- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa AD 30–62
The Early Church
Pentecost ignites a movement; Peter, Paul, and countless others carry the gospel from Jerusalem to the ends of the earth.
ఈ కాలపు వచనాలు
- అపొస్తలుల కార్యములు 9:33సుమారు క్రీ.శ. 35
అక్కడ పక్షవాతంతో ఎనిమిది సంవత్సరాలుగా మంచం మీద ఉన్న ఐనెయ అనే వ్యక్తిని కలిశాడు.
- అపొస్తలుల కార్యములు 9:34సుమారు క్రీ.శ. 35
పేతురు అతనితో, “ఐనెయా, యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరస్తున్నారు. నీవు లేచి నీ పడకను సర్దుకో” అని చెప్పిన వెంటనే ఐనెయ లేచి నిలబడ్డాడు.
- అపొస్తలుల కార్యములు 9:35సుమారు క్రీ.శ. 35
లుద్ద షారోనులో నివసించే వారందరు అతన్ని చూసి ప్రభువు వైపుకు తిరిగారు.
- అపొస్తలుల కార్యములు 9:36సుమారు క్రీ.శ. 35
యొప్పే పట్టణంలో తబితా అనే ఒక శిష్యురాలు ఉంది, గ్రీకు భాషలో ఆమెకు దొర్కా అని పేరు దానికి లేడి అని అర్థము. ఆమె ఎప్పుడూ మంచి పనులు చేస్తూ పేదలకు సహాయం చేసేది.
- అపొస్తలుల కార్యములు 9:37సుమారు క్రీ.శ. 35
ఆ సమయంలో ఆమె అనారోగ్యంతో చనిపోయింది, కాబట్టి ఆమె శరీరాన్ని కడిగి మేడ గదిలో ఉంచారు.
- అపొస్తలుల కార్యములు 9:38సుమారు క్రీ.శ. 35
లుద్ద యొప్పేకు దగ్గరగా ఉంటుంది. పేతురు లుద్దలో ఉన్నాడని శిష్యులు విని, “వెంటనే రమ్మని బ్రతిమాలడానికి” ఇద్దరిని అతని దగ్గరకు పంపించారు.
- అపొస్తలుల కార్యములు 9:39సుమారు క్రీ.శ. 35
కాబట్టి పేతురు వారితో వెళ్లాడు, అతడు అక్కడ చేరుకొన్న తర్వాత అతన్ని మేడ గదికి తీసుకెళ్లారు. విధవరాండ్రందరు అతని చుట్టూ నిలబడి, ఏడుస్తూ దొర్కా తమతో ఉన్నప్పుడు ఆమె తయారుచేసిన అంగీలను ఇతర వస్త్రాలను అతనికి చూపించారు.
- అపొస్తలుల కార్యములు 9:40సుమారు క్రీ.శ. 35
పేతురు వారందరిని గది నుండి బయటకు పంపించి, మోకరించి ప్రార్థించాడు. చనిపోయిన ఆ స్త్రీ శవం వైపు తిరిగి, “తబితా లే!” అని చెప్పాడు. ఆమె తన కళ్లను తెరిచి పేతురును చూసి లేచి కూర్చుంది.
- అపొస్తలుల కార్యములు 9:41సుమారు క్రీ.శ. 35
అతడు ఆమె చేయి పట్టుకుని పైకి లేపి నిలబెట్టాడు. అప్పుడు అతడు విశ్వాసులను, ముఖ్యంగా విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవంగా వారికి అప్పగించాడు.
- అపొస్తలుల కార్యములు 9:42సుమారు క్రీ.శ. 35
ఈ సంగతి యొప్పే పట్టణమంతా తెలిసి, చాలామంది ప్రజలు ప్రభువును నమ్ముకున్నారు.
- అపొస్తలుల కార్యములు 9:43సుమారు క్రీ.శ. 35
పేతురు సీమోను అనే చర్మకారునితో కలిసి కొంతకాలం యొప్పే పట్టణంలో ఉన్నాడు.
- అపొస్తలుల కార్యములు 10:1సుమారు క్రీ.శ. 41
ఇటలీ దేశ సైనిక దళానికి శతాధిపతి యైన కొర్నేలీ అనే వ్యక్తి కైసరయ పట్టణంలో ఉన్నాడు.
