన్ను పంపిస్తున్నాను; వారు వారి పూర్వికులు ఈ రోజు వరకు నా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు.

  2. మొండివారును కఠిన హృదయులునైన ప్రజల దగ్గరకు నేను నిన్ను పంపుతున్నాను. ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదేనని వారితో చెప్పు.’

  3. వారిది తిరుగుబాటు స్వభావం కాబట్టి వారు విన్నా వినకపోయినా తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకునేలా వారికి చెప్పు.

  4. మనుష్యకుమారుడా, వారికి, వారి మాటలకు భయపడకు. నీ చుట్టూ ముండ్లపొదలు ముళ్ళు ఉన్నా, తేళ్ల మధ్య నివసిస్తున్నా నీవు భయపడకు. వారు తిరుగుబాటు చేసే ప్రజలు కాబట్టి వారు అన్న వాటికి వారి చూపులకు నీవేమి భయపడకు.

  5. వారిది తిరుగుబాటు స్వభావం కాబట్టి వారు విన్నా వినకపోయినా నేను చెప్పిన మాట వారికి తెలియజేయి.

  6. ఆయన ఇంకా నాతో ఇలా అన్నారు, “మనుష్యకుమారుడా, ఇశ్రాయేలీయుల దగ్గరకు వెళ్లి నా మాటలు వారికి తెలియజేయి.

  7. నీవు అర్థం చేసుకోలేని మాటలు మాట్లాడేవారి దగ్గరకు తెలియని భాష మాట్లాడే ప్రజల దగ్గరకు కాదు ఇశ్రాయేలీయుల దగ్గరికే నిన్ను పంపుతున్నాను.

  8. నీకు అర్థం చేసుకోలేని మాటలు తెలియని భాష మాట్లాడే ఇతర ప్రజల దగ్గరకు పంపలేదు. వారి మధ్యకు నిన్ను పంపితే నీవు చెప్పేది వారు వింటారు.

  9. కాని ఇశ్రాయేలీయులు మొండివారు కఠిన హృదయులు. నా మాటలు వినడానికి ఇష్టపడరు కాబట్టి నీ మాటలు కూడా వినరు.

  10. వారి ముఖంలాగానే నీ ముఖం కఠినంగా పోతుంది. వారి నుదురులా నీ నుదిటిని కఠినంగా చేస్తాను.

  11. నేను నీ నుదుటిని వజ్రం కంటే గట్టి రాయిలా చేస్తాను. వారు తిరుగుబాటుదారులు అయినప్పటికీ వారికి బెదరకు వారిని చూసి భయపడకు.”

  12. అప్పుడు అతడు మరొక పనివానిని వారి దగ్గరకు పంపాడు కాని, వారు వాన్ని తలమీద కొట్టి అవమానించి పంపేశారు.

  13. అప్పుడు అతడు మరొక పనివానిని పంపాడు, వారు అతన్ని కూడ చంపేశారు. అలా అతడు చాలామంది పనివారిని పంపాడు, వారు కొంతమందిని కొట్టారు, మరికొందరిని చంపారు.

  14. “పంపడానికి అతని దగ్గర ఒకడే మిగిలాడు, తాను ఎంతో ప్రేమించే, తన కుమారుడు. ‘వారు నా కుమారున్ని గౌరవిస్తారు’ అనుకుని, చివరిగా అతన్ని పంపాడు.

  15. “కాని వారు ఒకరితో ఒకరు, ‘ఇతడే వారసుడు, రండి, ఇతన్ని చంపుదాం, అప్పుడు ఈ వారసత్వం మనదైపోతుంది’ అని అనుకున్నారు.

  16. కాబట్టి వారు అతన్ని బయటకు తీసుకెళ్లి, చంపి, అతని శరీరాన్ని ద్రాక్షతోట బయట పడవేశారు.