Skip to content

Uprightness గురించి బైబిల్ వచనాలు

60 వచనాలు · 55 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యథార్థవంతులకు విజయం దాచి ఉంచేది ఆయనే, నిందారహితులుగా నడుచుకొనే వారికి ఆయనే డాలు.

  2. అలాంటివారు చీకటిదారిలో నడవడానికి, తిన్నని మార్గాలను విడిచిపెడతారు.

  3. యథార్థవంతులు దేశంలో నివసిస్తారు, ఏ తప్పుచేయని వారే దానిలో నిలిచి ఉంటారు.

  4. యథార్థంగా ప్రవర్తించేవారు క్షేమంగా జీవిస్తారు, కానీ మోసం చేసేవారు పట్టుబడతారు.

  5. నింద లేనివారికి యెహోవా మార్గం ఒక ఆశ్రయం, కాని కీడు చేసేవారికి అది పతనము.

  6. యథార్థవంతుల యథార్థత వారిని నడిపిస్తుంది, కానీ నమ్మకద్రోహులు వారి వంచనతో నాశనమవుతారు.

  7. యథార్థవంతుల నీతి వారిని విడిపిస్తుంది, కాని నమ్మకద్రోహులు వారి చెడు కోరికల చేత పట్టబడతారు.

  8. యథార్థవంతుని దీవెన వలన పట్టణం హెచ్చింపబడుతుంది, కాని దుష్టుని నోటి వలన అది నాశనమవుతుంది.

  9. వక్ర హృదయాలు గలవారిని యెహోవా అసహ్యించుకుంటారు, అయితే నిందారహితమైన మార్గాలు గలవారిని బట్టి ఆయన సంతోషిస్తారు.

  10. దుష్టుల మాటలు ఒక హత్యకు పొంచి ఉన్న వారి లాంటివి, యథార్థవంతుల మాటలు వారిని విడిపిస్తాయి.

  11. నీతి నిజాయితీగల వ్యక్తిని కాపాడుతుంది, కాని దుష్టత్వం పాపిని పడగొడుతుంది.

  12. యెహోవాకు భయపడేవారు యథార్థంగా నడుస్తారు, ఆయనను తృణీకరించేవారు వారి మార్గాల్లో వంచకులు.

  13. దుష్టుల ఇల్లు నాశనమవుతుంది, కాని యథార్థవంతుల గుడారం అభివృద్ధి చెందును.

  14. భక్తిలేనివారు అర్పించు బలులు యెహోవాకు అసహ్యం, అయితే యథార్థవంతుల ప్రార్ధన ఆయనకు సంతోషకరము.

  15. బుద్ధిహీనుని వానికి అవివేకం ఆనందాన్నిస్తుంది, కాని అవగాహన ఉన్నవాడు చక్కగా నడుచుకొనును.

  16. యథార్థవంతుల రాజమార్గం చెడును తప్పిస్తుంది; తమ మార్గాలను కాపాడుకునేవారు తమ ప్రాణాలను కాపాడుకుంటారు.

  17. నిజాయితీ లేనివాడు మూర్ఖుడు కావడం కంటే నిజాయితీగా ఉంటే మంచిది.

  18. దుష్టులు తమ ముఖంలో ధైర్యాన్ని ప్రదర్శిస్తారు, కాని యథార్థవంతులు తమ మార్గాల గురించి ఆలోచిస్తారు.

  19. మూర్ఖమైన మార్గాలు అనుసరించే ధనికుని కంటే, నిందారహితంగా నడుచుకొనే పేదవాడు మేలు.

  20. యథార్థమైన వారిని చెడు దారిలోకి నడిపించేవారు, తమ ఉచ్చులో తామే పడతారు, కాని నిందారహితులు మంచి వారసత్వాన్ని పొందుకుంటారు.

  21. ఎవరి నడక నిందారహితంగా ఉంటుందో వారు భద్రంగా ఉంచబడతారు, కాని ఎవరి మార్గాలు మూర్ఖంగా ఉంటాయో వారు హఠాత్తుగా గొయ్యిలో పడిపోతారు.

  22. రక్తపిపాసులు నిజాయితీ కల వ్యక్తిని ద్వేషిస్తారు యథార్థవంతులను చంపాలని చూస్తారు.

  23. చిన్నప్పటి నుండి గారాబం పొందుకున్న దాసుడు పెంకితనం గలవానిగా అవుతాడు.

  24. నేను తెలుసుకున్నది ఇది ఒక్కటే; దేవుడు మనుష్యజాతిని యథార్థవంతులుగానే సృజించారు, కానీ వారు అనేక చెడు పథకాల వెంటపడుతున్నారు.”

  25. నన్ను మీతో దూరానికి తీసుకెళ్లండి; త్వరగా! రాజు తన అంతఃపురాల్లోకి నన్ను తీసుకెళ్లనివ్వండి. చెలికత్తెలు నీ విషయం మేము గొప్పగా సంతోషిస్తున్నాము; నీ ప్రేమను ద్రాక్షరసం కన్నా ఎక్కువగా పొగడుతాము. యువతి వారు నిన్ను పొగడడం ఎంత మంచి విషయం!