Skip to content

Ingratitude గురించి బైబిల్ వచనాలు

62 వచనాలు · 19 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. దావీదు సేవకులు వచ్చి వారు నాబాలుకు దావీదు పంపిన వర్తమానాన్ని చెప్పి వేచి ఉన్నారు.

  2. నాబాలు దావీదు సేవకులతో, “దావీదు ఎవడు? యెష్షయి కుమారుడెవడు? ఈ రోజుల్లో చాలామంది తమ యజమానులను విడిచిపెట్టి వెళ్లి పోతున్నారు.

  3. నా ఆహారాన్ని నీటిని, నా గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్న వారి కోసం నేను సిద్ధం చేసిన మాంసాన్ని ఎక్కడి నుండి వచ్చారో నాకు తెలియని వారికి నేను ఎందుకు ఇవ్వాలి?” అన్నాడు.

  4. అప్పుడు నాతాను దావీదుతో, “ఆ మనిషివి నీవే! ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నారు: ‘నేను నిన్ను ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించాను. సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించాను.

  5. నీ యజమాని ఇంటిని నీకు అప్పగించాను, అతని భార్యలను నీ కౌగిటిలోనికి చేర్చాను. ఇశ్రాయేలు, యూదా రాజ్యాలను నీకు అప్పగించాను. ఇవన్నీ చాలవని నీవు అనుకుంటే నేను నీకు మరిన్ని ఇచ్చి ఉండేవాన్ని.

  6. యెహోవా దృష్టికి చెడ్డదైన పనిని చేసి ఆయన మాటను ఎందుకు తృణీకరించావు? హిత్తీయుడైన ఊరియాను ఖడ్గంతో చనిపోయేలా చేసి అతని భార్యను నీ సొంతం చేసుకున్నావు. అమ్మోనీయుల ఖడ్గంతో అతడు చనిపోయేలా చేశావు.

  7. బయెషా గురించి హనానీ కుమారుడైన యెహుకు యెహోవా నుండి వచ్చిన వాక్కు:

  8. “నేను నిన్ను మట్టిలో నుండి పైకి లేవనెత్తి నా ప్రజలైన ఇశ్రాయేలు మీద పాలకునిగా చేశాను. అయితే నీవు యరొబాము విధానాలను అనుసరించి, నా ప్రజలైన ఇశ్రాయేలు పాపం చేసేలా చేసి, వారి పాపాలను బట్టి నాకు కోపం రేపావు.

  9. కాబట్టి నేను బయెషాను, అతని వంశాన్ని తుడిచివేస్తాను. నీ ఇంటిని నెబాతు కుమారుడైన యరొబాము ఇంటిలా చేస్తాను.

  10. యెరూషలేములో సైనికులు బాణాలు వేయడానికి గోడల నుండి పెద్ద రాళ్లను విసిరేందుకు వీలుగా అతడు బురుజులపై మూలల రక్షణ కోసం కనిపెట్టిన పరికరాలను తయారుచేశాడు. అతని కీర్తి చాలా దూరం వ్యాపించింది, ఎందుకంటే అతడు స్థిరపడేవరకు యెహోవా అతనికి ఎంతో సహాయం చేశారు.

  11. ఉజ్జియా స్థిరపడిన తర్వాత అతడు విర్రవీగి పతనం అయ్యాడు. తన దేవుడైన యెహోవాకు నమ్మకద్రోహం చేసి యెహోవా మందిరంలో ధూపవేదిక మీద ధూపం వేయడానికి ప్రవేశించాడు.

  12. ఆయన రాతిలో నుండి ప్రవాహాలను తెచ్చారు నీటిని నదుల్లా ప్రవహింపజేశారు.

  13. కాని వారు ఆయనకు వ్యతిరేకంగా పాపం చేస్తూనే ఉన్నారు అరణ్యంలో మహోన్నతుని మీద తిరుగుబాటు చేశారు.

  14. ఆయన ధూళి అంత విస్తారంగా మాంసాన్ని, సముద్రపు ఇసుక రేణువుల్లా పక్షుల్ని వారి మీద కుమ్మరించారు.

  15. ఆయన వాటిని వారి దండులో వారి గుడారాల చుట్టూ వంగేలా చేశారు.

  16. వారడిగిందే దేవుడిచ్చాడు, వారు కడుపునిండా తిన్నారు.

  17. కానీ వారి ఆశ తీరకముందే, ఇంకా ఆహారం వారి నోటిలో ఉండగానే,

  18. దేవుని కోపం వారి మీదికి రగులుకొంది; వారిలో బలిష్ఠులను ఆయన హతమార్చారు, ఇశ్రాయేలీయులలో యువకులను సంహరించారు.

  19. ఇంత జరిగినా వారింకా పాపం చేస్తూనే ఉన్నారు; ఆయన అద్భుతాలు చేస్తున్నా వారు నమ్మలేదు.

  20. వారు, ‘ఈజిప్టు నుండి మమ్మల్ని రప్పించి, నిర్జన అరణ్యం గుండా, ఎడారులు, కనుమలు ఉన్న భూమి గుండా, కరువు, చీకటి నిండిన భూమి గుండా, ఎవరూ ప్రయాణించని, ఎవరూ నివసించని భూమి గుండా మమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడ?’ అని అడిగారు.

  21. నేను మిమ్మల్ని సారవంతమైన దేశంలోకి, దాని ఫలాలను, శ్రేష్ఠమైన వాటిని తినడానికి తీసుకువచ్చాను. అయితే మీరు వచ్చి నా దేశాన్ని ఆచారరీత్య అపవిత్రం చేసి నా స్వాస్థ్యాన్ని అసహ్యమైనదిగా చేశారు.

  22. నేను నీకు ఇచ్చిన నాణ్యమైన నగలు, నా బంగారు వెండితో చేసిన నగలు కూడా తీసుకుని, నీకోసం మగ విగ్రహాలను తయారుచేసి, వాటితో వ్యభిచారం చేశావు.

  23. నీవు వాటికి నీ కుట్టుపని చేసిన వస్త్రాలు ధరింపజేసి, నీవు వాటికి నా నూనె, ధూపం సమర్పించావు.

  24. నేను నీకు ఆహారంగా ఇచ్చిన నాణ్యమైన పిండి, తేనె, నూనెలను తీసుకుని సువాసన వచ్చేలా వాటికి అర్పించావు. జరిగింది ఇదే అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.

  25. “ ‘నీవు నాకు కనిన కుమారులను, కుమార్తెలను ఆ విగ్రహాలకు ఆహారంగా బలి అర్పించావు. నీవు చేసిన వ్యభిచారం సరిపోలేదా?