కంటెంట్‌కు వెళ్లండి

Jerusalem

753 verses · 2 known names

ఇలా కూడా పిలుస్తారు: Jerusalem's

31.7700, 35.2300 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి

Jerusalem ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెరూషలేమా, నీ హృదయంలోని చెడును కడిగి రక్షించబడు. మీరు ఎంతకాలం చెడ్డ ఆలోచనలను కలిగి ఉంటారు?

  2. “దేశాలకు ఈ విషయం చెప్పండి, యెరూషలేము గురించి ఇలా ప్రకటించండి: ‘దూరదేశం నుండి ముట్టడి చేస్తున్న సైన్యం, యూదా పట్టణాలకు వ్యతిరేకంగా యుద్ధ కేకలు వేస్తుంది.

  3. “యెరూషలేము వీధుల్లోకి వెళ్లి, చుట్టూ చూసి పరిశీలించండి, దాని కూడళ్లలో వెదకండి. నమ్మకంగా వ్యవహరించే సత్యాన్ని వెదికే ఒక్క వ్యక్తినైనా మీరు కనుగొనగలిగితే, నేను ఈ పట్టణాన్ని క్షమిస్తాను.

  4. “బెన్యామీను ప్రజలారా, క్షేమం కోసం పారిపోండి! యెరూషలేము నుండి పారిపోండి! తెకోవాలో బూరధ్వని చేయండి! బేత్-హక్కెరెము మీద సంకేతం కోసం ధ్వజం నిలబెట్టండి! ఎందుకంటే ఉత్తర దిక్కునుండి విపత్తు వస్తుంది, భయంకరమైన విధ్వంసం కూడా వస్తుంది.

  5. సైన్యాల యెహోవా చెప్పేదేమిటంటే: “చెట్లను నరికి యెరూషలేముపై ముట్టడి దిబ్బలను కట్టండి. ఈ పట్టణం శిక్షించబడాలి; ఇందులో అణచివేయడం తప్ప ఏమీ లేదు.

  6. యెరూషలేమా, ఈ హెచ్చరికను తీవ్రమైనదిగా తీసుకో, లేకపోతే నేను నిన్ను వదిలేసి నీ దేశాన్ని నిర్జనంగా చేస్తాను అందులో ఎవరూ నివసించలేరు.”

  7. యూదా పట్టణాల్లో, యెరూషలేము వీధుల్లో వారు ఏమి చేస్తున్నారో మీరు చూడడం లేదా?

  8. యూదా పట్టణాల్లోనూ, యెరూషలేము వీధుల్లోనూ వధూవరుల స్వరాలను, ఆనంద సంతోష ధ్వనులను నేను అంతం చేస్తాను, ఎందుకంటే దేశం నిర్జనమైపోతుంది.

  9. “ ‘ఆ సమయంలో, యూదా రాజుల, అధికారుల ఎముకలు, యాజకుల, ప్రవక్తల ఎముకలు, అలాగే యెరూషలేము ప్రజల ఎముకలు వారి సమాధుల నుండి తీసివేయబడతాయి అని యెహోవా ప్రకటన చేస్తున్నారు.

  10. “నేను యెరూషలేమును శిథిలాల కుప్పగా, నక్కల విహారంగా చేస్తాను. నేను యూదా పట్టణాలను నాశనం చేస్తాను, అక్కడ ఎవరూ నివసించలేరు.”

  11. “ఈ నిబంధనలోని షరతులను విని, యూదా ప్రజలకు, యెరూషలేములో నివసించేవారికి చెప్పండి.

  12. యెహోవా నాతో ఇలా అన్నాడు: “యూదా పట్టణాల్లోనూ, యెరూషలేము వీధుల్లోనూ ఈ మాటలన్నీ ప్రకటించు: ‘ఈ ఒడంబడికలోని నియమాలను విని వాటిని అనుసరించండి.

