కంటెంట్‌కు వెళ్లండి

Jeremiah

124 వచనాలు · 1 కుటుంబ సభ్యుడు

ఇలా కూడా పిలుస్తారు: Jeremy, Jeremias

Jeremiah ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మత్తాను కుమారుడైన షెఫట్యా, పషూరు కుమారుడైన గెదల్యా, షెలెమ్యా కుమారుడైన యూకాలు, మల్కీయా కుమారుడైన పషూరు యిర్మీయా ప్రజలందరితో చెప్పేది విని,

  2. కాబట్టి వారు యిర్మీయాను తీసుకెళ్లి, చెరసాల ప్రాంగణంలో ఉన్న రాజు కుమారుడైన మల్కీయా నీటి గోతిలోకి దింపినప్పుడు దాంట్లో వారు యిర్మీయాను త్రాళ్లతో నీటి గోతిలోకి దించారు; దాంట్లో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉంది, యిర్మీయా ఆ బురదలో మునిగిపోయాడు.

  3. అయితే రాజభవనంలో అధికారిగా ఉన్న ఎబెద్-మెలెకు అనే ఒక కూషీయుడు యిర్మీయాను నీటి గోతిలో వేశారు అని విన్నాడు. ఆ సమయంలో రాజు బెన్యామీను ద్వారం దగ్గర కూర్చుని ఉన్నాడు.

  4. “రాజా! నా ప్రభువా! ఈ మనుష్యులు యిర్మీయా ప్రవక్త విషయంలో చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. వీరు అతన్ని గోతిలో వేశారు, పట్టణంలో ఇక ఆహారం లేకుండా పోతే అక్కడ అతడు ఆకలితో చనిపోతాడు” అని మనవి చేశాడు.

  5. అప్పుడు రాజు కూషీయుడైన ఎబెద్-మెలెకుకు, “నీవు ఇక్కడినుండి ముప్పది మందిని తీసుకెళ్లి, యిర్మీయా ప్రవక్తను చావకముందే ఆ గోతిలో నుండి బయటకు తీయించు” అని ఆజ్ఞాపించాడు.

  6. కాబట్టి ఎబెద్-మెలెకు ఆ మనుష్యులను తనతో పాటు తీసుకుని రాజభవనంలోని ఖజానా క్రింద ఉన్న గదిలోకి వెళ్లాడు. అతడు అక్కడినుండి కొన్ని పాత గుడ్డలు చిరిగిన బట్టలు తీసుకుని, నీటి గోతిలో ఉన్న యిర్మీయాకు వాటిని త్రాళ్లతో దించాడు.

  7. కూషీయుడైన ఎబెద్-మెలెకు యిర్మీయాతో, “ఈ పాత గుడ్డలు, చిరిగిన బట్టలు త్రాళ్లగా చేయడానికి నీ చేతుల క్రింద పెట్టుకో” అన్నాడు. యిర్మీయా అలాగే చేశాడు,

  8. వారు అతన్ని త్రాళ్లతో పైకి లాగి బందీకానా నుండి పైకి లేపారు. యిర్మీయా కావలివారి ప్రాంగణంలో ఉండిపోయాడు.

  9. అప్పుడు రాజైన సిద్కియా యిర్మీయా ప్రవక్తను పిలిపించి, యెహోవా మందిరంలోని మూడవ ద్వారం దగ్గరకు అతన్ని రప్పించాడు. రాజు యిర్మీయాతో, “నేను నిన్ను ఒక విషయం అడుగుతున్నాను; నా దగ్గర ఏమీ దాచకుండ జవాబివ్వాలి” అని అన్నాడు.

  10. అందుకు యిర్మీయా సిద్కియాతో, “ఒకవేళ నేను మీరు నిజం చెబితే, మీరు నన్ను చంపరా? నేను ఒకవేళ మీకు సలహా ఇచ్చినా మీరు నా మాట వినరు.”

  11. అయితే సిద్కియా రాజు యిర్మీయాతో రహస్యంగా ఈ ప్రమాణం చేశాడు: “మనకు ఊపిరినిచ్చే, సజీవుడైన యెహోవా పేరిట ప్రమాణం చేసి చెప్తున్న, నిన్ను నేను చంపను, నిన్ను చంపాలనుకున్న వారికి అప్పగించను.”

  12. అప్పుడు యిర్మీయా సిద్కియాతో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా దేవుడు ఇలా అంటున్నారు: ‘నీవు బబులోను రాజు అధికారులకు లొంగిపోతే, నీ ప్రాణం దక్కుతుంది, ఈ పట్టణం కూడా అగ్నితో కాల్చివేయబడదు; నీవు, నీ కుటుంబం బ్రతుకుతారు.

