కంటెంట్‌కు వెళ్లండి

Isaac

123 వచనాలు · 12 కుటుంబ సభ్యులు

Isaac ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఇస్సాకు అతన్ని దీవించడం ముగించిన తర్వాత, యాకోబు తండ్రి దగ్గర నుండి వెళ్లీ వెళ్లకముందే, తన సోదరుడు ఏశావు వేటనుండి వచ్చాడు.

  2. అప్పుడు తన తండ్రి ఇస్సాకు, “నీవెవరివి?” అని అడిగాడు. అందుకతడు, “నేను నీ కుమారున్ని, నీ మొదటి సంతానమైన ఏశావును” అని జవాబిచ్చాడు.

  3. ఇస్సాకు గజగజ వణకుతూ ఇలా అన్నాడు, “మరీ ఇంతకుముందు వేట మాంసం తెచ్చి పెట్టింది ఎవరు? నీవు రాకముందే నేను తిని అతన్ని దీవించాను; నిజంగా అతడు దీవించబడతాడు!”

  4. ఇస్సాకు జవాబిస్తూ, “నేను అతన్ని నీపై ప్రభువుగా నియమించాను, అతని బంధువులందరినీ అతనికి దాసులుగా చేశాను, సమృద్ధిగా ధాన్యం, ద్రాక్షరసం అతనికి సమకూర్చాను. కాబట్టి నా కుమారుడా! ఇప్పుడు నీకోసం నేను ఏమి చేయగలను?” అని అడిగాడు.

  5. అప్పుడు ఇస్సాకు అతనికి జవాబిస్తూ ఇలా అన్నాడు, “నీ నివాసం సారవంతమైన భూమికి దూరంగా, పైనున్న ఆకాశం యొక్క మంచుకు దూరంగా ఉంటుంది.

  6. తర్వాత రిబ్కా ఇస్సాకుతో, “ఈ హిత్తీయుల స్త్రీల వలన నేను విసిగిపోయాను. యాకోబు కూడా ఇలాంటి హిత్తీయుల స్త్రీలలా ఈ దేశ స్త్రీని భార్యగా చేసుకుంటే, ఇక నేను బ్రతికి లాభం లేదు” అని అన్నది.

  7. ఇస్సాకు యాకోబును పిలిపించి అతన్ని ఆశీర్వదించాడు. అప్పుడు తనకు ఇలా ఆజ్ఞాపించాడు: “కనాను స్త్రీని పెళ్ళి చేసుకోవద్దు.

  8. తర్వాత ఇస్సాకు యాకోబును పంపివేశాడు. అతడు పద్దనరాముకు, యాకోబు ఏశావుల తల్లియైన రిబ్కా సోదరుడైన లాబాను దగ్గరకు వెళ్లాడు. లాబాను సిరియావాడైన బెతూయేలు కుమారుడు.

  9. ఇస్సాకు యాకోబును దీవించి పద్దనరాముకు పంపి అక్కడే అతడు భార్యను చూసుకోవాలని, “కనాను స్త్రీని పెళ్ళి చేసుకోవద్దు” అని చెప్పాడని, యాకోబు తన తల్లిదండ్రులకు లోబడి పద్దనరాముకు వెళ్లాడని ఏశావు తెలుసుకున్నాడు.

  10. అప్పుడు ఏశావు కనాను స్త్రీలంటే తన తండ్రి ఇస్సాకుకు ఇష్టం లేదని గ్రహించాడు;

  11. దాని మీద యెహోవా నిలబడి ఇలా అన్నారు: “యెహోవాను నేనే, నీ తాత అబ్రాహాముకు దేవుడను, నీ తండ్రి ఇస్సాకుకు దేవుడను. నీవు పడుకుని ఉన్న ఈ భూమిని నీకు, నీ వారసులకు ఇస్తాను.

