The Scriptures గురించి బైబిల్ వచనాలు: Reveal the laws, statutes, and judgments of God
Reveal the laws, statutes, and judgments of God గురించి వచనాలు
మోషే వచ్చి యెహోవా ఆజ్ఞాపించిన వాటన్నిటిని, చట్టాలను ప్రజలకు చెప్పినప్పుడు వారందరు ఏకకంఠంతో, “యెహోవా ఆజ్ఞాపించిన వాటన్నిటిని మేము చేస్తాం” అన్నారు.
అప్పుడు మోషే యెహోవా చెప్పిన వాటన్నిటిని వ్రాశాడు. మరుసటిరోజు ఉదయానే లేచి పర్వతం క్రింద ఒక బలిపీఠాన్ని కట్టి ఇశ్రాయేలీయుల పన్నెండు గోత్రాలను బట్టి పన్నెండు స్తంభాలను నిలబెట్టాడు.
చూడండి, నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీరు పాటించవలసిన శాసనాలను చట్టాలను నేను మీకు బోధించాను.
మీరు యొర్దాను దాటి స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీరు అనుసరించాల్సిన శాసనాలను చట్టాలను మీకు నేర్పించమని యెహోవా నాకు ఆదేశించారు.