కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “నేను చేయబోయే క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, నా ఎదుట నిత్యం నిలిచి ఉన్నట్లు, నీ పేరు నీ సంతానం నిలిచి ఉంటుంది” అని యెహోవా తెలియజేస్తున్నారు.

  2. “ప్రతి అమావాస్య రోజున, ప్రతి సబ్బాతు దినాన నా ఎదుట ఆరాధించడానికి ప్రజలందరూ వస్తారు” అని యెహోవా చెప్తున్నారు.

  3. “వారు వెళ్లి నా మీద తిరుగుబాటు చేసిన వారి శవాలను చూస్తారు; వాటిని తినే పురుగులు చావవు, వాటిని కాల్చే అగ్ని ఆరిపోదు, మనుష్యులందరికి అది అసహ్యంగా ఉంటుంది.”

  4. ఆమోను కుమారుడు యూదా రాజైన యోషీయా పాలనలో పదమూడవ సంవత్సరంలో యిర్మీయాకు యెహోవా వాక్కు వచ్చి,

  5. యెహోవా వాక్కు నాకు వచ్చి,

  6. “గర్భంలో నేను నిన్ను రూపించక ముందే నీవు నాకు తెలుసు, నీవు పుట్టకముందే నేను నిన్ను ప్రత్యేకపరచుకున్నాను; దేశాలకు నిన్ను ప్రవక్తగా నియమించాను” అని చెప్పింది.

  7. అప్పుడు నేను, “అయ్యో, ప్రభువైన యెహోవా, నేను చిన్నవాన్ని, ఎలా మాట్లాడాలో నాకు తెలియదు” అన్నాను.

  8. అయితే యెహోవా నాతో, “ ‘నేను చిన్నవాన్ని’ అని నీవు అనవద్దు. నేను నిన్ను ఎవరి దగ్గిరికి పంపితే నీవు వారి దగ్గరికి వెళ్లి నేను ఏది ఆజ్ఞాపించానో అది వారికి చెప్పాలి.

  9. నీవు వారికి భయపడవద్దు, నేను నీతో ఉండి నిన్ను విడిపిస్తాను అని యెహోవా చెప్తున్నారు.”

  10. తర్వాత యెహోవా తన చేయి చాపి, నా నోటిని ముట్టి, “నీ నోటిలో నా మాటలు పెట్టాను.

  11. పెళ్లగించడానికి, కూల్చివేయడానికి, నాశనం చేయడానికి, పడద్రోయడానికి, కట్టడానికి నాటడానికి నిన్ను దేశాల మీద, రాజ్యాల మీద నియమిస్తున్నాను” అని నాతో చెప్పారు.

  12. తర్వాత యెహోవా నాతో మాట్లాడుతూ, “యిర్మీయా, నీకేం కనబడుతోంది?” అని అడిగారు. అందుకు నేను, “బాదం చెట్టు కొమ్మ కనబడుతోంది” అని జవాబిచ్చాను.

  13. యెహోవా నాతో, “నీవు సరిగ్గా చూశావు, ఎందుకంటే నా మాట నెరవేరడం చూడాలని నేను కనిపెట్టుకుని ఉన్నాను” అన్నారు.

  14. మరోసారి యెహోవా నాతో మాట్లాడుతూ, “నీవు ఏం చూస్తున్నావు?” అని అడిగారు. అందుకు నేను, “మసలుతున్న బాన, అది ఉత్తర దిక్కునుండి మన వైపు వంగి ఉంది” అని చెప్పాను.

  15. అప్పుడు యెహోవా నాతో, “ఉత్తరం నుండి దేశంలో నివసించే వారందరి మీద విపత్తు కుమ్మరించబడుతుంది.

  16. నేను ఉత్తర రాజ్యాల జనాంగాలన్నిటిని పిలిపించబోతున్నాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “వారి రాజులు వచ్చి తమ సింహాసనాలను యెరూషలేము గుమ్మాల్లో ఏర్పరచుకుంటారు; వారు దాని చుట్టుప్రక్కల ఉన్న ప్రాకారాలన్నింటి మీద అలాగే యూదా పట్టణాలన్నింటి మీద దాడి చేస్తారు.

  17. నా ప్రజలు నన్ను విడిచి ఇతర దేవుళ్ళకు ధూపం వేసి, వారి చేతులు చేసిన విగ్రహాలను వారు పూజించి, వారు చేసిన దుర్మార్గాన్ని బట్టి నేను నా ప్రజల మీద నా తీర్పులను ప్రకటిస్తాను.

  18. “నిన్ను నీవు సిద్ధం చేసుకో! లేచి నిలబడి నేను నీకు ఏది ఆజ్ఞాపిస్తే అది వారితో చెప్పు. వారికి భయపడవద్దు, లేకపోతే వారి ముందు నేను నిన్ను భయపెడతాను.

  19. ఈ రోజు నేను మిమ్మల్ని దేశమంతటికి వ్యతిరేకంగా యూదా రాజులకు, దాని అధికారులకు, యాజకులకు, కోటగోడలు గల పట్టణంగా, ఇనుప స్తంభంగా ఇత్తడి గోడగా చేశాను.

  20. వారు నీతో యుద్ధం చేస్తారు గాని, నీ మీద విజయం పొందలేరు, నేను నీతో ఉండి నిన్ను విడిపిస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  21. యెహోవా వాక్కు నాకు వచ్చి ఇలా చెప్పింది:

  22. “నీవు వెళ్లి యెరూషలేము వింటూ ఉండగా ఇలా ప్రకటించు: “యెహోవా ఇలా అంటున్నారు: “ ‘నీ యవ్వనంలోని నీ భక్తి నాకు జ్ఞాపకముంది, మీ నిశ్చితార్థ కాలం యొక్క ప్రేమ నాకు జ్ఞాపకముంది; నీవు అరణ్యంలో నన్ను వెంబడించావు, విత్తబడని భూమిలో నన్ను వెంబడించావు.

  23. ఇశ్రాయేలు యెహోవాకు పరిశుద్ధమైనది, వారు ఆయన పంటలోని ప్రథమ ఫలాలు; ఇశ్రాయేలీయులను మ్రింగివేసినవారు శిక్షకు పాత్రులు, విపత్తు వారి మీదికి వస్తుంది’ ” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  24. యాకోబు సంతానమా, సర్వ ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మాట వినండి.

  25. యెహోవా ఇలా చెప్తున్నారు: “మీ పూర్వికులు అంతలా దూరమవడానికి, వారికి నాలో ఏం తప్పు కనిపించింది? వారు విలువలేని విగ్రహాలను పూజించి, వారు విలువలేని వారయ్యారు.