  12. తన ముందు పశువులను పంపుతూ, తాను పద్దనరాములో సంపాదించుకున్న అన్నిటితో కలిసి, కనాను దేశంలో ఉన్న తన తండ్రి ఇస్సాకు దగ్గరకు బయలుదేరాడు.

  13. ఒకవేళ నా తండ్రి యొక్క దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడే దేవుడు నాకు తోడుగా లేకపోతే, నీవు నన్ను ఖచ్చితంగా ఖాళీ చేతులతో పంపియుండేవాడివి. కానీ దేవుడు నా ప్రయాసను, నా చేతి కష్టాన్ని చూశారు, గత రాత్రి నిన్ను గద్దించారు.”

  14. అబ్రాహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయం తీర్చును గాక” అని అన్నాడు. కాబట్టి యాకోబు తన తండ్రి ఇస్సాకు భయపడే దేవుని నామంలో ప్రమాణం చేశాడు.

  15. తర్వాత యాకోబు ప్రార్థిస్తూ, “నా తండ్రియైన అబ్రాహాము దేవా, నా తండ్రియైన ఇస్సాకు దేవా, ‘నీ దేశానికి, నీ బంధువుల దగ్గరకు వెళ్లు, నేను నిన్ను అభివృద్ధి చేస్తాను’ అని నాతో చెప్పిన యెహోవా,

  16. అబ్రాహాముకు, ఇస్సాకుకు నేనిచ్చిన దేశాన్ని, నీకు కూడా ఇస్తాను. నీ తర్వాత నీ వారసులకు కూడా ఈ దేశాన్ని ఇస్తాను.”

  17. యాకోబు కిర్యత్-అర్బా (అంటే, హెబ్రోను) దగ్గర ఉన్న మమ్రేలో తన తండ్రి దగ్గరకు వచ్చాడు, అబ్రాహాము, ఇస్సాకు అక్కడే నివసించారు.

  18. ఇస్సాకు నూట ఎనభై సంవత్సరాలు బ్రతికాడు.

  19. అతడు తన తుది శ్వాస విడిచి, చనిపోయి మంచి వృద్ధాప్యంలో తన పూర్వికుల దగ్గరకు చేర్చబడ్డాడు. అతని కుమారులు, ఏశావు, యాకోబు అతన్ని పాతిపెట్టారు.

  20. కాబట్టి ఇశ్రాయేలు తనకున్నదంతటితో బయలుదేరాడు, బెయేర్షేబకు వచ్చాక, తన తండ్రియైన ఇస్సాకు దేవునికి బలులు అర్పించారు.

  21. అప్పుడు అతడు యోసేపును దీవిస్తూ అన్నాడు, “నా పితరులైన అబ్రాహాము ఇస్సాకులు ఎవరి ఎదుట నమ్మకంగా నడిచారో ఆ దేవుడు, నేటి వరకు నా జీవితమంతా నాకు కాపరిగా ఉన్న దేవుడు,

  22. నన్ను ప్రతి హాని నుండి విడిపించిన దూత ఈ బాలురను దీవించును గాక. వారు నా నామాన నా పితరులైన అబ్రాహాము ఇస్సాకుల నామాన పిలువబడుదురు గాక, భూమిపై వారు గొప్పగా విస్తరించుదురు గాక.”

  23. అక్కడే అబ్రాహాము అతని భార్య శారా సమాధి చేయబడ్డారు, అక్కడే ఇస్సాకు అతని భార్య రిబ్కా సమాధి చేయబడ్డారు, అక్కడే నేను లేయాను సమాధి చేశాను.

  24. యోసేపు తన సోదరులతో, “నేను చనిపోబోతున్నాను. అయితే దేవుడు తప్పకుండా మిమ్మల్ని దర్శించి, ఈ దేశం నుండి ఆయన అబ్రాహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు ప్రమాణం చేసిన దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తారు” అని చెప్పాడు.

  25. దేవుడు వారి మూల్గును విని, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన తన ఒడంబడికను జ్ఞాపకం చేసుకున్నారు.