Skip to content

The Scriptures గురించి బైబిల్ వచనాలు

159 వచనాలు · 108 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహోవా మాటలు నిర్దోషమైనవి, అవి మట్టి మూసలో శుద్ధి చేసిన వెండిలా పవిత్రమైనవి, ఏడుసార్లు శుద్ధి చేయబడిన బంగారం లాంటివి.

  2. మనుష్యులు నాకు లంచం ఇవ్వాలని ప్రయత్నించినా, మీ పెదవులు ఆజ్ఞాపించిన దానిని బట్టి నేను హింసాత్మక మార్గాలకు దూరంగా ఉన్నాను.

  3. యెహోవా ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణాన్ని తెప్పరిల్లజేస్తుంది. యెహోవా కట్టడలు నమ్మదగినవి, అవి సామాన్యులకు జ్ఞానాన్ని ఇస్తాయి.

  4. యెహోవా కట్టడలు సరియైనవి, హృదయానికి ఆనందం కలిగిస్తాయి. యెహోవా ఆజ్ఞలు ప్రకాశవంతమైనవి, కళ్లకు కాంతి కలిగిస్తాయి.

  5. అవి బంగారం కంటే, మేలిమి బంగారం కంటే విలువైనవి; తేనె కంటే, తేనెపట్టు నుండి వచ్చే ధారల కంటే మధురమైనవి.

  6. వాటి వల్ల మీ సేవకుడు హెచ్చరిక పొందుతాడు; వాటిని పాటించడం వలన గొప్ప బహుమానం దొరుకుతుంది.

  7. అప్పుడు నేను ఇలా అన్నాను, “ఇదిగో నేను ఉన్నాను. గ్రంథపుచుట్టలో నా గురించి వ్రాసి ఉంది.

  8. యువత పవిత్ర మార్గంలో ఎలా ఉండగలరు? మీ వాక్యాన్ని అనుసరించి జీవించడం వల్లనే.

  9. నేను మీకు విరోధంగా పాపం చేయకూడదని మీ వాక్యాన్ని నా హృదయంలో దాచుకున్నాను.

  10. యెహోవా, మీకు స్తుతి కలుగును గాక; మీ శాసనాలను నాకు బోధించండి.

  11. మీ నోట నుండి వచ్చే న్యాయవిధులన్నిటిని నా పెదవులతో వివరిస్తాను.

  12. మీ శాసనాలను బట్టి నేను ఆనందిస్తాను; నేను మీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయను.

  13. నేను నేల మీద పడిపోయాను; మీ మాట ప్రకారం నా జీవితాన్ని కాపాడండి.

  14. దుఃఖం చేత నా ప్రాణం క్రుంగిపోతుంది; మీ వాక్యం ద్వారా నన్ను బలపరచండి.

  15. యెహోవా, మీ శాసనాల విధానాన్ని నాకు బోధించండి, అంతం వరకు నేను వాటిని అనుసరిస్తాను.

  16. యెహోవా, మీ మారని ప్రేమ, మీ వాగ్దాన ప్రకారం, మీ రక్షణ నాకు వచ్చును గాక.

  17. అప్పుడు నన్ను నిందించే వారెవరికైనా నేను సమాధానం చెప్పగలను, ఎందుకంటే మీ మాట మీద నాకు నమ్మకము.

  18. మీ సేవకునికి మీరిచ్చిన మాట జ్ఞాపకం చేసుకోండి, ఎందుకంటే మీరు నాకు నిరీక్షణ కలిగించారు.

  19. నా శ్రమలో నా ఆదరణ ఇదే: మీ వాగ్దానం నన్ను బ్రతికిస్తుంది.

  20. నేను మీ ఆజ్ఞలను నమ్ముకున్నాను, నాకు సరియైన వివేచనను గ్రహింపును బోధించండి.

  21. నాకు బాధ కలుగకముందు నేను త్రోవ తప్పి తిరిగాను, కాని ఇప్పుడు నేను మీ వాక్కుకు లోబడుతున్నాను.

  22. మీకు భయపడేవారు నన్ను చూసినప్పుడు సంతోషించుదురు గాక, ఎందుకంటే నేను మీ మాటలో నా నిరీక్షణ ఉంచాను.

  23. మీ సేవకునికి మీరు ఇచ్చిన వాగ్దాన ప్రకారం, మీ మారని ప్రేమ నాకు ఆదరణ కలిగిస్తుంది.

  24. మీరు కలిగించే రక్షణ కోసం ఎదురుచూస్తూ నా ప్రాణం సొమ్మసిల్లి పోతుంది; కాని నేను మీ మాట మీద నిరీక్షణ కలిగి ఉన్నాను.

  25. మీ వాగ్దానం కోసం ఎదురుచూస్తూ నా కళ్లు క్షీణిస్తున్నాయి; “మీరు నన్ను ఎప్పుడు ఆదరిస్తారు?” అని నేను అంటాను.