కంటెంట్‌కు వెళ్లండి

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 వచనాలు · 4 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మత్తయి 24:13సుమారు క్రీ.శ. 33

    కాని చివరి వరకు స్థిరంగా నిలబడినవారే రక్షింపబడతారు.

  2. మత్తయి 24:14సుమారు క్రీ.శ. 33

    ఈ రాజ్యసువార్త సమస్త దేశ ప్రజలకు సాక్ష్యంగా లోకమంతట ప్రకటింపబడిన తర్వాత, అంతం వస్తుంది.

  3. మత్తయి 24:15సుమారు క్రీ.శ. 33

    “కాబట్టి ‘నిర్జనంగా మారడానికి కారణమైన హేయమైనది’ పరిశుద్ధ స్థలంలో నిలబడడం మీరు చూసినప్పుడు, దానియేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట, చదివేవాడు అర్థం చేసుకొనును గాక.

  4. మత్తయి 24:16సుమారు క్రీ.శ. 33

    అప్పుడు యూదయలోని వారు కొండల్లోకి పారిపోవాలి.

  5. మత్తయి 24:17సుమారు క్రీ.శ. 33

    ఇంటిపైన ఉన్నవారెవరు క్రిందికి దిగకూడదు ఇంట్లోకి వెళ్లి దేన్ని బయటకు తీసుకురాకూడదు.

  6. మత్తయి 24:18సుమారు క్రీ.శ. 33

    పొలంలో ఉన్నవారు తమ పైవస్త్రాన్ని తెచ్చుకోడానికి తిరిగి వెనుకకు వెళ్లకూడదు.

  7. మత్తయి 24:19సుమారు క్రీ.శ. 33

    ఆ దినాల్లో గర్భిణి స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు శ్రమ!

  8. మత్తయి 24:20సుమారు క్రీ.శ. 33

    అందుకే చలికాలంలో కాని సబ్బాతు దినాన కాని పారిపోయే పరిస్థితి రాకుండా ప్రార్థించండి.

  9. మత్తయి 24:21సుమారు క్రీ.శ. 33

    ఎందుకంటే లోకం సృష్టించినప్పటి నుండి నేటి వరకు అలాంటి శ్రమ రాలేదు. మరి ఎప్పటికీ రాదు.

  10. మత్తయి 24:22సుమారు క్రీ.శ. 33

    “ఒకవేళ ఆ దినాలను తగ్గించకపోతే ఎవ్వరూ తప్పించుకోలేరు, అయితే ఎన్నుకోబడినవారి కోసం ఆ రోజులు తగ్గించబడతాయి.

  11. మత్తయి 24:23సుమారు క్రీ.శ. 33

    ఆ కాలంలో ఎవరైనా, ‘ఇదిగో, క్రీస్తు ఇక్కడ ఉన్నాడు!’ లేదా, ‘ఆయన అక్కడ ఉన్నాడు!’ అని చెప్పితే, నమ్మకండి.

  12. మత్తయి 24:24సుమారు క్రీ.శ. 33

    ఎందుకంటే అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి దేవుడు ఏర్పరచబడిన వారిని కూడా మోసం చేయడానికి గొప్ప సూచకక్రియలను, అద్భుతాలను చేస్తారు.

  13. మత్తయి 24:25సుమారు క్రీ.శ. 33

    చూడండి, ఈ విషయాలను నేను మీకు ముందుగానే చెప్పాను.

  14. మత్తయి 24:26సుమారు క్రీ.శ. 33

    “కాబట్టి ఎవరైనా, ‘ఇదిగో, ఆయన అరణ్యంలో ఉన్నాడు’ అని మీతో చెబితే, వెళ్లకండి; లేదా ‘ఇదిగో ఆయన ఇక్కడ, లోపలి గదిలో ఉన్నాడు’ అని చెప్పితే నమ్మకండి.

  15. మత్తయి 24:27సుమారు క్రీ.శ. 33

    మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలా కనబడుతుందో, అలాగే మనుష్యకుమారుని రాకడ ఉంటుంది.

  16. మత్తయి 24:28సుమారు క్రీ.శ. 33

    ఎక్కడ పీనుగు ఉంటే అక్కడ గద్దలు పోగవుతాయి.

  17. మత్తయి 24:29సుమారు క్రీ.శ. 33

    “ఆ శ్రమకాలం ముగిసిన వెంటనే, “ ‘సూర్యుడు నల్లగా మారుతాడు, చంద్రుడు తన కాంతిని కోల్పోతాడు. ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపోతాయి, ఆకాశ సంబంధమైనవి చెదిరిపోతాయి.’

  18. మత్తయి 24:30సుమారు క్రీ.శ. 33

    “అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశంలో కనిపిస్తుంది. భూప్రజలందరు మనుష్యకుమారుడు తన ప్రభావంతో, గొప్ప మహిమతో ఆకాశ మేఘాల మీద రావడం చూసి ప్రజలు రొమ్ము కొట్టుకొంటూ రోదిస్తారు.

  19. మత్తయి 24:31సుమారు క్రీ.శ. 33

    గొప్ప బూర శబ్దంతో పిలుపుతో ఆయన తన దూతలను పంపుతారు, వారు నలుదిక్కుల నుండి, ఆకాశాల ఒక చివర నుండి మరొక చివర వరకు ఆయనచేత ఎన్నుకోబడిన వారిని పోగుచేస్తారు.

  20. మత్తయి 24:32సుమారు క్రీ.శ. 33

    “అంజూర చెట్టును చూసి ఒక పాఠం నేర్చుకోండి: అంజూర కొమ్మలు లేతవై చిగురిస్తున్నప్పుడు వేసవికాలం సమీపంగా ఉందని మీకు తెలుస్తుంది.

  21. మత్తయి 24:33సుమారు క్రీ.శ. 33

    ఆ ప్రకారంగానే, ఈ సంగతులన్ని జరుగుతున్నాయని మీరు చూసినప్పుడు, ఆయన రాకడ దగ్గరలో, ద్వారం దగ్గరే ఉందని మీరు తెలుసుకోండి.

  22. మత్తయి 24:34సుమారు క్రీ.శ. 33

    ఇవన్నీ జరిగే వరకు, ఈ తరం గతించదని ఖచ్చితంగా మీతో చెప్తున్నాను.

  23. మత్తయి 24:35సుమారు క్రీ.శ. 33

    ఆకాశం భూమి గతించిపోతాయి గాని నా మాటలు ఏమాత్రం గతించవు.

  24. మత్తయి 24:36సుమారు క్రీ.శ. 33

    “అయితే ఆ దినం గురించి ఆ సమయం గురించి ఎవరికి తెలియదు, కనీసం పరలోకంలోని దూతలకు గాని, తన కుమారునికి గాని తెలియదు. కేవలం తండ్రికి మాత్రమే తెలుసు,

  25. మత్తయి 24:37సుమారు క్రీ.శ. 33

    నోవహు దినాల్లో ఎలా ఉన్నదో, మనుష్యకుమారుని రాకడలో కూడా అలాగే ఉంటుంది.