కంటెంట్‌కు వెళ్లండి

Fraternity గురించి బైబిల్ వచనాలు

52 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మీరు సిగ్గుపడాలని ఇలా చెప్తున్నాను. విశ్వాసుల మధ్య గల తగాదాలు తీర్చగల జ్ఞానవంతులు మీలో ఎవరు లేరా?

  2. అలా కాకుండా, ఒక సోదరుడు మరొక సోదరున్ని న్యాయస్థానానికి తీసుకెళ్తున్నాడు, అది కూడా అవిశ్వాసుల ముందు!

  3. నిజానికి, మీ మధ్యలో తగాదాలు ఉన్నాయంటే మీరు ముందే పూర్తిగా ఓడిపోయారని అర్థం కాబట్టి మీరు దోషులుగా లేదా మోసపోయిన వారిగానే ఉండవచ్చు కాదా?

  4. అయితే మీరే మోసం చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు, మీ సహోదర సహోదరీలకు కూడా అలాగే చేస్తున్నారు.

  5. విగ్రహాలకు అర్పించబడిన ఆహారాన్ని గురించి: “మనమందరం జ్ఞానం కలిగి ఉన్నాం” అని మనకు తెలుసు. అయితే జ్ఞానం అతిశయపడేలా చేస్తుంది కాని, ప్రేమ అభివృద్ధి కలిగిస్తుంది.

  6. ఒకరు తమకు ఏమైనా తెలుసు అనుకుంటే, వారు తెలుసుకోవలసినంతగా తెలుసుకోలేదని అర్థం.

  7. అయితే దేవుని ప్రేమించేవారిని దేవుడు గుర్తిస్తారు.

  8. అందుకే, విగ్రహాలకు అర్పించిన వాటిని తినే విషయంలో: “లోకంలో విగ్రహానికి విలువలేదు, ఒకే ఒక్క దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు” అని మనకు తెలుసు.

  9. ఒకవేళ ఆకాశంలో కాని భూమి మీద కాని దేవుళ్ళు అని పిలువబడే వారు ఉన్నా (నిజానికి చాలామంది “దేవుళ్ళు” చాలామంది “ప్రభువులు” ఉన్నారు),

  10. కానీ మనకైతే ఒక్కడే తండ్రియైన దేవుడు ఉన్నాడు. ఆయన ద్వారానే అన్ని కలిగాయి. ఆయన ద్వారానే మనం జీవిస్తున్నాం; అలాగే మనకు యేసు క్రీస్తు ప్రభువు ఒక్కడే, ఆయన ద్వారానే అన్ని కలిగాయి, ఆయన ద్వారానే మనం జీవిస్తున్నాము.

  11. అయితే ఈ జ్ఞానం అందరికి లేదు. కొందరు ఇప్పటికీ విగ్రహాలను ఆరాధించేవారు తాము తినే పదార్థాలు విగ్రహాలకు బలి అర్పించినవి అని భావిస్తారు. కాబట్టి వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమవుతుంది.

  12. అయితే ఆహారం మనల్ని దేవునికి దగ్గరగా తీసుకురాదు; తినకపోతే మనకు నష్టంలేదు, తినడం వల్ల మనకు లాభం లేదు.

  13. అయితే మీకున్న అధికారాన్ని బలహీనులకు అభ్యంతరం కలిగించకుండ చూసుకోండి.

  14. ఎందుకంటే మీకున్న జ్ఞానంతో విగ్రహాలు ఉన్న మందిరంలో నీవు తినడం బలహీనమైన మనస్సాక్షి కలవారు చూస్తే, వారు విగ్రహాలను అర్పించిన వాటిని తినడానికి ధైర్యం తెచ్చుకుంటారు కదా?

  15. అందువల్ల ఎవరి కోసం క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనులైన ఆ సహోదరీ సహోదరులు నీ జ్ఞానాన్నిబట్టి నశిస్తారు.

  16. ఇలా వారికి విరోధంగా పాపం చేసి వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించినందుకు మీరు క్రీస్తుకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు.

  17. కాబట్టి నేను తిన్నదే నా సహోదరీ సహోదరులు పాపంలో పడడానికి ఒకవేళ కారణమైతే, వారు పాపంలో పడడానికి నేను కారణం కాకూడదని నేను మళ్ళీ ఎప్పుడు అలాంటి ఆహారాన్ని తినను.

  18. సహోదరీ సహోదరులారా, ఎవరైనా పాపంలో చిక్కుకొని ఉంటే, ఆత్మ వల్ల జీవిస్తున్న మీరు వారిని మృదువుగా సరియైన మార్గంలోనికి మరలా తీసుకురండి. అంతేకాక మీరు కూడా శోధనలో పడిపోవచ్చు కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి.

  19. ఒకరి భారాలను ఒకరు మోయండి, ఈ విధంగా మీరు క్రీస్తు ధర్మాన్ని నెరవేరుస్తారు.

  20. ఈ ఉత్తరంలో మేము వ్రాసిన సూచనలను పాటించని వారిని గమనించి వారు సిగ్గుపడేలా మీరు వారితో కలవకండి.

  21. అయితే వారిని శత్రువులుగా చూడవద్దు కాని, మీ తోటి విశ్వాసులుగా వారిని హెచ్చరించండి.

  22. ఈ కారణంగా మీ విశ్వాసానికి మంచితనాన్ని, మంచితనానికి వివేకాన్ని;

  23. వివేకానికి స్వీయ నియంత్రణను, స్వీయ నియంత్రణకు సహనాన్ని, సహనానికి దైవ భక్తిని;

  24. దైవ భక్తికి సోదర భావాన్ని, సోదర భావానికి ప్రేమను చేర్చడానికి కృషి చేయండి.

  25. తాను వెలుగులో ఉన్నానని చెప్తూ తన సహోదరున్ని సహోదరిని ద్వేషించేవారు ఇంకా చీకటిలోనే ఉన్నారు.