Skip to content

Prayer Under Affliction గురించి బైబిల్ వచనాలు

49 వచనాలు · 17 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకండి, మీ పరిశుద్ధాత్మను నా నుండి తొలగించకండి.

  2. మీ రక్షణానందం నాకు తిరిగి చేకూర్చండి, నన్ను సంరక్షించడానికి నాకు సమ్మతిగల ఆత్మను ఇవ్వండి.

  3. కాని నా మట్టుకైతే నేను బాధించబడి వేదనలో ఉన్నాను, దేవా! మీ రక్షణ నన్ను కాపాడును గాక.

  4. గత తరాల పాపాలను మాకు వ్యతిరేకంగా జ్ఞాపకం చేసుకోకండి; మీ కరుణను త్వరగా మాపై చూపండి, ఎందుకంటే మేము చాలా కష్టాల్లో ఉన్నాము.

  5. సైన్యాలకు అధిపతియైన దేవా, మమ్మల్ని పునరుద్ధరించండి; మేము రక్షింపబడేలా మీ ముఖం మాపై ప్రకాశింపజేయండి.

  6. మా రక్షకుడవైన దేవా, మమ్మల్ని మరల పునరుద్ధరించండి. మామీద ఉన్న మీ కోపాన్ని విడిచిపెట్టండి.

  7. ఎప్పటికీ మీరు మామీద కోప్పడతారా? తరతరాల వరకు మామీద మీరు కోప్పడుతూనే ఉంటారా?

  8. మీ ప్రజలు మీలో ఆనందించేలా మీరు మమ్మల్ని మరల బ్రతికించరా?

  9. ఉదయం మీ మారని ప్రేమతో మమ్మల్ని తృప్తిపరచండి, తద్వార బ్రతికినన్నాళ్ళు ఆనంద గానం చేస్తూ ఆనందిస్తాము.

  10. మమ్మల్ని బాధించినన్ని దినాలు, మమ్మల్ని ఇబ్బంది పెట్టినన్నాళ్ళు మమ్మల్ని సంతోషింపజేయండి.

  11. నేను కష్టంలో ఉన్నప్పుడు మీ ముఖాన్ని నాకు మరుగు చేయకండి. మీ చెవి నా వైపు త్రిప్పండి; నేను మొరపెట్టినప్పుడు, త్వరగా జవాబివ్వండి.

  12. మీ సేవకునికి మీరు ఇచ్చిన వాగ్దాన ప్రకారం, మీ మారని ప్రేమ నాకు ఆదరణ కలిగిస్తుంది.

  13. మీ చిత్తాన్ని చేయడం నేర్పించండి, మీరు నా దేవుడు; మీ మంచి ఆత్మ సమతల నేల మీద నన్ను నడిపించును గాక.

  14. యెహోవా, మీ పేరు కోసం నా జీవితాన్ని కాపాడండి; మీ నీతిలో నా కష్టాల నుండి నన్ను విడిపించండి.

  15. యెహోవా! ఎక్కువగా కోప్పడకండి; నిత్యం మా పాపాల్ని జ్ఞాపకం చేసుకోకండి. మేమంతా మీ ప్రజలమే కాబట్టి మా పట్ల దయ చూపించమని ప్రార్థిస్తున్నాము.

  16. మీ పరిశుద్ధ పట్టణాలు బంజరు భూమిగా మారాయి; చివరకు సీయోను బంజరు భూమిగా, యెరూషలేము నిర్జనంగా మారాయి.

  17. మా పూర్వికులు మిమ్మల్ని స్తుతించిన సుందరమైన మా కీర్తిగల మందిరం అగ్నితో కాల్చబడింది, మా ఆహ్లాదకరమైనవన్నీ నాశనమైపోయాయి.

  18. యెహోవా! ఇదంతా జరిగిన తర్వాత, మీరు చూసి ఊరుకుంటారా? మీరు మౌనంగా ఉండి మమ్మల్ని ఇంకా శిక్షిస్తూనే ఉంటారా?

  19. యెహోవా, నన్ను స్వస్థపరచండి, నేను స్వస్థపడతాను; నన్ను రక్షించండి, నేను రక్షింపబడతాను, నేను స్తుతించేది మిమ్మల్నే.

  20. “ఎఫ్రాయిం మూలుగులు నేను ఖచ్చితంగా విన్నాను: ‘శిక్షణ పొందని దూడలా ఉన్న నన్ను మీరు క్రమశిక్షణలో పెట్టారు, నేను క్రమశిక్షణ పొందాను. నన్ను బాగుచేయండి, నేను తిరిగి వస్తాను, ఎందుకంటే మీరే నా దేవుడైన యెహోవావు.

  21. యెహోవా, మాకు ఏమి జరిగిందో జ్ఞాపకముంచుకోండి; మా వైపు తిరిగి, మాకు కలిగిన అవమానాన్ని చూడండి.

  22. యెహోవా, నీ కీర్తి గురించి విన్నాను; యెహోవా, నీ క్రియలకు నేను భయపడుతున్నాను. మా దినాల్లో వాటిని మళ్ళీ చేయండి, మా కాలంలో వాటిని తెలియజేయండి; ఉగ్రతలో కరుణించడం జ్ఞాపకముంచుకోండి.

  23. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, “నేను నమ్ముతున్నాను; నా అపనమ్మకాన్ని జయించడానికి నాకు సహాయం చేయండి!” అని అరిచాడు.

  24. మీలో ఎవరైనా శ్రమలు అనుభవిస్తున్నారా? అయితే వారు ప్రార్థించాలి. ఎవరైనా సంతోషంగా ఉన్నారా? అయితే వారు స్తుతి గీతాలను పాడాలి.