కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “ఎందుకంటే యెహోవానైన నాకు న్యాయమంటే ఇష్టము; దోపిడి చేయడం, చెడు చేయడం నాకు అసహ్యము. నా నమ్మకత్వాన్ని బట్టి నా ప్రజలకు ప్రతిఫలమిస్తాను వారితో శాశ్వతమైన నిబంధన చేస్తాను.

  2. వారి వారసులు దేశాల మధ్య వారి సంతానం జనాంగాల మధ్య ప్రసిద్ధి పొందుతారు. వారు యెహోవా ఆశీర్వదించిన ప్రజలని వారిని చూసినవారందరు గుర్తిస్తారు.”

  3. యాజకునిలా తలపాగా ధరించిన పెండ్లికుమారునిలా నగలతో అలంకరించుకున్న పెండ్లికుమార్తెలా ఆయన నాకు రక్షణ వస్త్రాలను ధరింపచేశారు ఆయన నీతి అనే పైబట్టను నాకు ధరింపచేశారు కాబట్టి యెహోవాలో నేను ఎంతో ఆనందిస్తున్నాను. నా దేవునిలో నా ఆత్మ సంతోషిస్తుంది.

  4. భూమి మొలకను మొలిపించినట్లు, విత్తనాలు ఎదిగేలా చేసే తోటలా, అన్ని దేశాల ఎదుట ప్రభువైన యెహోవా నీతిని, స్తుతిని మొలకెత్తేలా చేస్తారు.

  5. సీయోను నీతి ఉదయకాంతిలా ప్రకాశించే వరకు, దాని రక్షణ కాగడాలా వెలిగే వరకు, సీయోను పక్షంగా నేను మౌనంగా ఉండను. యెరూషలేము పక్షంగా నేను ఊరుకోలేను.

  6. దేశాలు నీ నీతిని చూస్తాయి. రాజులందరూ నీ మహిమను చూస్తారు. యెహోవా నీకు ఇవ్వబోయే క్రొత్త పేరుతో నీవు పిలువబడతావు.

  7. నీవు యెహోవా చేతిలో వైభవ కిరీటంగా, నీ దేవుని చేతిలో రాజకిరీటంగా ఉంటావు.

  8. ఇకపై నీవు విడిచిపెట్టబడిన దానివని పిలువబడవు, నీ దేశం పాడైపోయిందని పిలువబడదు. అయితే నీవు హెఫ్సీబా అని నీ దేశం బ్యూలా అని పిలువబడుతుంది; యెహోవా నీలో ఆనందిస్తారు నీ దేశానికి పెళ్ళి అవుతుంది.

  9. యువకుడు యువతిని పెళ్ళి చేసుకున్నట్లు నిన్ను కట్టేవాడు నిన్ను చేసుకుంటాడు; పెళ్ళికుమారుడు పెళ్ళికుమార్తెను చూసి సంతోషించినట్లు, నీ దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తారు.

  10. యెరూషలేమా! నీ గోడల మీద నేను కావలివారిని నియమించాను; పగలు గాని రాత్రి గాని వారు మౌనంగా ఉండరు. యెహోవాకు మొరపెట్టే వారలారా విశ్రాంతి తీసుకోకండి,

  11. యెరూషలేమును స్థాపించే వరకు భూమి మీద దానికి ప్రసిద్ధి కలుగజేసే వరకు ఆయనకు విశ్రాంతి ఇవ్వకండి.

  12. యెహోవా తన కుడిచేతితో తన బలమైన హస్తంతో ఇలా ప్రమాణం చేశారు: “ఇకనుండి ఎప్పుడూ నీ ధాన్యాన్ని నీ శత్రువులకు ఆహారంగా నేనివ్వను. నీవు కష్టపడి తీసిన ద్రాక్షారసాన్ని విదేశీయులు ఇక ఎన్నడు త్రాగరు;

  13. అయితే పంట పండించిన వారే దానిని తిని యెహోవాను స్తుతిస్తారు. ద్రాక్షలను సమకూర్చిన వారే నా పరిశుద్ధాలయ ఆవరణాల్లో దాని త్రాగుతారు.”

