కంటెంట్‌కు వెళ్లండి

Psalms గురించి బైబిల్ వచనాలు

896 వచనాలు · 16 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అయితే దుష్టులు అలా ఉండరు! వారు గాలికి కొట్టుకుపోయే పొట్టులా ఉంటారు.

  2. కాబట్టి న్యాయతీర్పులో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలబడరు.

  3. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలుసు, దుష్టుల మార్గం నాశనానికి నడిపిస్తుంది.

  4. దేశాలు ఎందుకు కుట్ర చేస్తున్నాయి? ప్రజలు ఎందుకు వ్యర్థంగా పన్నాగం వేస్తున్నారు?

  5. యెహోవాకు ఆయన అభిషిక్తునికి వ్యతిరేకంగా భూరాజులు లేచి పాలకులందరు ఒకటిగా చేరి,

  6. “మనం వారి గొలుసులను తెంపుదాం వారి సంకెళ్ళను విసిరి పారేద్దాం” అంటున్నారు.

  7. ఆకాశంలో ఆసీనులై ఉన్న ప్రభువు నవ్వుతున్నారు; ఆయన వారిని చూసి ఎగతాళి చేస్తున్నారు.

  8. ఆయన కోపంతో వారిని గద్దించి తన తీవ్రమైన ఉగ్రతతో వారిని భయకంపితులను చేసి ఇలా అన్నారు,

  9. “నా పవిత్ర పర్వతమైన సీయోనును నా రాజు ఏలుతున్నారు.”

  10. నేను యెహోవా శాసనాన్ని ప్రకటిస్తాను: ఆయన నాతో ఇలా అన్నారు, “నీవు నా కుమారుడవు; ఈ రోజు నేను నీకు తండ్రిని అయ్యాను.

  11. నన్ను అడిగితే, నేను దేశాలను నీకు స్వాస్థ్యంగా, భూమి అంచుల వరకు ఆస్తిగా ఇస్తాను.

  12. ఇనుపదండంతో నీవు వారిని నలగ్గొడతావు; పగిలిన కుండలా వారిని ముక్కలుగా చేస్తావు.”

  13. కాబట్టి, రాజులారా, తెలివిగా ఉండండి; భూమిని పాలించేవారలారా, మిమ్మల్ని సరిచేసుకోండి.

  14. యెహోవాను భయంతో సేవించండి వణుకుతూ ఆనందించండి.

  15. ఆయన కుమారున్ని ముద్దాడండి, లేకపోతే ఆయన కోపం ఒక క్షణంలో రగులుకుంటుంది. మీ మార్గం మీ నాశనానికి నడిపిస్తుంది, ఎందుకంటే ఆయన ఉగ్రత క్షణంలో రగులుకుంటుంది. ఆయనను ఆశ్రయించువారు ధన్యులు.

  16. దావీదు కీర్తన. తన కుమారుడైన అబ్షాలోము నుండి పారిపోతున్నప్పుడు వ్రాసినది. యెహోవా, నాకు ఎంతోమంది శత్రువులు! నామీదికి ఎంతోమంది లేస్తారు!

  17. “దేవుడు అతన్ని విడిపించడు” అని అనేకులు నా గురించి చెప్తున్నారు. సెలా

  18. కాని యెహోవా, మీరు నా చుట్టూ డాలుగా, నాకు మహిమగా, నా తల పైకెత్తేవారిగా ఉన్నారు.

  19. నేను యెహోవాకు మొరపెడతాను, ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి జవాబిస్తారు. సెలా

  20. నేను పడుకుని నిద్రపోతాను; యెహోవా నన్ను సంరక్షిస్తారు కాబట్టి నేను మళ్ళీ మేల్కొంటాను.

  21. అన్ని వైపుల నుండి పదివేలమంది నాపై పడినా నేను భయపడను.

  22. యెహోవా, లెండి! నా దేవా, నన్ను విడిపించండి! నా శత్రువులందరిని దవడపై కొట్టండి; దుష్టుల పళ్ళు విరగ్గొట్టండి.

  23. రక్షణ యెహోవా నుండి వస్తుంది. మీ ప్రజలపై మీ ఆశీర్వాదం ఉండును గాక. సెలా

  24. సంగీత దర్శకునికి. తంతి వాయిద్యాలతో పాడదగినది. దావీదు కీర్తన. నీతిమంతుడవైన నా దేవా, నేను మిమ్మల్ని పిలిచినప్పుడు నాకు జవాబు ఇవ్వండి. నా బాధ నుండి నాకు ఉపశమనం ఇవ్వండి; నాపై దయచూపి నా ప్రార్థన వినండి.

  25. ఓ ప్రజలారా, మీరు ఎంతకాలం నా కీర్తిని అవమానంగా మారుస్తారు? మీరు ఎంతకాలం భ్రమలను ప్రేమిస్తూ అబద్ధాలను అనుసరిస్తారు? సెలా