కంటెంట్‌కు వెళ్లండి

circa 1050–1010 BC

Samuel & King Saul

Israel demands a king; Samuel anoints Saul, whose disobedience leads to his rejection as God chooses a man after his own heart.

810 వచనాలు · 1 గ్రంథం చేర్చబడింది

  1. 1 సమూయేలు 14:5సుమారు క్రీ.పూ. 1087

    మిక్మషుకు ఉత్తరం వైపు ఒక కొండ శిఖరం, గెబాకు దక్షిణం వైపు రెండవ కొండ శిఖరం ఉన్నాయి.

  2. 1 సమూయేలు 14:6సుమారు క్రీ.పూ. 1087

    యోనాతాను తన ఆయుధాలను మోసే యువకునితో, “ఈ సున్నతిలేనివారి సైనిక స్థావరాల మీదికి వెళ్దాం రా, బహుశా యెహోవా మన కోసం కార్యం చేయవచ్చు. ఎక్కువ మంది నుండైనా కొద్దిమంది నుండైనా రక్షించడానికి యెహోవాకు ఏది అడ్డు కాదు” అని అన్నాడు.

  3. 1 సమూయేలు 14:7సుమారు క్రీ.పూ. 1087

    అందుకు ఆ యువకుడు, “మీ మనస్సులో ఏముందో అది చెయ్యండి; పదండి, మీ నిర్ణయమేదైనా నేను మీతోనే ఉంటాను” అన్నాడు.

  4. 1 సమూయేలు 14:8సుమారు క్రీ.పూ. 1087

    అప్పుడు యోనాతాను, “మనం వారి దగ్గరకు వెళ్లి వారు మనలను చూసేలా చేద్దాము.

  5. 1 సమూయేలు 14:9సుమారు క్రీ.పూ. 1087

    వారు మనలను చూసి, మేము మీ దగ్గరకు వచ్చేవరకు అక్కడ ఉండమని చెప్తే, వారి దగ్గరకు వెళ్లకుండా మనమున్న చోటనే ఉందాము.

  6. 1 సమూయేలు 14:10సుమారు క్రీ.పూ. 1087

    మా దగ్గరకు రండని వారు చెప్తే మనం పైకి ఎక్కుదాము. ఎందుకంటే యెహోవా వారిని మన చేతికి అప్పగించారనడానికి మనకు అదే గుర్తు” అన్నాడు.

  7. 1 సమూయేలు 14:11సుమారు క్రీ.పూ. 1087

    వీరిద్దరు కావాలనే ఫిలిష్తీయుల సైనిక స్థావరాలకు కనిపించారు. అప్పుడు ఫిలిష్తీయులు, “చూడండి, తాము దాక్కున్న గుహల్లో నుండి హెబ్రీయులు బయలుదేరి వస్తున్నారు” అన్నారు.

  8. 1 సమూయేలు 14:12సుమారు క్రీ.పూ. 1087

    సైనిక స్థావరంలో నుండి ఒకడు యోనాతానును అతని ఆయుధాలను మోసేవాన్ని పిలిచి, “మీరైతే పైకి రండి, మీకు పాఠం నేర్పిస్తాం” అన్నాడు. యోనాతాను తన ఆయుధాలను మోసేవానితో, “నా వెనుకనే నీవు పైకి ఎక్కు; యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించారు” అని చెప్పాడు.

  9. 1 సమూయేలు 14:13సుమారు క్రీ.పూ. 1087

    యోనాతాను, అతని ఆయుధాలను మోసేవాడు తమ చేతులు కాళ్లను ఉపయోగించి పైకి ఎక్కారు. యోనాతాను దెబ్బకు ఫిలిష్తీయులు పడిపోగా అతని వెనుక వస్తున్న అతని ఆయుధాలను మోసేవాడు వారిని చంపాడు.

  10. 1 సమూయేలు 14:14సుమారు క్రీ.పూ. 1087

    యోనాతాను, అతని ఆయుధాలను మోసేవాడు చేసిన ఆ మొదటి దాడిలో దాదాపుగా ఇరవైమంది చనిపోయారు; అర ఎకరం నేలలో అది జరిగింది.

  11. 1 సమూయేలు 14:15సుమారు క్రీ.పూ. 1087

    శిబిరంలో పొలంలో ఉన్న సైన్యమంతటిలో భయాందోళనలు అలుముకున్నాయి. సైనిక స్థావరంలో ఉన్నవారు, దోచుకునేవారు భయపడ్డారు, భూమి కంపించింది. అది దేవుని వలన కలిగిన భయము.

  12. 1 సమూయేలు 14:16సుమారు క్రీ.పూ. 1087

    బెన్యామీనులోని గిబియాలో ఉన్న సౌలు గూఢాచారులు సైన్యం అన్నివైపులకు చెదిరిపోవడం చూశారు.

