కంటెంట్‌కు వెళ్లండి

Titles and Names of Ministers గురించి బైబిల్ వచనాలు

54 వచనాలు · 38 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. కాని, మేము దేవుని సేవకులంగా మాకు మేమే అన్ని విధాలుగా మెప్పించుకుంటున్నాము: సహనంలో సమస్యల్లో కష్టాల్లో దుఃఖాల్లో;

  2. చాలా తీవ్రమైన పరీక్షల మధ్యలో కూడా అత్యధికమైన ఆనందాన్ని వారు పొందారు, వారు నిరుపేదలైనా విస్తారమైన దాతృత్వాన్ని కలిగి ఉన్నారు.

  3. ఎందుకంటే, తాము ఇవ్వగలిగిన దానికన్నా, తమ సామర్థ్యాన్ని మించి వారు ఇచ్చారని నేను సాక్ష్యమిస్తాను.

  4. కాబట్టి వాని సేవకులు కూడా నీతి సేవకుల్లా మారువేషం వేసుకోవడంలో వింత లేదు. వారి క్రియలకు తగిన అంతం వారికి ఉంటుంది.

  5. దేవుడు తన శక్తినిబట్టి నాకు అనుగ్రహించిన కృపావరం చొప్పున నేను ఆ సువార్తకు సేవకుడినయ్యాను.

  6. మనం విశ్వాసంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఐక్యతను పొందేవరకు, క్రీస్తు యొక్క పరిపూర్ణతకు సమానమైన పరిపూర్ణత గల వారం అయ్యేవరకు క్రీస్తు శరీరమైన సంఘం కట్టబడేలా తన ప్రజలను పరిచర్య కోసం సిద్ధపరచడానికి, క్రీస్తే అపొస్తలులను, ప్రవక్తలను, సువార్తికులను, కాపరులను, బోధకులను అనుగ్రహించారు.

  7. క్రీస్తు యేసు సేవకులైన పౌలు తిమోతి,

  8. నా సహోదరుడు, జతపనివాడు, నా తోటి యోధుడు, నా అవసరాలను చూసుకోవడాని మీరు పంపిన మీ దూతయైన ఎపఫ్రొదితును తిరిగి మీ దగ్గరకు పంపవలసిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను.

  9. అందువల్ల మీరు విశ్వాసంలో కొనసాగుతూ స్థిరంగా నిలబడి, సువార్తలో చెప్పబడిన నిరీక్షణలో నుండి తొలగిపోకుండా ఉండండి. మీరు విన్న ఈ సువార్త, ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడుతుంది, పౌలు అనే నేను ఆ సువార్తకు సేవకుడినయ్యాను.

  10. మీ కోసం నేను అనుభవిస్తున్న శ్రమలలో ఇప్పుడు నేను సంతోషిస్తున్నాను, సంఘమనే ఆయన శరీరం కోసం క్రీస్తు పడిన బాధల్లో మిగిలి ఉన్న వాటిలో నా వంతును, నా శరీరంలో పూర్తి చేస్తున్నాను.

  11. మీకు దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా తెలియజేయడానికి, దేవుడు నాకు అప్పగించిన బాధ్యతను బట్టి సంఘానికి సేవకుడినయ్యాను.

  12. మీకు తెలిసినట్టే, మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి దౌర్జన్యాన్ని అనుభవించాం కాని మన దేవుని సహాయంతో తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతున్నా ధైర్యంగా ఆయన సువార్తను మీకు ప్రకటించాము.

  13. దీని కోసమే నేను ప్రకటించేవానిగా, అపొస్తలునిగా యూదేతరులకు నమ్మకమైన బోధకునిగా ఉండడానికి నియమించబడ్డాను, నేను చెప్పేది నిజం నేను అబద్ధం చెప్పడం లేదు.

  14. ఈ మాట నమ్మతగింది: ఎవరైనా ఒక సంఘపెద్దగా ఉండాలని ఆశిస్తే అది మంచి పనిని కోరడమే.

  15. అదే విధంగా, సంఘ పరిచారకులు కూడా గౌరవించదగినవారిగా, నిష్కపటంగా ఉండాలి, మద్యానికి బానిసగా ఉండకూడదు, అక్రమ సంపాదన ఆశించకూడదు.

  16. సంఘాన్ని నడిపించే సంఘపెద్దలు, మరి ముఖ్యంగా వాక్యాన్ని ప్రకటించేవారు వాక్యాన్ని బోధించేవారు రెండింతల గౌరవానికి పాత్రులు.

  17. యేసు క్రీస్తు కోసం ఒక మంచి సైనికుని వలె నాతో పాటు కష్టాలను భరించు.

  18. ప్రభువు సేవకుడు కొట్లాడేవానిగా ఉండకుండా అందరితో దయగలవానిగా ఉండాలి, బోధించగల సామర్థ్యం కలిగి ఉండాలి, కోపిష్ఠిగా ఉండకూడదు.

  19. కాని నీవైతే అన్ని పరిస్థితుల్లో నిబ్బరం కలిగి కష్టాలను సహిస్తూ సువార్తికుని పని చేస్తూ, నీ పరిచర్య పనులను పూర్తిగా నెరవేర్చు.

  20. దేవుని దాసుడును యేసు క్రీస్తు యొక్క అపొస్తలుడనైన పౌలు అనే నేను దేవుడు ఏర్పరచుకున్నవారికి విశ్వాసాన్ని ప్రకటించడానికి, దైవిక జీవితాలను ఎలా జీవించాలో వారికి చూపించే సత్యాన్ని తెలుసుకోవడం నేర్పడానికి,

  21. సంఘపెద్ద దేవుని కుటుంబాన్ని నడిపిస్తాడు కాబట్టి, అతడు నిందారహితునిగా ఉండాలి, అయితే అహంకారిగా, త్వరగా కోప్పడేవానిగా, త్రాగుబోతుగా, దౌర్జన్యం చేసేవానిగా, అక్రమ సంపాదన ఆశించేవానిగా ఉండకూడదు.

  22. క్రీస్తు యేసును బట్టి ఖైదీనైన, పౌలు అనే నేను, మన సహోదరుడైన తిమోతి కలిసి,

  23. దేవునికి, ప్రభువైన యేసు క్రీస్తుకు సేవకుడనైన యాకోబు,

  24. అనేక రకాలైన దేవుని వరాలకు మంచి నిర్వాహకుల్లా ప్రతి ఒక్కరు దేవుని నుండి తాము పొందిన విశేష కృపావరాలను ఇతరుల మేలుకోసం ఉపయోగించాలి.

  25. తోటి సంఘపెద్దగా, క్రీస్తు పడిన శ్రమలకు సాక్షినై ఉండి, ప్రత్యక్షం కాబోతున్న మహిమలో భాగం పంచుకోబోతున్న నేను మీ సంఘ పెద్దలకు విజ్ఞప్తి చేసేది ఏమంటే: