కంటెంట్‌కు వెళ్లండి

Holy Spirit

251 వచనాలు

ఇలా కూడా పిలుస్తారు: Spirit

Holy Spirit ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఇప్పుడు సత్యానికి విధేయులై మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకుంటున్నారు. తద్వారా తోటి విశ్వాసులపై నిజమైన ప్రేమ కలిగి ఉండి, ఒకరినొకరు హృదయపూర్వకంగా అధికంగా ప్రేమించుకోండి.

  2. ఎందుకంటే, దేవుని దగ్గరకు తీసుకురావడానికి, అనీతిమంతుల కోసం నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికించబడి, పాపాల విషయంలో ఒక్కసారే శ్రమపడ్డారు.

  3. ఎందుకంటే, మానవుని ఇష్టాన్ని బట్టి ప్రవచనం పుట్టదు, కాని ప్రవక్తలు పరిశుద్ధాత్మచేత ప్రభావితులై దేవుని నుండి వచ్చిన సందేశాన్నే పలికారు.

  4. దేవుని ఆజ్ఞలను పాటించేవారు వారు ఆయనలో ఉంటారు, వారిలో ఆయన ఉంటారు. ఆయన మనకు ఇచ్చిన ఆత్మ ద్వారా ఆయన మనలో ఉన్నారని మనకు తెలుస్తుంది.

  5. దేవుని ఆత్మను మనం ఈ విధంగా గుర్తించవచ్చు: యేసు క్రీస్తు మానవ శరీరాన్ని ధరించి వచ్చారని ఒప్పుకునే ప్రతి ఆత్మ దేవుని నుండి వచ్చిందే.

  6. మనం ఆయనలో జీవిస్తున్నామని ఆయన మనలో ఉన్నారని దీనిని బట్టి మనకు తెలుస్తుంది: ఆయన తన ఆత్మను మనకు ఇచ్చారు.

  7. నీళ్ల ద్వారా రక్తం ద్వారా వచ్చినవాడు యేసు క్రీస్తే. ఆయన కేవలం నీటి ద్వారా మాత్రమే రాలేదు, కాని నీళ్ల ద్వారా రక్తం ద్వారా వచ్చారు. ఆత్మ సాక్ష్యమిస్తున్నాడు ఎందుకంటే ఆత్మ సత్యము.

  8. దానికై ముగ్గురు సాక్ష్యమిస్తున్నారు:

  9. ఆత్మ, నీరు, రక్తం; ఈ ముగ్గురు ఏకీభవిస్తున్నారు.

  10. అలాంటివారు సహజ సంబంధులు, వీరు ఆత్మలేనివారిగా ఉండి, మీలో విభేదాలు పుట్టిస్తారు.

  11. కాని, ప్రియ మిత్రులారా, అతిపరిశుద్ధమైన మీ విశ్వాసంలో మిమ్మల్ని మీరు బలపరచుకొంటూ, పరిశుద్ధాత్మలో ప్రార్థిస్తూ,

  12. యోహాను,

  13. ప్రభువు దినాన నేను ఆత్మవశుడనై ఉన్నప్పుడు నా వెనుక నుండి బూరధ్వని వంటి ఒక పెద్ద స్వరం వినబడింది.

  14. ఆత్మ సంఘాలతో చెప్పే మాటలను చెవులుగలవారు వినాలి! వీటిని జయించినవారికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలాలను తినడానికి అనుమతిస్తాను.

  15. ఆత్మ సంఘాలతో చెప్పే మాటలను చెవులుగలవారు వినాలి! జయించినవారికి రెండవ మరణం హాని చేయదు.

  16. ఆత్మ సంఘాలతో చెప్పే మాటలను చెవులుగలవారు వినాలి! వీటిని జయించినవారికి నేను దాచి ఉంచిన మన్నాను ఇస్తాను. నేను వారికి తెల్లని రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరును ఇస్తాను. దాన్ని పొందినవారికి మాత్రమే ఆ పేరు తెలుస్తుంది.

  17. ఆత్మ సంఘాలతో చెప్పే మాటలు చెవులుగలవారు వినాలి.

  18. “సార్దీసులో ఉన్న సంఘ దూతకు వ్రాసే సందేశం: దేవుని ఏడు ఆత్మలు, ఏడు నక్షత్రాలు కలవాడు ఈ మాటలు చెప్తున్నాడు. నీ క్రియలు నాకు తెలుసు; నీవు బ్రతికున్నావని పేరు ఉంది కాని నీవు చచ్చిన దానివే.

  19. ఆత్మ సంఘాలతో చెప్పే మాటలు చెవులుగలవారు వినాలి.

  20. ఆత్మ సంఘాలతో చెప్పే మాటలు చెవులుగలవారు వినాలి.

  21. ఆత్మ సంఘాలతో చెప్పే మాటలను చెవులుగలవారు వినాలి.”

  22. ఆ సింహాసనం నుండి మెరుపులు, ఉరుముల గొప్ప శబ్దాలు వచ్చాయి. ఆ సింహాసనం ముందు ఏడు దీపాలు వెలుగుతూ ఉన్నాయి. అవి దేవుని ఏడు ఆత్మలు.

  23. అప్పుడు సింహాసనం మధ్య, ఆ నాలుగు ప్రాణులు, పెద్దల మధ్య వధించబడినట్లు ఉన్న ఒక గొర్రెపిల్లను చూశాను. ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములు, ఏడు కళ్ల ఉన్నాయి, అవి దేవుడు భూలోకమంతటి మీదికి పంపిన దేవుని ఏడు ఆత్మలు.

  24. కానీ మూడున్నర రోజుల తర్వాత దేవుని నుండి జీవవాయువు వారిలోనికి ప్రవేశించి వారు తమ కాళ్లమీద లేచి నిలబడినప్పుడు వారిని చూసిన వారందరికి విపరీతమైన భయం కలిగింది.

  25. అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం, “ఇప్పటినుండి ప్రభువులో ఉంటూ చనిపోయే వారు ధన్యులు! అని వ్రాసి పెట్టు” అని చెప్పింది. దేవుని ఆత్మ, “అవును నిజమే, తమ ప్రయాస నుండి విశ్రాంతి పొందుతారు. ఎందుకంటే వారి క్రియల ఫలాన్ని వారు పొందుతారు” అని పలకడం వినిపించింది.