  13. 1 సమూయేలు 14:17సుమారు క్రీ.పూ. 1087

    సౌలు తనతో ఉన్న ప్రజలతో, “మన బలగంలో ఎవరు లేరో చూడండి” అన్నాడు. యోనాతాను, అతని ఆయుధాలను మోసేవాడు లేరని వారు తెలుసుకున్నారు.

  14. 1 సమూయేలు 14:18సుమారు క్రీ.పూ. 1087

    సౌలు అహీయాతో, “దేవుని మందసాన్ని ఇక్కడకు తీసుకురా” అని చెప్పాడు. ఆ సమయంలో దేవుని మందసం ఇశ్రాయేలీయుల దగ్గరే ఉంది.

  15. 1 సమూయేలు 14:19సుమారు క్రీ.పూ. 1087

    సౌలు యాజకునితో మాట్లాడుతుండగా ఫిలిష్తీయుల శిబిరంలో గందరగోళం మరి ఎక్కువ అయ్యింది. కాబట్టి సౌలు యాజకునితో, “నీ చేయి వెనుకకు తీసుకో” అని చెప్పాడు.

  16. 1 సమూయేలు 14:20సుమారు క్రీ.పూ. 1087

    సౌలు, అతని దగ్గర ఉన్నవారంతా కలిసి యుద్ధానికి వెళ్లారు. అక్కడ ఫిలిష్తీయులు ఎంతో కలవరపడి తమ కత్తులతో ఒకరినొకరు చంపుకోవడం చూశారు.

  17. 1 సమూయేలు 14:21సుమారు క్రీ.పూ. 1087

    అంతకుముందు ఫిలిష్తీయుల స్వాధీనంలో ఉన్నవారు, వారితో పాటు శిబిరానికి వచ్చిన హెబ్రీయులు సౌలు యోనాతానులతో ఉన్న ఇశ్రాయేలీయుల దగ్గరకు వచ్చి వారితో కలిసిపోయారు.

  18. 1 సమూయేలు 14:22సుమారు క్రీ.పూ. 1087

    అంతేకాక ఎఫ్రాయిం కొండ ప్రాంతంలో దాక్కున్న ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులు పారిపోయారని విని వారిని తరమడానికి యుద్ధంలో చేరారు.

  19. 1 సమూయేలు 14:23సుమారు క్రీ.పూ. 1087

    ఆ రోజే యెహోవా ఇశ్రాయేలీయులను రక్షించారు, యుద్ధం బేత్-ఆవెను అవతల వరకు సాగింది.

  20. 1 సమూయేలు 14:24సుమారు క్రీ.పూ. 1087

    “సాయంత్రం అయ్యేవరకు, నేను నా శత్రువుల మీద పగతీర్చుకునే వరకు ఎవరైనా భోజనం చేస్తే వారు శపించబడతారు” అని సౌలు ప్రజలచేత ప్రమాణం చేయించాడు. కాబట్టి ఆ రోజు ఇశ్రాయేలీయులందరు ఏమీ తినలేదు.

  21. 1 సమూయేలు 14:25సుమారు క్రీ.పూ. 1087

    సైన్యమంతా అడవిలోకి వచ్చినప్పుడు అక్కడ నేల మీద తేనె కనపడింది.

  22. 1 సమూయేలు 14:26సుమారు క్రీ.పూ. 1087

    వారు ఆ అడవిలోకి వెళ్లగా తేనె ధారలుగా కారుతూ ఉంది కాని ప్రజలు తాము చేసిన ప్రమాణానికి భయపడి ఒకరు కూడా చేయి నోటిలో పెట్టుకోలేదు.

  23. 1 సమూయేలు 14:27సుమారు క్రీ.పూ. 1087

    అయితే యోనాతాను తన తండ్రి ప్రజలతో చేయించిన ప్రమాణాన్ని వినలేదు కాబట్టి తన చేతిలో ఉన్న కర్రను చాపి దాని అంచును తేనెతెట్టెలో ముంచి తన చేయి నోటిలో పెట్టుకున్నప్పుడు అతని కళ్లు ప్రకాశించాయి.

  24. 1 సమూయేలు 14:28సుమారు క్రీ.పూ. 1087

    అప్పుడు ఒక సైనికుడు అతనితో, “ ‘ఈ రోజు భోజనం చేసినవారు శపించబడతారు’ అని మీ తండ్రి సైన్యంతో ఖచ్చితమైన ప్రమాణాన్ని చేయించాడు; అందుకే ప్రజలంతా అలసిపోయి ఉన్నారు” అని చెప్పాడు.

  25. 1 సమూయేలు 14:29సుమారు క్రీ.పూ. 1087

    అందుకు యోనాతాను, “దేశం కష్టపడడానికి నా తండ్రి కారణమయ్యాడు. నేను ఈ తేనె కొంచెం తినగానే నా కళ్లు ఎంత ప్రకాశిస్తున్నాయో చూడు.