  13. సిద్కియా రాజు యిర్మీయాతో, “బబులోనీయుల దగ్గరకు వెళ్లిపోయిన యూదుల గురించి నేను భయపడుతున్నాను, ఎందుకంటే బబులోనీయులు నన్ను వారి చేతికి అప్పగిస్తే, వారు నన్ను ఘోరంగా అవమానిస్తారు” అని అన్నాడు.

  14. “వారు మిమ్మల్ని అప్పగించరు; నేను చెప్పేది చేస్తూ యెహోవాకు లోబడండి. అప్పుడు అది మీకు అంతా మంచే జరుగుతుంది, మీరు ప్రాణాలతో ఉంటారు” అని యిర్మీయా జవాబిచ్చాడు.

  15. అప్పుడు సిద్కియా యిర్మీయాతో, “ఈ సంభాషణ గురించి ఎవరికీ తెలియకూడదు, తెలిస్తే నీవు చస్తావు.

  16. అధికారులందరూ యిర్మీయా దగ్గరకు వచ్చి అతన్ని ప్రశ్నించగా, అతడు రాజు వారితో చెప్పమని తనకు ఆదేశించినదంతా చెప్పాడు. కాబట్టి వారు అతనితో ఇంకేమి అనలేదు, ఎందుకంటే రాజుతో అతనికి ఏమి సంభాషణ జరిగిందో ఎవరూ వినలేదు.

  17. యెరూషలేము స్వాధీనమైపోయిన రోజు వరకు యిర్మీయా, కావలివారి ప్రాంగణంలోనే ఉన్నాడు. యెరూషలేము ఈ విధంగా ఆక్రమించబడింది:

  18. ఇప్పుడు బబులోను రాజైన నెబుకద్నెజరు యిర్మీయా గురించి రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదానుకు ఇలా ఆజ్ఞాపించాడు:

  19. మనుష్యులను పంపి యిర్మీయాను కావలివారి ప్రాంగణం నుండి బయటకు తీసుకువచ్చారు. అతన్ని తిరిగి తన ఇంటికి తీసుకెళ్లమని షాఫాను కుమారుడైన అహీకాము, అతని కుమారుడైన గెదల్యాకు అప్పగించారు. కాబట్టి యిర్మీయా తన సొంత ప్రజల మధ్యనే ఉండిపోయాడు.

  20. యిర్మీయా కావలివారి ప్రాంగణంలో బంధించబడి ఉన్నప్పుడు, అతనికి యెహోవా వాక్కు వచ్చి:

  21. రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదాను రామాలో విడిచిపెట్టిన తర్వాత యిర్మీయాకు యెహోవా నుండి వాక్కు వచ్చింది. నెబూజరదాను యెరూషలేము, యూదా నుండి బబులోనుకు బందీలుగా తీసుకువెళ్తున్న వారిలో గొలుసులతో బంధించబడి ఉన్న యిర్మీయాను చూశాడు.

  22. రాజ రక్షక దళాధిపతి యిర్మీయాతో, “నీ దేవుడైన యెహోవా ఈ స్థలానికి విపత్తు రప్పిస్తానని ప్రకటించారు కదా.

  23. కాబట్టి యిర్మీయా మిస్పాలో ఉన్న అహీకాము కుమారుడైన గెదల్యా దగ్గరికి వెళ్లి, దేశంలో మిగిలిపోయిన ప్రజలమధ్య నివసించాడు.

  24. యిర్మీయా ప్రవక్త దగ్గరికి వచ్చి, “దయచేసి మా విన్నపం విని, ఈ మిగిలిన వారందరి కోసం నీ దేవుడైన యెహోవాకు ప్రార్థించు. ఎందుకంటే నీవిప్పుడు చూస్తున్నట్లుగా, మేము ఒకప్పుడు చాలా మందిమే అయినప్పటికీ, ఇప్పుడు కొద్ది మందిమి మాత్రమే మిగిలి ఉన్నాము.

  25. “నేను నీ మాట విన్నాను, మీరు కోరినట్లే నేను మీ దేవుడైన యెహోవాకు తప్పక ప్రార్థిస్తాను; యెహోవా చెప్పినదంతా నేను మీకు చెప్తాను మీ నుండి ఏమీ దాచను” అని యిర్మీయా ప్రవక్త జవాబిచ్చాడు.