కంటెంట్‌కు వెళ్లండి

Israel

1,007 వచనాలు · 20 కుటుంబ సభ్యులు

ఇలా కూడా పిలుస్తారు: Jacob

Israel ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నా సేవకుడైన యాకోబు కోసం నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు కోసం నేను పేరు పెట్టి నిన్ను పిలిచాను. నీవు నన్ను గుర్తించకపోయినా నీకు గౌరవ బిరుదు ఇచ్చాను.

  2. నేను ఎక్కడో చీకటి దేశంలో నుండి రహస్యంగా మాట్లాడలేదు; ‘వ్యర్థంగా నన్ను వెదకండి’ అని యాకోబు సంతానంతో నేను చెప్పలేదు. యెహోవానైన నేను సత్యం మాట్లాడతాను; నేను యథార్థమైనవే తెలియజేస్తాను.

  3. “యాకోబు వారసులారా, నా మాట వినండి, ఇశ్రాయేలు ప్రజల్లో మిగిలిన వారలారా, నా మాట వినండి, మీ పుట్టుక నుండి నేను మిమ్మల్ని నిలబెట్టాను, మీరు పుట్టినప్పటి నుండి నేను మిమ్మల్ని మోసాను.

  4. “యాకోబు వారసులారా, ఇశ్రాయేలు అనే పేరుతో పిలువబడి యూదా కుటుంబం నుండి వచ్చే వారలారా వినండి, యెహోవా పేరిట ప్రమాణం చేస్తూ ఇశ్రాయేలు దేవుని వేడుకుంటూ సత్యాన్ని గాని నీతి గాని అనుసరించని వారలారా వినండి.

  5. “యాకోబూ, నేను పిలిచిన ఇశ్రాయేలూ, నా మాట విను. నేనే ఆయనను; నేనే మొదటివాడను నేను చివరివాడను.

  6. బబులోనును విడిచిపెట్టండి. బబులోనీయుల నుండి పారిపోండి! “యెహోవా తన సేవకుడైన యాకోబును విడిపించారు” అని ఆనంద కేకలతో తెలియజేయండి. దానిని ప్రకటించండి. భూమి అంచుల వరకు దానిని తెలియజేయండి.

  7. యెహోవా దృష్టిలో నేను ఘనపరచబడ్డను నా దేవుడే నాకు బలంగా ఉన్నారు తన దగ్గరకు యాకోబును తిరిగి రప్పించడానికి ఇశ్రాయేలును తన కోసం సమకూర్చడానికి తన సేవకునిగా ఉండడానికి నన్ను గర్భంలో నిర్మించిన, యెహోవా ఇలా అంటున్నారు:

  8. ఆయన అంటున్నారు: “నీవు యాకోబు గోత్రాలను పునరుద్ధరించడానికి, ఇశ్రాయేలులో నేను తప్పించిన వారిని తిరిగి రప్పించడానికి నా సేవకునిగా ఉండడం నీకు చాలా చిన్న విషయము. నేనిచ్చే రక్షణ భూమి అంచుల వరకు చేరడానికి యూదేతర ప్రజలకు వెలుగుగా నేను నిన్ను చేస్తాను.”

  9. నిన్ను బాధించేవారు తమ మాంసాన్ని తామే తినేలా చేస్తాను; ద్రాక్షరసంతో మత్తు ఎక్కినట్లు వారు తమ రక్తాన్ని త్రాగి మత్తులో ఉంటారు. అప్పుడు యెహోవానైన నేనే నీ రక్షకుడనని యాకోబు బలవంతుడైన నీ విమోచకుడని మానవులందరూ తెలుసుకుంటారు.”

  10. “గట్టిగా కేకలు వేయండి, ఆపకండి. బూర ఊదినట్లు మీ స్వరం వినిపించండి. నా ప్రజలకు వారు చేసిన తిరుగుబాటును తెలియజేయండి, యాకోబు వారసులకు వారి పాపాలను తెలియజేయండి.

  11. అప్పుడు మీరు యెహోవాలో ఆనందిస్తారు, దేశంలో ఉన్నతస్థలాల మీద నేను మిమ్మల్ని ఎక్కిస్తాను, మీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యాన్ని మీరు అనుభవించేలా చేస్తాను.” యెహోవా తెలియజేసిన మాట ఇదే.

