కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ప్రవక్తయైన యిర్మీయా ద్వారా యెహోవా చెప్పిన మాటలను అతడు గాని, అతని సేవకులు గాని, దేశ ప్రజలు గాని పట్టించుకోలేదు.

  2. అయితే రాజైన సిద్కియా, షెలెమ్యా కుమారుడైన యెహుకలును మయశేయా కుమారుడును యాజకుడునైన జెఫన్యాతో పాటు యిర్మీయా ప్రవక్తకు ఈ సందేశాన్ని పంపాడు: “దయచేసి మాకోసం మన దేవుడైన యెహోవాకు ప్రార్థించండి.”

  3. అప్పుడు యెహోవా వాక్కు యిర్మీయా ప్రవక్తకు వచ్చింది:

  4. “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు: ‘ఫరో గురించి నన్ను విచారించడానికి నిన్ను పంపిన యూదా రాజుతో చెప్పు. మీకు మద్ధతు ఇవ్వడానికి బయలుదేరిన సైన్యం తిరిగి తన దేశమైన ఈజిప్టుకు వెళ్తుంది.

  5. “యెహోవా ఇలా అంటున్నారు: ‘బబులోనీయులు మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోతారు’ అని మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. వారు వెళ్లరు!

  6. అప్పుడు రాజైన సిద్కియా అతన్ని పిలిపించి, రాజభవనానికి తీసుకువచ్చి, “యెహోవా నుండి ఏదైనా వాక్కు వచ్చిందా?” అని అడిగాడు. “అవును, నీవు బబులోను రాజు చేతికి అప్పగించబడతావు” అని యిర్మీయా జవాబిచ్చాడు.

  7. “యెహోవా ఇలా అంటున్నారు: ‘ఈ పట్టణంలో నివసించేవారు ఖడ్గంతో కరువుతో తెగులుతో చనిపోతారు, కానీ బబులోనీయుల దగ్గరకు వెళ్లేవారు బ్రతుకుతారు. వారు తమ ప్రాణాలతో తప్పించుకుని బ్రతుకుతారు; వారు జీవిస్తారు.’

  8. యెహోవా ఇలా అంటున్నారు: ‘ఈ పట్టణం ఖచ్చితంగా బబులోను రాజు సైన్యానికి అప్పగించబడుతుంది, అతడు దాన్ని స్వాధీనం చేసుకుంటాడు’ ” అని చెప్పడం విన్నారు.

  9. అప్పుడు రాజైన సిద్కియా యిర్మీయా ప్రవక్తను పిలిపించి, యెహోవా మందిరంలోని మూడవ ద్వారం దగ్గరకు అతన్ని రప్పించాడు. రాజు యిర్మీయాతో, “నేను నిన్ను ఒక విషయం అడుగుతున్నాను; నా దగ్గర ఏమీ దాచకుండ జవాబివ్వాలి” అని అన్నాడు.

  10. అయితే సిద్కియా రాజు యిర్మీయాతో రహస్యంగా ఈ ప్రమాణం చేశాడు: “మనకు ఊపిరినిచ్చే, సజీవుడైన యెహోవా పేరిట ప్రమాణం చేసి చెప్తున్న, నిన్ను నేను చంపను, నిన్ను చంపాలనుకున్న వారికి అప్పగించను.”

  11. అప్పుడు యిర్మీయా సిద్కియాతో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా దేవుడు ఇలా అంటున్నారు: ‘నీవు బబులోను రాజు అధికారులకు లొంగిపోతే, నీ ప్రాణం దక్కుతుంది, ఈ పట్టణం కూడా అగ్నితో కాల్చివేయబడదు; నీవు, నీ కుటుంబం బ్రతుకుతారు.

  12. “వారు మిమ్మల్ని అప్పగించరు; నేను చెప్పేది చేస్తూ యెహోవాకు లోబడండి. అప్పుడు అది మీకు అంతా మంచే జరుగుతుంది, మీరు ప్రాణాలతో ఉంటారు” అని యిర్మీయా జవాబిచ్చాడు.

