Skip to content

Titus గురించి బైబిల్ వచనాలు

57 వచనాలు · 11 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మేము పంపించే ఈ ప్రియ స్నేహితులు మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట తమ ప్రాణాలను కూడా లెక్కచేయని వారు.

  2. మేము వ్రాసిన దానిని నోటి మాటలతో దృఢపరచడానికి యూదాను సీలను పంపిస్తున్నాము.

  3. వీటి కంటే మీమీద ఎక్కువ భారం మోపకూడదని పరిశుద్ధాత్మకు, మాకు అనిపించిన విషయాలు ఏమనగా:

  4. విగ్రహాలకు అర్పించిన ఆహారాన్ని తినడం, రక్తం తినడం, గొంతును నులిమి చంపిన జంతువుల మాంసం తినడం, లైంగిక అనైతికత సంబంధాలను మానుకోవాలి. వీటికి దూరంగా ఉండి జాగ్రత్త పడితే మీకు మేలు కలుగుతుంది. మీకు క్షేమం కలుగును గాక.

  5. కాని నా సోదరుడు తీతును అక్కడ నాకు కనిపించకపోవడంతో నా మనస్సుకు నెమ్మది లేదు. కాబట్టి అక్కడి ప్రజలకు వీడ్కోలు చెప్పి మాసిదోనియా ప్రాంతానికి వెళ్లాను.

  6. మాసిదోనియాకు చేరిన తర్వాత కూడా మాకు విశ్రాంతి లేదు, అయితే ఎక్కడకు వెళ్లినా తీవ్రమైన ఆందోళనలు, బయట కలహాలు లోపల భయాలు.

  7. కానీ, బలహీన హృదయులను ధైర్యపరచే దేవుడే తీతు రాక ద్వారా మమ్మల్ని ఓదార్చాడు.

  8. అతని రాక వల్లనే కాదు కాని, మీరు అతనికిచ్చిన ఆదరణ వల్ల కూడా. నన్ను చూడాలనే మీ కోరిక గురించి, మీ లోతైన దుఃఖం గురించి, నా పట్ల మీకున్న అభిమానం గురించి అతడు మాకు చెప్పాడు. అందుకు నేను ఎంతో ఎక్కువగా ఆనందించాను.

  9. వీటన్నిటిని బట్టి మేము ధైర్యపరచబడ్డాము. మాకు ఈ ఆదరణ కలిగినపుడు, తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన నెమ్మది పొందినందుకు అతడు ఎంత సంతోషంగా ఉన్నాడో చూసి మరి ఎక్కువగా సంతోషించాము.

  10. మిమ్మల్ని అతని ముందు చాలా పొగిడాను, మీరు నన్ను సిగ్గుపరచలేదు, మీకు ఎప్పుడు నిజమే చెప్పాము. అలాగే తీతు ముందు మేము చేసిన పొగడ్తలు వాస్తవమైనవే అని నిరూపించబడ్డాయి.

  11. కాబట్టి మీరందరు విధేయత చూపించి, భయంతో వణుకుతో అతన్ని మీరు ఎలా చేర్చుకున్నారో జ్ఞాపకం చేసుకున్నప్పుడు మీమీద అతనికున్న అభిమానం అధికమవుతుంది.

  12. కాబట్టి తీతు ఈ దాతృత్వ పనిని గతంలో ప్రారంభించినట్లే మీ వైపు నుండి కూడా దానిని పూర్తి చేయమని అతన్ని వేడుకున్నాము.

  13. మీ పట్ల నాకున్న శ్రద్ధనే తీతు హృదయంలో కూడా కలిగించిన దేవునికి కృతజ్ఞతలు.

  14. తీతు మా మనవిని అంగీకరించడమే కాకుండా, అతడు ఎంతో ఉత్సాహంతో తన ఇష్టంతో మీ దగ్గరకు వస్తున్నాడు.

  15. సువార్త పరిచర్య చేయడంలో సంఘాలన్నింటిలో ప్రసిద్ధి చెందిన సోదరుని కూడా అతనితో పంపుతున్నాను.

  16. అంతేకాక, కేవలం ప్రభువును మహిమపరచడానికి, సహాయం చేయడంలో మాకున్న ఆసక్తిని చూపించడానికి మేము చేస్తున్న దానిలో భాగంగా కానుకలను తీసుకెళ్తున్నప్పుడు మాతో పాటు ఉండడానికి సంఘాలు అతన్ని ఏర్పరచుకున్నారు.

  17. దాతృత్వంతో ఇచ్చిన కానుకలను మేము ఉపయోగించే విధానం గురించి ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్త పడుతున్నాము.

  18. కేవలం ప్రభువు దృష్టిలో మాత్రమే గాక, మనుష్యుల దృష్టికి కూడా మంచిది అనిపించిందే చేయాలని మేము బాధలు అనుభవిస్తున్నాము.

  19. అంతేకాక, మా సహోదరున్ని వారితో కూడా పంపుతున్నాము. అతడు ఆసక్తి కలిగినవాడని మాకు అనేకసార్లు రుజువుచేసి చూపించాడు. మీపై అతనికున్న నమ్మకాన్ని బట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆసక్తిగా ఉన్నాడు.

  20. ఇక తీతు అయితే నా జతపనివాడు మీ మధ్యలో తోటి పనివాడు; మా సహోదరులైతే సంఘాలకు ప్రతినిధులు క్రీస్తుకు ఘనత తెచ్చేవారు.

  21. నేను మీ దగ్గరకు పంపినవారి ద్వారా మిమ్మల్ని మోసం చేసి ఏమైనా సంపాదించుకున్నానా?

  22. తీతును మీ దగ్గరకు వెళ్లమని వేడుకున్నాను. అతనితో పాటు మా సహోదరున్ని కూడ పంపాను. తీతు మిమ్మల్ని దోచుకోలేదు కదా? మేము ఒకే ఆత్మను కలిగి ఒకే అడుగుజాడల్లో నడువలేదా?

  23. పద్నాలుగు సంవత్సరాల తర్వాత తీతును వెంటబెట్టుకొని బర్నబాతో కలిసి మళ్ళీ యెరూషలేముకు వెళ్లాను.

  24. దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి నేను అక్కడ నాయకులుగా పేరొందిన వారితో ఏకాంతంగా సమావేశమై, నేను యూదేతరుల మధ్య ప్రకటిస్తున్న సువార్త గురించి వారికి తెలియజేశాను. నా పందెంలో నేను వ్యర్థంగా పరుగెత్తలేదని పరుగెత్తకూడదని ఖచ్చితంగా కోరుతున్నాను.

  25. నాతో యెరూషలేముకు వచ్చిన తీతు గ్రీసు దేశస్థుడైనప్పటికి సున్నతి పొందాలని అతన్ని బలవంత పెట్టలేదు.