- అపొస్తలుల కార్యములు 10:2సుమారు క్రీ.శ. 41
అతడు అతని కుటుంబమంతా దేవుని యందు భయభక్తులు కలిగినవారు; అవసరంలో ఉన్న ప్రజలకు ధారాళంగా దానధర్మాలు చేస్తూ క్రమంగా దేవునికి ప్రార్థన చేసేవాడు.
- అపొస్తలుల కార్యములు 10:3సుమారు క్రీ.శ. 41
ఒక రోజు మధ్యాహ్నం సుమారు మూడు గంటలప్పుడు అతనికి ఒక దర్శనం కలిగింది. ఒక దేవదూత ప్రత్యక్షమై, “కొర్నేలీ!” అని పిలువడం ఆ దర్శనంలో స్పష్టంగా కనబడింది.
- అపొస్తలుల కార్యములు 10:4సుమారు క్రీ.శ. 41
కొర్నేలీ భయంతో అతన్ని తేరి చూస్తూ, “ఏమిటి, ప్రభువా?” అని అడిగాడు. అప్పుడు ఆ దూత, “నీ ప్రార్థనలు పేదవారికి నీవు చేసిన దానధర్మాలు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థ అర్పణగా చేరాయి.
- అపొస్తలుల కార్యములు 10:5సుమారు క్రీ.శ. 41
నీవు మనుష్యులను యొప్పే పట్టణానికి పంపి పేతురు అని పిలువబడే సీమోనును పిలిపించు.
- అపొస్తలుల కార్యములు 10:6సుమారు క్రీ.శ. 41
అతడు సముద్రపు ఒడ్డున ఉన్న సీమోను అనే చర్మకారుని ఇంట్లో ఉన్నాడు” అని చెప్పాడు.
- అపొస్తలుల కార్యములు 10:7సుమారు క్రీ.శ. 41
అతనితో మాట్లాడిన ఆ దేవదూత వెళ్లిపోయిన తర్వాత కొర్నేలీ తన సేవకులలో ఇద్దరిని, తన వ్యక్తిగత సేవలు చేసే దైవభక్తి గల ఒక సైనికుని పిలిచాడు.
- అపొస్తలుల కార్యములు 10:8సుమారు క్రీ.శ. 41
వారికి జరిగినదంతా చెప్పి యొప్పేకు పంపించాడు.
- అపొస్తలుల కార్యములు 10:9సుమారు క్రీ.శ. 41
వారు బయలుదేరి ప్రయాణమై పట్టణాన్ని చేరుకోబోతున్నప్పటికి మరుసటిరోజు సుమారు మధ్యాహ్న సమయంలో, పేతురు ప్రార్థన చేసుకోవడానికి ఇంటి పైకప్పుకు వెళ్లాడు.
- అపొస్తలుల కార్యములు 10:10సుమారు క్రీ.శ. 41
అతనికి చాలా ఆకలివేసి ఏమైనా తినాలని అనిపించింది, భోజనం సిద్ధం చేస్తుండగా అతడు స్వాప్నిక స్థితిలోనికి వెళ్లాడు.
- అపొస్తలుల కార్యములు 10:11సుమారు క్రీ.శ. 41
అప్పుడతడు పరలోకం తెరువబడి నాలుగు మూలలు పట్టుకోబడి భూమి మీదకు దింపబడుతున్న ఒక పెద్ద దుప్పటి వంటి దాన్ని చూశాడు.
- అపొస్తలుల కార్యములు 10:12సుమారు క్రీ.శ. 41
దానిలో నాలుగు కాళ్లున్న అన్ని రకాల జంతువులు, ప్రాకే ప్రాణులు పక్షులు ఉన్నాయి.
- అపొస్తలుల కార్యములు 10:13సుమారు క్రీ.శ. 41
అప్పుడు ఒక స్వరం అతనితో ఇలా అన్నది: “పేతురు, లేచి వాటిని చంపుకొని తిను.”
- అపొస్తలుల కార్యములు 10:14సుమారు క్రీ.శ. 41
అందుకు పేతురు, “లేదు, ప్రభువా! నేను అపరిశుభ్రమైనది అపవిత్రమైనది ఎప్పుడూ తినలేదు” అని జవాబిచ్చాడు.