Ingratitude గురించి బైబిల్ వచనాలు: Nabal
Nabal గురించి వచనాలు
దావీదు తన పనివారిలో పదిమంది యువకులను పిలిచి వారితో ఇలా చెప్పాడు, “మీరు కర్మెలులో ఉన్న నాబాలు దగ్గరకు వెళ్లి నేను అడిగినట్టుగా క్షేమసమాచారం అడగండి.
అతనితో ఇలా చెప్పండి, ‘నీకు దీర్ఘాయువు కలుగును గాక! నీకు నీ ఇంటివారికి నీకు చెందినవాటన్నిటికి క్షేమం కలుగును గాక!
“ ‘ఇది గొర్రెల బొచ్చు కత్తిరించే సమయమని నేను విన్నాను. నీ గొర్రెల కాపరులు మాతో ఉన్నప్పుడు మేము వారికి ఏ హాని చేయలేదు. కర్మెలులో ఉన్నంత కాలం వారు ఏదీ పోగొట్టుకోలేదు.
నీ సేవకులను అడిగితే వారు నీకు చెప్తారు. పండుగ సమయంలో మేము వచ్చాం, నా మనుష్యుల మీద దయ చూపించు. దయచేసి నీకు ఏది ఇవ్వాలనిపిస్తే అదే నీ సేవకులకు నీ కుమారుడైన దావీదుకు ఇవ్వు.’ ”
దావీదు సేవకులు వచ్చి వారు నాబాలుకు దావీదు పంపిన వర్తమానాన్ని చెప్పి వేచి ఉన్నారు.
నాబాలు దావీదు సేవకులతో, “దావీదు ఎవడు? యెష్షయి కుమారుడెవడు? ఈ రోజుల్లో చాలామంది తమ యజమానులను విడిచిపెట్టి వెళ్లి పోతున్నారు.
నా ఆహారాన్ని నీటిని, నా గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్న వారి కోసం నేను సిద్ధం చేసిన మాంసాన్ని ఎక్కడి నుండి వచ్చారో నాకు తెలియని వారికి నేను ఎందుకు ఇవ్వాలి?” అన్నాడు.