  13. కానీ మీరు లొంగిపోవడానికి నిరాకరిస్తే, యెహోవా నాకు ఇలా తెలియజేశారు:

  14. యిర్మీయా కావలివారి ప్రాంగణంలో బంధించబడి ఉన్నప్పుడు, అతనికి యెహోవా వాక్కు వచ్చి:

  15. “వెళ్లి కూషీయుడైన ఎబెద్-మెలెకుతో ఇలా చెప్పు, ‘ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: నేను ఈ పట్టణానికి వ్యతిరేకంగా చెప్పిన నా మాటలను అనగా మేలు గురించి కాదు కాని కీడు గురించి చెప్పిన మాటలను నేను నెరవేర్చబోతున్నాను. ఆ సమయంలో అవి మీ కళ్లముందు నెరవేరుతాయి.

  16. అయితే ఆ రోజు నేను నిన్ను రక్షిస్తాను అని యెహోవా ప్రకటిస్తున్నారు; నీవు భయపడేవారి చేతికి నీవు అప్పగించబడవు.

  17. నేను నిన్ను రక్షిస్తాను; నీవు నన్ను నమ్మావు కాబట్టి నీవు ఖడ్గానికి బలి కాకుండ, నీవు ప్రాణంతో తప్పించుకుంటావు అని యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”

  18. రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదాను రామాలో విడిచిపెట్టిన తర్వాత యిర్మీయాకు యెహోవా నుండి వాక్కు వచ్చింది. నెబూజరదాను యెరూషలేము, యూదా నుండి బబులోనుకు బందీలుగా తీసుకువెళ్తున్న వారిలో గొలుసులతో బంధించబడి ఉన్న యిర్మీయాను చూశాడు.

  19. రాజ రక్షక దళాధిపతి యిర్మీయాతో, “నీ దేవుడైన యెహోవా ఈ స్థలానికి విపత్తు రప్పిస్తానని ప్రకటించారు కదా.

  20. ఇప్పుడు యెహోవా దాన్ని రప్పించి తాను చెప్పినట్లే ఆయన చేశారు. మీరు యెహోవాకు విరోధంగా పాపం చేసి ఆయనకు లోబడలేదు కాబట్టి ఇదంతా జరిగింది.

  21. తమ గడ్డాలు గీసుకుని, బట్టలు చింపుకుని, తమను తాము గాయపరచుకున్న ఎనభైమంది షెకెము, షిలోహు, సమరయ నుండి భోజనార్పణలు, ధూపం తీసుకుని యెహోవా ఆలయానికి వచ్చారు.

  22. యిర్మీయా ప్రవక్త దగ్గరికి వచ్చి, “దయచేసి మా విన్నపం విని, ఈ మిగిలిన వారందరి కోసం నీ దేవుడైన యెహోవాకు ప్రార్థించు. ఎందుకంటే నీవిప్పుడు చూస్తున్నట్లుగా, మేము ఒకప్పుడు చాలా మందిమే అయినప్పటికీ, ఇప్పుడు కొద్ది మందిమి మాత్రమే మిగిలి ఉన్నాము.

  23. మేము ఎక్కడికి వెళ్లాలో, ఏం చేయాలో మాకు తెలియజేయమని నీ దేవుడైన యెహోవాకు ప్రార్థించు” అని అన్నారు.

  24. “నేను నీ మాట విన్నాను, మీరు కోరినట్లే నేను మీ దేవుడైన యెహోవాకు తప్పక ప్రార్థిస్తాను; యెహోవా చెప్పినదంతా నేను మీకు చెప్తాను మీ నుండి ఏమీ దాచను” అని యిర్మీయా ప్రవక్త జవాబిచ్చాడు.

  25. అప్పుడు వారు యిర్మీయాతో ఇలా అన్నారు: “నీ దేవుడైన యెహోవా నీ ద్వారా మాకు తెలియజేసిన మాటల ప్రకారం మేము చేయకపోతే, యెహోవాయే మాకు వ్యతిరేకంగా నిజమైన, నమ్మకమైన సాక్షిగా ఉండును గాక.