కంటెంట్‌కు వెళ్లండి

Wicked గురించి బైబిల్ వచనాలు

724 వచనాలు · 18 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యిర్మీయా యెహోవా మందిరంలో ఈ మాటలు మాట్లాడడం యాజకులు, ప్రవక్తలు, ప్రజలందరూ విన్నారు.

  2. అప్పుడు యిర్మీయా అధికారులందరితోను, అలాగే ప్రజలందరితోను ఇలా చెప్పారు: “మీరు విన్నదంతా ఈ ఆలయానికి, ఈ పట్టణానికి వ్యతిరేకంగా ప్రవచించడానికి యెహోవాయే నన్ను పంపించారు.

  3. మీ మార్గాలను, క్రియలను, సరిచేసికొని, మీ దేవుడైన యెహోవాకు లోబడండి. అప్పుడు యెహోవా తన మనస్సు మార్చుకుని, మీ మీదికి రప్పిస్తానని ఆయన ప్రకటించిన విపత్తును ఆయన రప్పించరు.

  4. సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “నేను ఖడ్గాన్ని, కరువును, తెగులును వారిపైకి పంపుతాను, వారిని తినడానికి పనికిరాని చెడ్డ అంజూర పండ్లలా చేస్తాను.

  5. నేను వారిని ఖడ్గంతో, కరువుతో, తెగుళ్ళతో వెంటాడి, వారిని ఏ దేశాల్లోకి తరుముతానో ఆ భూరాజ్యాలన్నిటికి వారిని అసహ్యమైన వారిగా, శాపంగా, భయానకంగా, హేళనగా నిందగా చేస్తాను.

  6. ఎందుకంటే వారు నా మాటలు వినలేదు” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “నా సేవకులైన ప్రవక్తల ద్వారా నేను వారికి మళ్ళీ మళ్ళీ పంపిన మాటలు వారు వినలేదు. వారే కాదు బందీలుగా ఉన్న మీరు కూడా వినలేదు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  7. “యెహోవా ఇలా అంటున్నారు: “ ‘నీ గాయం నయం కానిది, నీ గాయం తీవ్రమైనది.

  8. నీ పక్షంగా వాదించడానికి ఎవరు లేరు, నీ పుండుకు నివారణ లేదు, నీకు స్వస్థత లేదు.

  9. నీ స్నేహితులందరు నిన్ను మరచిపోయారు; వారు నీ గురించి ఏమీ పట్టించుకోరు. శత్రువు కొట్టినట్లుగా నేను నిన్ను కొట్టి, క్రూరమైనవానిలా నిన్ను శిక్షించాను, ఎందుకంటే నీ అపరాధం చాలా పెద్దది, నీ పాపాలు చాలా ఎక్కువ.

  10. నీ గాయం గురించి, తీరని నీ బాధ గురించి ఎందుకు ఏడుస్తున్నావు? నీ గొప్ప అపరాధం అనేక పాపాల కారణంగా నేను నీకు ఇవన్నీ చేశాను.

  11. నేను సహాయం కోసం పిలిచినా, మొరపెట్టినా ఆయన నా ప్రార్థనకు తన చెవులు మూసుకుంటారు.

  12. ఏ ప్రార్థన ఫలించకుండా, మీరు ఒక మేఘంతో మిమ్మల్ని మీరు కప్పుకున్నారు.

  13. కాని ఇశ్రాయేలీయులు మొండివారు కఠిన హృదయులు. నా మాటలు వినడానికి ఇష్టపడరు కాబట్టి నీ మాటలు కూడా వినరు.

  14. కాబట్టి నేను వారితో కోపంగా వ్యవహరిస్తాను; వారి మీద జాలి చూపించను వారిని వదిలిపెట్టను. వారు నా చెవుల్లో అరిచినా నేను వారి మొర వినను” అన్నారు.

  15. ఇశ్రాయేలు సరిహద్దుల లోపలే మీరు ఖడ్గంతో చంపబడేలా నేను మిమ్మల్ని శిక్షిస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.

  16. మీ చుట్టూ ఉన్న జాతుల విధులను పాటించడానికి మీరు ఎవరి శాసనాలను అనుసరించకుండా ఎవరి విధులను పాటించలేదో ఆ యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు.”

  17. దేశంలోని ప్రజలకు ఇలా చెప్పు: ‘యెరూషలేములో ఇశ్రాయేలు దేశంలో నివసిస్తున్నవారి గురించి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: అక్కడ నివసించే వారందరు చేసే హింస కారణంగా వారి దేశంలోని ప్రతిదీ తీసివేయబడుతుంది. కాబట్టి వారు ఆందోళనలో తమ ఆహారాన్ని తింటారు నిరాశతో నీరు త్రాగుతారు.

  18. నివాసులు ఉండిన పట్టణాలు వ్యర్థమైన శిథిలాలుగా, దేశం నిర్జనంగా మారుతాయి. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.’ ”

  19. నీవు వారిలా ప్రవర్తించడమే కాకుండా వారి అసహ్యకరమైన ఆచారాలను పాటించావు, ప్రవర్తన అంతటిలో వారికన్నా మరింతగా దిగజారిపోయావు.

  20. “మనుష్యకుమారుడా, నీవు ఇశ్రాయేలు పెద్దలతో మాట్లాడి వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: నన్ను సంప్రదించడానికి మీరు వచ్చారా? నా జీవం తోడు, నేను మీకే ఆలోచన చెప్పను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’

  21. Because they despised my judgments, and walked not in my statutes, but polluted my sabbaths: for their heart went after their idols.

  22. నేటి వరకు మీరు అర్పణలు అర్పించి, మీ పిల్లలను అగ్నిగుండాలు దాటించి మీరు పెట్టుకున్న విగ్రహాలన్నిటిని పూజించి అపవిత్రులవుతున్నారు. ఇశ్రాయేలీయులారా, నన్ను విచారించడానికి నేను మిమ్మల్ని అనుమతించాలా? నా జీవం తోడు నా నుండి మీకు ఏ ఆలోచనా దొరకదు, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

  23. నేను దుర్మార్గునితో, ‘దుర్మార్గుడా, నీవు తప్పక చస్తావు’ అని చెప్పినప్పుడు, వారి మార్గాలను విడిచిపెట్టమని నీవు వాన్ని హెచ్చరించకపోతే, ఆ దుర్మార్గుడు వాని పాపాలను బట్టి చనిపోతే వాని చావుకు నిన్ను బాధ్యున్ని చేస్తాను.

  24. నెబుకద్నెజరు అనే నేను, నా రాజభవనంలో హాయిగా, క్షేమంగా ఉన్నాను.

  25. నాకు ఒక కల వచ్చింది, అది నన్ను భయపెట్టింది. నేను మంచం మీద పడుకుని ఉన్నప్పుడు, నా మనస్సులోనికి వచ్చిన దృశ్యాలు, దర్శనాలు నన్ను భయపెట్టాయి.