  13. అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు: “యూదా ప్రజల్లోనూ, యెరూషలేములో నివసించేవారిలోనూ కుట్ర ఉంది.

  14. యూదా పట్టణాలు, యెరూషలేము ప్రజలు వెళ్లి తాము ధూపం వేసే దేవుళ్ళకు మొరపెట్టుకుంటారు, అయితే విపత్తు వచ్చినప్పుడు వారు ఏమాత్రం సహాయం చేయరు.

  15. యూదా, నీకు ఎన్ని పట్టణాలున్నాయో అంతమంది దేవుళ్ళు ఉన్నారు. ఆ అవమానకరమైన దేవుడైన బయలుకు ధూపం వేయడానికి మీరు ఏర్పాటుచేసిన బలిపీఠాలు యెరూషలేము వీధులంత విస్తారంగా ఉన్నాయి.’

  16. “యెహోవా ఇలా అంటున్నారు: ‘నేను యూదా గర్వాన్ని, యెరూషలేము గొప్ప అహంకారాన్ని కూడా అదే విధంగా నాశనం చేస్తాను.

  17. వారితో ఇలా చెప్పు, ‘యెహోవా ఇలా చెప్తున్నారు: దావీదు సింహాసనం మీద ఆసీనులైన రాజులు, యాజకులు, ప్రవక్తలు, యెరూషలేములో నివసిస్తున్న వారందరితో సహా ఈ దేశంలో నివసించే వారందరినీ నేను మత్తులో మునిగేలా చేయబోతున్నాను.

  18. నీ వ్యభిచారాలు, కామపు సకిలింపులు, నీ సిగ్గులేని వ్యభిచారం! కొండలమీద, పొలాల్లో నీ హేయమైన పనులు నేను చూశాను. యెరూషలేమా, నీకు శ్రమ! నీవు ఎంతకాలం అపవిత్రంగా ఉంటావు?”

  19. “యూదా దుఃఖిస్తుంది, ఆమె పట్టణాలు వాడిపోతున్నాయి. వారు భూమి కోసం విలపిస్తున్నారు, యెరూషలేము నుండి కేకలు వినిపిస్తున్నాయి.

  20. వారు ఎవరికి ప్రవచిస్తున్నారో ఆ ప్రజలు కరువు, ఖడ్గం కారణంగా యెరూషలేము వీధుల్లోకి విసిరివేయబడతారు. వారిని, వారి భార్యలను, వారి కుమారులను వారి కుమార్తెలను పాతిపెట్టడానికి ఎవరూ ఉండరు. నేను వారికి తగిన విపత్తును వారిపై కురిపిస్తాను.

  21. యూదా రాజైన హిజ్కియా కుమారుడైన మనష్షే యెరూషలేములో చేసిన దానిని బట్టి భూమి మీద ఉన్న అన్ని రాజ్యాలకు నేను వారిని అసహ్యమైన వారిగా చేస్తాను.

  22. “యెరూషలేమా, నీ మీద ఎవరు జాలి చూపిస్తారు? నీకోసం ఎవరు దుఃఖిస్తారు? నీ క్షేమసమాచారం ఎవరు అడుగుతారు?

  23. యెహోవా నాతో ఇలా అన్నారు: “నీవు వెళ్లి యూదా రాజులు వెళ్లే ప్రజల ద్వారం దగ్గర నిలబడు. యెరూషలేము యొక్క అన్ని ఇతర ద్వారాల దగ్గర కూడా నిలబడు.

  24. నీవు వారితో, ‘ఈ ద్వారాల గుండా వచ్చే యూదా రాజులారా, సర్వ యూదా ప్రజలారా, యెరూషలేములో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ యెహోవా మాట వినండి.

  25. యెహోవా ఇలా అంటున్నారు: సబ్బాతు దినాన ఏ బరువులు మోయకుండా, వాటిని యెరూషలేము ద్వారాల గుండా తీసుకురాకుండా జాగ్రత్తపడండి.