కంటెంట్‌కు వెళ్లండి

Gibeah

41 verses · 2 known names

ఇలా కూడా పిలుస్తారు: Gibeath

31.8200, 35.2300 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి

Gibeah ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. రాయబారులు సౌలు ఉంటున్న గిబియాకు వచ్చి ఆ షరతు గురించి ప్రజలకు తెలియజేసినప్పుడు వారందరు గట్టిగా ఏడ్చారు.

  2. సౌలు ఇశ్రాయేలీయులలో మూడువేలమందిని ఏర్పరచుకున్నాడు. వీరిలో రెండువేలమంది మిక్మషులో బేతేలు కొండ ప్రాంతంలో సౌలు దగ్గర ఉన్నారు; మిగిలిన వేయిమంది బెన్యామీనీయుల ఊరైన గిబియాలో యోనాతాను దగ్గర ఉన్నారు. మిగిలినవారిని వారి గుడారాలకు పంపివేశాడు.

  3. తర్వాత సమూయేలు గిల్గాలు విడిచిపెట్టి బెన్యామీనీయుల గిబియాకు వచ్చాడు; సౌలు తన దగ్గర ఉన్న మనుష్యులను లెక్కపెట్టగా వారు దాదాపు ఆరువందలమంది ఉన్నారు.

  4. సౌలు గిబియా పొలిమేరల్లో మిగ్రోనులో దానిమ్మ చెట్టు క్రింద ఉన్నాడు, అతనితో పాటు సుమారు ఆరువందలమంది ఉన్నారు.

  5. బెన్యామీనులోని గిబియాలో ఉన్న సౌలు గూఢాచారులు సైన్యం అన్నివైపులకు చెదిరిపోవడం చూశారు.

  6. అప్పుడు సమూయేలు రామాకు వెళ్లిపోయాడు కాని సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్లాడు.

  7. ఒక రోజు దావీదు అతని మనుష్యులు ఎక్కడ ఉన్నారో సౌలుకు తెలిసింది. అప్పుడు సౌలు గిబియా దగ్గర రామాలో ఒక పిచుల వృక్షం క్రింద ఈటె పట్టుకుని కూర్చున్నాడు. అతని సేవకులు అతని చుట్టూ నిలబడి ఉన్నారు.

  8. జీఫీయులు బయలుదేరి గిబియాలో ఉన్న సౌలు దగ్గరకు వచ్చి, “యెషీమోనుకు దక్షిణంగా ఉన్న హకీలా కొండమీద హోరేషు బలమైన కోటల దగ్గర మా మధ్య దావీదు దాక్కున్నాడా హోరేషు కొండ దగ్గర మా మధ్య దావీదు దాక్కున్నాడు?

  9. జీఫీయులు గిబియాలో ఉన్న సౌలు దగ్గరకు వెళ్లి, “దావీదు యెషీమోను ఎదురుగా ఉన్న హకీలా కొండలో దాక్కోలేదా?” అని అన్నారు.

  10. యెహోవా ఏర్పరచుకున్న సౌలు పట్టణమైన గిబియాలో యెహోవా సమక్షంలో వారిని ఉరితీస్తాం” అన్నారు. అందుకు రాజు, “సరే, నేను వారిని మీకు అప్పగిస్తాను” అన్నాడు.

  11. నెటోపాతీయుడైన బయనా కుమారుడు హేలెదు, బెన్యామీనీయుల గిబియాకు చెందిన రీబై కుమారుడు ఇత్తయి.

  12. బెన్యామీనీయుల గిబియాకు చెందిన రీబై కుమారుడు ఇత్తయి, పిరాతోనీయుడైన బెనాయా,

  13. వారు మార్గం దాటి వెళ్తూ, “మేము గెబాలో రాత్రి బస చేస్తాం” అంటున్నారు. రామా వణకుతుంది; సౌలు గిబియా పారిపోతుంది.

  14. “గిబియాలో బాకానాదం చేయండి, రామాలో బూర ఊదండి. బెన్యామీనూ, నీ వెనుకే వస్తున్నాము; బేత్-ఆవెనులో యుద్ధ నినాదాలు చేయండి.

  15. గిబియా రోజుల్లో ఉన్నట్లు, వారు అవినీతిలో లోతుగా మునిగిపోయారు. దేవుడు వారి దుష్టత్వాన్ని జ్ఞాపకం చేసుకుని, వారి పాపాల కోసం వారిని శిక్షిస్తారు.

  16. “ఇశ్రాయేలూ, గిబియా కాలం నుండి నీవు పాపం చేస్తూ ఉన్నావు. నీవు అదే స్థితిలో ఉండిపోయావు. గిబియాలోని దుర్మార్గుల మీదికి మరలా యుద్ధం రాలేదా?