  14. భూమి అంచుల వరకు యెహోవా చేస్తున్న ప్రకటన: “ ‘ఇదిగో నీ రక్షకుడు వస్తున్నాడు! ఆయన ఇచ్చే బహుమానం ఆయన దగ్గరే ఉంది ఆయన ఇచ్చే జీతం ఆయన దగ్గరే ఉంది’ అని సీయోను కుమార్తెతో చెప్పండి.”

  15. వారు పరిశుద్ధ ప్రజలని, యెహోవా విడిపించినవారని పిలువబడతారు; నీవు అందరికి కావలసిన దానివని పాడుబడని పట్టణమని పిలువబడతావు.

  16. రక్తపు మరకలు కలిగిన బట్టలు వేసుకుని ఎదోము నుండి బొస్రానుండి వస్తున్న ఇతడెవరు? రాజ వస్త్రాలను ధరించి గంభీరంగా నడుస్తూ గొప్ప బలంతో వస్తున్న ఇతడెవరు? “విజయాన్ని ప్రకటిస్తూ రక్షించగల సమర్థుడనైన నేనే.”

  17. యెహోవా మనకు చేసినదంతటిని బట్టి, యెహోవా కృపలను, యెహోవా స్తుతులను నేను ప్రకటిస్తాను. అవును, ఆయన తన కనికరాన్ని బట్టి, గొప్ప దయను బట్టి ఇశ్రాయేలుకు ఆయన చేసిన అనేక మేలుల గురించి నేను చెప్తాను.

  18. ఆయన అన్నారు, “నిజంగా వారు నా ప్రజలు, నాకు నమ్మకంగా ఉండే పిల్లలు”; కాబట్టి ఆయన వారికి రక్షకుడయ్యారు.

  19. వారి బాధంతటిలో ఆయన కూడా బాధ అనుభవించారు, ఆయన సన్నిధి యొక్క దూత వారిని రక్షించాడు. ఆయన ప్రేమతో, జాలితో వారిని విడిపించారు; పూర్వ రోజులన్నిటిలో ఆయన వారిని ఎత్తుకుంటూ, మోస్తూ వచ్చారు.

  20. అయినా వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపరిచారు. కాబట్టి ఆయన వారికి శత్రువయ్యారు తానే వారితో యుద్ధం చేశారు.

  21. అప్పుడు ఆయన ప్రజలు పూర్వ రోజులను, మోషేను తన ప్రజలను జ్ఞాపకం చేసుకున్నారు తన మందకాపరులతో పాటు తమను సముద్రంలో నుండి తీసుకువచ్చిన ఆయనేరి? తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన ఆయనేరి?

  22. మోషే కుడిచేతి వైపు మహిమగల తన చేతిని పంపిన ఆయనేరి? తనకు శాశ్వతమైన కీర్తి రాడానికి వారి ఎదుట నీళ్లను విభజించిన ఆయనేరి?

  23. లోయలోనికి దిగివెళ్లే పశువుల్లా యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసింది. మీకు ఘనమైన పేరు రావాలని మీరు మీ ప్రజలను ఇలా నడిపించారు.

  24. పరలోకం నుండి, గంభీరమైన, పరిశుద్ధమైన మహిమగల సింహాసనం నుండి క్రిందికి చూడండి. మీ ఆసక్తి మీ బలము ఏవి? మా పట్ల మీకున్న జాలి కనికరం మా నుండి నిలిపివేయబడ్డాయి.

  25. అయితే అబ్రాహాముకు మేము తెలియకపోయినా ఇశ్రాయేలు మమ్మల్ని గుర్తించకపోయినా మాకు తండ్రి మీరే; యెహోవా! మాకు తండ్రి మీరే, పూర్వకాలం నుండి మా విమోచకుడవని మీకు పేరు.