కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహోవా! మేము మీ మార్గాల నుండి తొలగిపోయి తిరిగేలా ఎందుకు చేశారు? మిమ్మల్ని భయపడకుండా మా హృదయాల్ని ఎందుకు కఠినపరిచారు? మీ సేవకుల కోసం, మీ స్వాస్థ్యమైన గోత్రాల కోసం తిరిగి రండి.

  2. మీ ప్రజలు కొద్ది కాలమే మీ పరిశుద్ధ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు కాని ఇప్పుడు మా శత్రువులు మీ పరిశుద్ధాలయాన్ని త్రొక్కివేశారు.

  3. పూర్వం నుండి మేము మీ వారము; కాని మీరెన్నడు వారిని పాలించలేదు, వారు మీ పేరుతో పిలువబడలేదు.

  4. మీరు ఆకాశాన్ని చీల్చివేసి దిగివస్తే, పర్వతాలు మీ ఎదుట వణుకుతాయి!

  5. మంట ఎండుకొమ్మల్ని కాల్చినప్పుడు, ఆ మంటకు నీళ్లు మరిగినట్లు, మీ శత్రువులకు మీ పేరు తెలిసేలా మీరు దిగిరండి, మీ ఎదుట దేశాలు వణికేలా చేయండి!

  6. మేము ఊహించని భయంకరమైన పనులు మీరు చేసినప్పుడు మీరు దిగివచ్చారు, పర్వతాలు మీ ఎదుట వణికాయి.

  7. తన కోసం ఎదురు చూసే వారి పక్షంగా కార్యం చేసే మిమ్మల్ని తప్ప అనాది కాలం నుండి ఏ దేవున్ని ఎవరూ చూడలేదు అలాంటి దేవుడు ఉన్నాడని ఎవరూ వినలేదు ఎవరూ గ్రహించలేదు.

  8. మీ మార్గాలను గుర్తుచేసుకుంటూ సంతోషంగా సరియైనది చేసేవారికి సహాయం చేయడానికి మీరు వస్తారు. అయితే మేము వాటికి వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉన్నప్పుడు మీరు కోప్పడ్డారు. అలా అయితే మేము ఎలా రక్షింపబడగలం?

  9. ఎవరూ మీ పేరిట మొరపెట్టడం లేదు మిమ్మల్ని ఆధారం చేసుకోవడానికి ఆరాటపడడం లేదు. మీరు మా నుండి మీ ముఖం దాచుకున్నారు. మమ్మల్ని మా పాపాలకు అప్పగించారు.

  10. అయినా యెహోవా! మీరే మాకు తండ్రి. మేము మట్టి, మీరు కుమ్మరి. మేమందరం మీ చేతి పనిగా ఉన్నాము.

  11. యెహోవా! ఎక్కువగా కోప్పడకండి; నిత్యం మా పాపాల్ని జ్ఞాపకం చేసుకోకండి. మేమంతా మీ ప్రజలమే కాబట్టి మా పట్ల దయ చూపించమని ప్రార్థిస్తున్నాము.

  12. యెహోవా! ఇదంతా జరిగిన తర్వాత, మీరు చూసి ఊరుకుంటారా? మీరు మౌనంగా ఉండి మమ్మల్ని ఇంకా శిక్షిస్తూనే ఉంటారా?

  13. “నన్ను అడగని వారికి నన్ను నేను బయలుపరచుకొన్నాను; నన్ను వెదకనివారికి నేను దొరికాను. ‘నేనున్నాను, ఇదిగో నేనున్నాను’ అని నా పేరిట మొరపెట్టని దేశంతో చెప్పాను.

  14. తమ ఊహల ప్రకారం చేస్తూ చెడు మార్గంలో నడుస్తూ ఉన్న మూర్ఖులైన ప్రజలకు నేను దినమంతా నా చేతులు చాపాను.

  15. వారు తోటల్లో బలులు అర్పిస్తూ ఇటుకల బలిపీఠం మీద ధూపం వేస్తూ నా ముఖం మీద నాకు కోపం తెప్పించిన ప్రజలు;

  16. వారు, ‘నా దగ్గరకు రావద్దు. దూరంగా ఉండండి, మీకంటే నేను ఎంతో పరిశుద్ధున్ని’ అని అంటారు. అలాంటివారు నా నాసిక రంధ్రాలకు పొగలా, రోజంతా మండే నిప్పులా ఉన్నారు.

  17. “చూడండి, ఇది నా ఎదుట గ్రంథంలో వ్రాయబడింది: నేను మౌనంగా ఉండను, వారికి పూర్తి ప్రతిఫలం చెల్లిస్తాను; మీ పాపాలకు మీ పూర్వికుల పాపాలకు, నేను వారికి వారి ఒడిలో ప్రతిఫలం చెల్లిస్తాను” అని యెహోవా అంటున్నారు. “ఎందుకంటే, వారు పర్వతాలమీద ధూపం వేశారు, కొండలమీద నన్ను అవమానించారు, గతంలో వారు చేసిన వాటన్నిటికి వారి ఒడిలోనే పూర్ణ ప్రతీకారాన్ని కొలిచి పోస్తాను.”

  18. Your iniquities, and the iniquities of your fathers together, saith the LORD, which have burned incense upon the mountains, and blasphemed me upon the hills: therefore will I measure their former work into their bosom.

  19. యెహోవా చెప్పే మాట ఇదే: “ద్రాక్షగుత్తిలో ఇంకా రసం కనబడినప్పుడు ప్రజలు, ‘దానిలో ఆశీర్వాదం ఉంది, దానిని నాశనం చేయకండి’ అని చెప్తారు కదా. అలాగే నా సేవకులందరి కోసం చేస్తాను; నేను వారందరిని నాశనం చేయను.

  20. యాకోబు నుండి యూదా నుండి వారసుల్ని తీసుకువస్తాను, వారు నా పర్వతాల్ని స్వాధీనపరచుకుంటారు. నేను ఏర్పరచుకున్న ప్రజలు వాటిని స్వతంత్రించుకుంటారు. నా సేవకులు అక్కడ నివసిస్తారు.

  21. నన్ను వెదకే నా ప్రజల కోసం షారోను గొర్రెలకు పచ్చికబయళ్లుగా, ఆకోరు లోయ పశువులకు విశ్రాంతి తీసుకునే చోటుగా ఉంటాయి.

  22. “అయితే యెహోవాను విడిచి, నా పరిశుద్ధ పర్వతాన్ని మరచి, గాదు దేవునికి బల్లను సిద్ధపరచి, మెనీ దేవునికి ద్రాక్షరస పాత్రలు నింపేవారలారా,

  23. నేను ఖడ్గానికి మిమ్మల్ని అప్పగిస్తాను, మీరందరు వధకు గురై కూలిపోతారు; ఎందుకంటే, నేను పిలిస్తే మీరు సమాధానం ఇవ్వలేదు, నేను మాట్లాడితే మీరు వినలేదు. నా దృష్టిలో మీరు చెడుగా ప్రవర్తించి నాకు అయిష్టమైన వాటిని ఎంచుకున్నారు.”

  24. కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే: “నా సేవకులు భోజనం చేస్తారు, కాని మీరు ఆకలితో ఉంటారు; నా సేవకులు త్రాగుతారు కాని మీరు దాహంతో ఉంటారు; నా సేవకులు సంతోషిస్తారు కాని మీరు సిగ్గుపరచబడతారు.

  25. నా సేవకులు తమ ఆనంద హృదయాలతో పాటలు పాడతారు, మీరు హృదయ వేదనతో ఏడుస్తారు నలిగిన ఆత్మలతో రోదిస్తారు.