  12. “సీయోను దగ్గరకు, యాకోబులో తమ పాపాలకు పశ్చాత్తాపం చెందినవారి దగ్గరకు విమోచకుడు వస్తాడు,” అని యెహోవా తెలియజేస్తున్నారు.

  13. నీవు దేశాల పాలు త్రాగుతావు రాజుల చనుపాలు త్రాగుతావు. అప్పుడు నీవు యెహోవానైన నేనే నీ రక్షకుడనని యాకోబు యొక్క బలవంతుడైన నీ విమోచకుడని తెలుసుకుంటావు.

  14. యాకోబు నుండి యూదా నుండి వారసుల్ని తీసుకువస్తాను, వారు నా పర్వతాల్ని స్వాధీనపరచుకుంటారు. నేను ఏర్పరచుకున్న ప్రజలు వాటిని స్వతంత్రించుకుంటారు. నా సేవకులు అక్కడ నివసిస్తారు.

  15. ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రల్లో భోజనార్పణల్ని యెహోవా మందిరంలోనికి తెచ్చినట్లు, గుర్రాల మీద, రథాల మీద, బండ్ల మీద, కంచరగాడిదల మీద, ఒంటెల మీద ఎక్కించి అన్ని దేశాల నుండి నా పరిశుద్ధ పర్వతమైన యెరూషలేముకు మీ ప్రజలందరినీ యెహోవాకు అర్పణగా వారు తీసుకువస్తారు” అని యెహోవా చెప్తున్నారు.

  16. యాకోబు సంతానమా, సర్వ ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మాట వినండి.

  17. ఇశ్రాయేలు ప్రజలు తమ మార్గాలను తప్పుదారి పట్టించి తమ దేవుడైన యెహోవాను మరచిపోయారు కాబట్టి, బంజరు కొండలమీద ఇశ్రాయేలు ప్రజల ఏడ్పులు, విన్నపాలు, వినబడుతున్నాయి.

  18. “యాకోబు సంతతికి ఈ విషయాన్ని చాటించండి యూదాలో ప్రకటించండి:

  19. యాకోబులో భాగమైన వాడు వీటిలాంటివాడు కాదు, ఆయన తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు గోత్రంతో పాటు, అన్నిటిని సృజించారు. ఆయన పేరు సైన్యాల యెహోవా.

  20. మిమ్మల్ని గుర్తించని దేశాల మీద, మీ పేరు పెట్టుకొనని జనాంగాల మీద మీ కోపాన్ని కుమ్మరించండి. వారు యాకోబును మ్రింగివేశారు; వారు అతన్ని పూర్తిగా మ్రింగివేశారు అతని మాతృభూమిని నాశనం చేశారు.

  21. “అయినా, ఆ రోజులు రాబోతున్నాయి” అని యెహోవా ప్రకటిస్తూ ఇలా చెప్తున్నారు, “అప్పుడు ‘ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి బయటకు రప్పించిన యెహోవా జీవం తోడు’ అని ఇకపై చెప్పరు,

  22. అయితే, ‘యెహోవా జీవం తోడు, ఇశ్రాయేలీయులను ఉత్తర దేశం నుండి ఆయన వారిని తరిమేసిన అన్ని దేశాల నుండి బయటకు రప్పించిన యెహోవా జీవం తోడు.’ ఎందుకంటే నేను వారిని వారి పూర్వికులకు నేనిచ్చిన దేశానికి మళ్ళీ రప్పిస్తాను.

  23. యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “రాబోయే రోజుల్లో, ఇకపై ప్రజలు, ‘ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి బయటకు రప్పించిన సజీవుడైన యెహోవా పేరిట అని చెప్పరు’

  24. ఆ రోజు ఎంత భయంకరంగా ఉంటుందో! అలాంటిది మరొకటి ఉండదు. అది యాకోబుకు కష్టకాలం, అయితే వారు దాని నుండి రక్షించబడతారు.

  25. “ ‘కాబట్టి నా సేవకుడైన యాకోబూ, భయపడకు; ఇశ్రాయేలు, కలవరపడకు’ అని యెహోవా ప్రకటిస్తున్నారు. ‘సుదూర ప్రాంతం నుండి నేను నిన్ను తప్పకుండా రక్షిస్తాను, నీ సంతతిని వారు బందీలుగా ఉన్న దేశం నుండి తప్పకుండా రక్షిస్తాను. యాకోబుకు మళ్ళీ సమాధానం నెమ్మది కలుగుతాయి, ఎవరూ అతన్ని భయపెట్టరు.