Skip to content

Uprightness గురించి బైబిల్ వచనాలు

60 వచనాలు · 55 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నీతిమంతుల దారి సమంగా ఉంటుంది; యథార్థవంతుడా, మీరు నీతిమంతుల మార్గం సరాళం చేస్తావు.

  2. నీతిగా నడుచుకుంటూ నిజాయితీగా మాట్లాడేవారు, అవినీతి వలన వచ్చే లాభాన్ని విడిచిపెట్టి తమ చేతులతో లంచం తీసుకోకుండ, హత్య చేయాలనే కుట్రలు వినబడకుండ చెవులు మూసుకుని చెడుతనం చూడకుండ కళ్లు మూసుకునేవారు,

  3. వారు ఉన్నత స్థలాల్లో నివసిస్తారు, పర్వతాల కోటలు వారికి ఆశ్రయంగా ఉంటాయి. వారికి ఆహారం దొరుకుతుంది, వారికి నీళ్లు శాశ్వతంగా ఉంటాయి.

  4. యథార్థంగా జీవించేవారు సమాధానంలో ప్రవేశిస్తారు; వారు చనిపోయినప్పుడు వారికి విశ్రాంతి కలుగుతుంది.

  5. న్యాయస్థానంలో న్యాయం కోసం నిలబడే వారిని యథార్థంగా మాట్లాడేవారిని ద్వేషించేవారు మీలో ఉన్నారు.

  6. యాకోబు వారసులారా, “యెహోవా సహనం కోల్పోయారా? ఆయన ఇలాంటి పనులు చేస్తారా?” అని అనవచ్చా? “యథార్థంగా ప్రవర్తించే వారికి నా మాటలు క్షేమం కలిగించవా?

  7. నమ్మకమైనవారు దేశంలో లేకుండా పోయారు; యథార్థవంతుడు ఒక్కడూ లేడు. అందరు రక్తం చిందించడానికి పొంచి ఉన్నారు; వారు ఒకరిని ఒకరు వలలతో వేటాడతారు.

  8. వారిలో మంచి వారు ముళ్ళపొద వంటివారు, వారిలో అత్యంత యథార్థవంతులు ముండ్లకంచె కంటే ఘోరము. దేవుడు మిమ్మల్ని దర్శించే రోజు, మీ కాపరులు హెచ్చరించే రోజు వచ్చింది. ఇప్పుడే మీరు కలవరపడే సమయము.

  9. “చూడండి, శత్రువు కోరికలు న్యాయమైనవి కాకపోయినా అతడు అతిశయపడుతున్నాడు; కాని నీతిమంతుడు తన నమ్మకత్వాన్ని బట్టి జీవిస్తాడు.

  10. వారు సువార్త సత్యం ప్రకారం ప్రవర్తించడం లేదని నేను చూసినప్పుడు, వారందరి ముందు కేఫా అనే పేతురుతో, “నీవు యూదుడవు, అయినా నీవు యూదుల్లా కాక యూదేతరుల్లా జీవిస్తున్నావు. అలాంటప్పుడు యూదుల ఆచారాలను అనుసరించమని యూదేతరులను ఎందుకు బలవంతం చేస్తున్నావు?