కంటెంట్‌కు వెళ్లండి

Jerusalem

753 verses · 2 known names

ఇలా కూడా పిలుస్తారు: Jerusalem's

31.7700, 35.2300 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి

Jerusalem ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. దావీదు సింహాసనం మీద కూర్చున్న రాజులు తమ అధికారులతో కలిసి ఈ నగర ద్వారాల గుండా వస్తారు. వారు, వారి అధికారులు రథాల మీద, గుర్రాల మీద స్వారీ చేస్తూ, యూదా వారితో, యెరూషలేము నివాసులతో కలిసి వస్తారు, ఈ పట్టణం శాశ్వతంగా ఉంటుంది.

  2. యూదా పట్టణాల నుండి, యెరూషలేము చుట్టుప్రక్కల గ్రామాల నుండి, బెన్యామీను ప్రాంతం నుండి, పడమటి కొండ దిగువ ప్రదేశాల నుండి, కొండ ప్రదేశాల నుండి, దక్షిణ వైపు నుండి ప్రజలు దహనబలులను, బలులను, భోజనార్పణలను, ధూపద్రవ్యాలను, కృతజ్ఞతార్పణలను యెహోవా ఆలయానికి తీసుకువస్తారు.

  3. అయితే మీరు సబ్బాతు దినాన యెరూషలేము గుమ్మాల గుండా వస్తున్నప్పుడు ఎలాంటి బరువును మోస్తూ రాకుండ సబ్బాతు దినాన్ని పవిత్రంగా ఆచరించడంలో మీరు నాకు విధేయత చూపితే సరి, లేకపోతే నేను యెరూషలేము గుమ్మాల్లో ఆర్పలేని అగ్నిని రప్పిస్తాను, అది దాని భవనాలను దహించివేస్తుంది.’ ”

  4. “కాబట్టి ఇప్పుడు యూదా ప్రజలతోను, యెరూషలేము నివాసులతోను ఇలా చెప్పు, ‘యెహోవా ఇలా అంటున్నారు: చూడండి! నేను మీ కోసం ఒక విపత్తును రప్పిస్తున్నాను, మీకు వ్యతిరేకంగా ఒక ఆలోచన చేస్తున్నాను. కాబట్టి మీలో ప్రతి ఒక్కరు మీ చెడు మార్గాలను విడిచిపెట్టి, మీ ప్రవర్తనను సరిచేసుకోండి.’

  5. ఇలా చెప్పు, ‘యూదా రాజులారా, యెరూషలేము ప్రజలారా, యెహోవా మాట వినండి. ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా చెప్తున్నారు: వినండి! నేను ఈ స్థలం మీదికి ఒక విపత్తును తెచ్చి, దాని గురించి వినేవారందరి చెవులు గింగురుమనేలా చేస్తాను.

  6. “ ‘ఈ స్థలంలో నేను యూదా, యెరూషలేము ప్రణాళికలను నాశనం చేస్తాను. వారిని చంపాలనుకునే శత్రువుల చేతిలో వారు కత్తివేటుకు గురయ్యేలా చేస్తాను, వారి శవాలను పక్షులకు, అడవి జంతువులకు ఆహారంగా వేస్తాను.

  7. యెరూషలేములోని ఇల్లు, యూదా రాజుల భవనాలు ఆ తోఫెతు స్థలంలా అపవిత్రం చేయబడతాయి. అన్ని ఇళ్ల మీద ప్రజలు ఆకాశ సైన్యాలకు ధూపం వేసి, ఇతర దేవుళ్ళకు పానార్పణలు అర్పించారు.’ ”

  8. అతడు యెరూషలేము గుమ్మాల బయటకు ఈడ్వబడి, అక్కడ విసిరివేయబడి ఒక గాడిదలా పాతిపెట్టబడతాడు.”

  9. యెరూషలేము ప్రవక్తల్లో భయంకరమైనది నేను చూశాను: వారు వ్యభిచారం చేస్తారు, అబద్ధాలతో జీవిస్తారు. వారు దుర్మార్గుల చేతులను బలపరుస్తారు, వారిలో ఒక్కరు కూడా తమ దుష్టత్వాన్ని విడిచిపెట్టరు. వారందరూ నాకు సొదొమలాంటివారు; యెరూషలేము ప్రజలు గొమొర్రా వంటివారు.”

  10. కాబట్టి సైన్యాల యెహోవా ప్రవక్తలను గురించి ఇలా అంటున్నారు: “నేను వారిని చేదు ఆహారం తినేలా చేస్తాను, విషపూరితమైన నీళ్లు త్రాగేలా చేస్తాను, ఎందుకంటే యెరూషలేము ప్రవక్తల భక్తిహీనత దేశమంతటా వ్యాపించింది.”

