Skip to content

Lasciviousness గురించి బైబిల్ వచనాలు

68 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నా భర్త ఇంట్లో లేడు; దూర ప్రయాణం వెళ్లాడు.

  2. అతడు దూర ప్రయాణానికి సరిపడేంత డబ్బు సంచి చేతిలో పట్టుకుని వెళ్లాడు. రెండు వారాల వరకు తిరిగి రాడు.”

  3. ఆ యువకుని వశపరచుకోవడానికి ఆ వేశ్య శతవిధాల ప్రయత్నించింది; దాని మృదువైన మాటలు అతన్ని మాయ చేశాయి.

  4. అతడు మూర్ఖునిలా ఒక్కసారిగా వధకు వెళ్లే ఎద్దులా, ఉచ్చులోకి దిగిన జింకలా దాని వెంటపడ్డాడు,

  5. తన ప్రాణానికి అపాయం ఉందని తెలియక, ఉరి దగ్గరకు పక్షి త్వరపడునట్లు, వాని గుండెను బాణంతో చీల్చే వరకు వాడు దాని వెంట వెళ్లాడు.

  6. కాబట్టి ఇప్పుడు నా కుమారుడా, చెవియొగ్గి; నా మాటలు విను.

  7. వేశ్య మార్గాల తట్టు నీ హృదయాన్ని వెళ్లనీయకు దారి తప్పి అది వెళ్లే దారిలో వెళ్లకు.

  8. అది గాయపరచి చంపినవారు లెక్కలేనంత మంది; అది పడద్రోసిన వారు అనేకులు.

  9. దాని ఇల్లు సమాధికే దారి తీస్తుంది, దాని తిన్నగా మరణానికే మార్గాన్ని చూపిస్తుంది.

  10. బుద్ధిహీనత అనే స్త్రీ గగ్గోలు పెట్టేది; ఆమె తెలివితక్కువది దానికి ఏమీ తెలియదు.

  11. ఆ స్త్రీ తన ఇంటి వాకిటిలో కూర్చుండును, ఊరి ప్రధాన వీధుల్లో కుర్చీమీద అది కూర్చుండును,

  12. ఆ దారిలో వెళ్లు వారిని చూసి, తమ మార్గములో చక్కగా వెళ్లు వారిని చూసి,

  13. “సామాన్యమైన వారలారా, ఇక్కడకు రండి!” అని పిలుస్తుంది! బుద్ధిలేనివారితో అది ఇలా అంటుంది:

  14. “దొంగతనం చేసిన నీళ్లు తీపి, రహస్యంగా చేసిన భోజనం రుచి!”

  15. అయితే అక్కడ మృతులు ఉన్నారని, దాని అతిథులు పాతాళంలో ఉన్నారని వారికి కొంతవరకే తెలుసు.

  16. “మూడు అద్భుతమైనవి కలవు, నాకు అర్థం కానివి నాలుగు కలవు:

  17. అవేమనగా ఆకాశాన గ్రద్ద జాడ, బండ మీద పాము జాడ, అగాధ సముద్రంలో ఓడ నడుచు జాడ, పెండ్లికాని స్త్రీతో పురుషుని జాడ.

  18. “వేశ్య యొక్క పనియు అట్టిదే; అది తిని నోరు తుడుచుకుని నేను ఏ చెడు చేయలేదు అని అంటుంది.

  19. ఎందుకంటే, అంతరంగంలో నుండి లైంగిక అనైతికత, దొంగతనం, నరహత్య,

  20. వ్యభిచారం, దురాశ, పగ, మోసం, అశ్లీలత, అసూయ, దూషణ, అహంకారం, అవివేకం లాంటి దుష్ట ఆలోచనలు వస్తాయి.

  21. ఈ దుష్టమైనవన్ని లోపలినుండే బయటకు వచ్చి వ్యక్తిని అపవిత్రపరుస్తాయి” అన్నారు.

  22. వారు జ్ఞానులమని చెప్పుకున్నప్పటికీ మూర్ఖులుగా మారారు.

  23. వారు నిత్యుడైన దేవుని మహిమను నాశనమయ్యే మనుష్యులు, పక్షులు, జంతువులు, ప్రాకే ప్రాణుల రూపాలలో తయారుచేసిన విగ్రహాలకు ఆపాదించారు.

  24. కాబట్టి వారి హృదయాల్లో ఉన్న పాపపు కోరికలను బట్టి వారు ఒకరితో ఒకరు తమ శరీరాలను అవమానపరచుకోడానికి దేవుడు వారిని లైంగిక అపవిత్రతకు అప్పగించారు.

  25. వారు దేవుని సత్యాన్ని అబద్ధంగా మార్చి, సృష్టికర్తకు బదులుగా ఆయన సృష్టించిన వాటిని పూజించి సేవించారు. అయితే ఆయన ఎల్లప్పుడు స్తోత్రార్హుడు. ఆమేన్.