  11. యూదారాజు యెహోయాకీము కుమారుడైన యెహోయాకీనును, అధికారులను, నైపుణ్యం కలిగిన పనివారిని, యూదా కళాకారులను బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము నుండి బబులోనుకు బందీలుగా తీసుకెళ్లిన తర్వాత, యెహోవా మందిరం ముందున్న రెండు బుట్టల అంజూర పండ్లు యెహోవా నాకు చూపించారు.

  12. “ ‘అయితే, నేను యూదా రాజైన సిద్కియాకు, అతని అధికారులకు, యెరూషలేములో మిగిలిన వారికి ఈజిప్టులో నివసిస్తున్న వారికి తినలేనంతగా పాడైన అంజూర పండ్లకు చేసినట్టు చేస్తానని యెహోవా ప్రకటిస్తున్నారు.

  13. కాబట్టి యిర్మీయా ప్రవక్త యూదా ప్రజలందరితో, యెరూషలేములో నివసిస్తున్న వారందరితో ఇలా అన్నాడు:

  14. అవి నేడు ఉన్నట్లుగా నాశనం చేయడానికి వాటిని నిర్జనంగా ఎగతాళిగా ఒక శాపంగా మార్చడానికి యెరూషలేముకు, యూదా పట్టణాలకు, దాని రాజులకు అధికారులకు దానిని త్రాగించాను;

  15. “మోరెషెతు వాడైన మీకా ప్రవక్త యూదా రాజైన హిజ్కియా దినాల్లో ప్రవచించాడు. అతడు యూదా ప్రజలందరితో ఇలా చెప్పాడు, ‘సైన్యాల యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘సీయోను ఒక పొలంలా దున్నబడుతుంది, యెరూషలేము రాళ్ల కుప్పగా మారుతుంది, ఆలయమున్న కొండ దట్టమైన పొదలతో నిండిపోతుంది.’

  16. యూదా రాజైన సిద్కియా దగ్గరకు యెరూషలేముకు వచ్చిన రాయబారులతో ఎదోము, మోయాబు, అమ్మోను, తూరు, సీదోను రాజులకు కబురు పంపించు.

  17. ఒకవేళ వారు ప్రవక్తలైతే వారు యెహోవా మాటలు కలిగి ఉన్నట్లయితే, యెహోవా మందిరంలో, యూదారాజు రాజభవనంలో యెరూషలేములో మిగిలి ఉన్న వస్తువులను బబులోనుకు తీసుకెళ్లవద్దని వారు సైన్యాల యెహోవాను వేడుకోవడం మంచిది.

  18. వేటినైతే యూదా రాజైన యెహోయాకీము కుమారుడైన యెహోయాకీనును, యూదా యెరూషలేము పెద్దలందరిని యెరూషలేము నుండి బబులోనుకు బందీగా తీసుకెళ్లినప్పుడు బబులోను రాజైన నెబుకద్నెజరు తీసుకెళ్లలేదో,

  19. యెహోవా మందిరంలో, అలాగే యూదారాజు యొక్క రాజభవనంలో యెరూషలేములోను మిగిలిపోయిన వాటి గురించి ఇశ్రాయేలు దేవుడైన సైన్యాల యెహోవా చెప్పారు:

  20. నెబుకద్నెజరు యెరూషలేము నుండి బబులోనుకు బందీలుగా తీసుకువెళ్లిన వారిలో మిగిలి ఉన్న పెద్దలకు, యాజకులకు, ప్రవక్తలకు, ఇతర ప్రజలందరికి యెరూషలేము నుండి యిర్మీయా ప్రవక్త పంపిన ఉత్తరంలోని మాటలు ఇవి.

  21. (యెహోయాకీను రాజు, రాజమాత, ఆస్థాన అధికారులు, యూదా, యెరూషలేము నాయకులు, నిపుణులైన పనివారు కళాకారులు యెరూషలేము నుండి బందీలుగా తీసుకువెళ్లిన తర్వాత ఈ ఉత్తరం పంపబడినది.)

  22. ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా తన ఇష్టప్రకారం యెరూషలేము నుండి బబులోనుకు బందీలుగా తీసుకువెళ్లిన వారందరితో ఇలా అంటున్నారు:

  23. కాబట్టి నేను యెరూషలేము నుండి బబులోనుకు బందీలుగా పంపినవారలారా, యెహోవా మాట వినండి.

  24. “ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: యెరూషలేములో ఉన్న ప్రజలందరికి, మయశేయా కుమారుడు యాజకుడునైన జెఫన్యాకు, ఇతర యాజకులందరికీ నీ పేరిట ఉత్తరాలు పంపి జెఫన్యాతో ఇలా అన్నావు,

  25. బబులోను రాజు సైన్యం యెరూషలేము మీద దాడి చేస్తున్నప్పుడు యిర్మీయా ప్రవక్త యూదా రాజభవనంలోని కావలివారి ప్రాంగణంలో బంధించబడ్డాడు.