కంటెంట్‌కు వెళ్లండి

Spiritual Peace గురించి బైబిల్ వచనాలు

65 వచనాలు · 53 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నేను వారి మార్గాలను చూశాను, కాని వారిని బాగుచేస్తాను; నేను వారిని నడిపించి ఇశ్రాయేలులో దుఃఖించేవారిని ఓదారుస్తూ,

  2. వారి పెదవులపై స్తుతి కలుగజేస్తాను. దూరంగా ఉన్నవారికి దగ్గరగా ఉన్నవారికి సమాధానం, సమాధానం” అని యెహోవా అంటున్నారు. “నేను వారిని బాగుచేస్తాను.”

  3. “దుర్మార్గులకు సమాధానం ఉండదు” అని నా దేవుడు చెప్తున్నారు.

  4. యెహోవా చెప్పే మాట ఇదే: “వినండి. ఆమె దగ్గరకు సమాధానం నదిలా ప్రవహించేలా చేస్తాను, దేశాల సంపదలు పొంగిపొర్లే ప్రవాహంలా వస్తాయి; మీరు పోషించబడి ఆమె చంకనెక్కుతారు ఆమె మోకాళ్లమీద ఆడుకుంటారు.

  5. నా ప్రజల గాయం తీవ్రమైనది కానట్టు వారు దానికి కట్టు కడతారు. సమాధానం లేనప్పుడు, ‘సమాధానం, సమాధానం’ అని వారంటారు.

  6. “ ‘అయినప్పటికీ, నేను దానికి ఆరోగ్యాన్ని స్వస్థతను తెస్తాను; నేను నా ప్రజలను స్వస్థపరచి వారు సమృద్ధిగా సమాధానాన్ని సత్యాన్ని ఆస్వాదించేలా చేస్తాను.

  7. “ ‘అవి అరణ్యంలో క్షేమంగా నివసించి అడవుల్లో పడుకునేలా నేను వాటితో సమాధాన ఒడంబడిక చేసుకుంటాను, అలాగే అడవి మృగాలను దేశంలో లేకుండా చేస్తాను.

  8. సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “నాలుగు, అయిదు, ఏడు పదవ నెలల్లో మీరు చేసే ఉపవాసాలు యూదా వారికి ఆనందాన్ని ఉల్లాసాన్ని కలిగించే సంతోషకరమైన పండుగలుగా మారుతాయి. కాబట్టి సత్యాన్ని సమాధానాన్ని ప్రేమించండి.”

  9. నేను ఎఫ్రాయింలో రథాలు లేకుండా చేస్తాను యెరూషలేములో యుద్ధ గుర్రాలు లేకుండా చేస్తాను యుద్ధపు విల్లు విరిగిపోతుంది. ఆయన దేశాలకు సమాధానాన్ని ప్రకటిస్తారు. ఆయన రాజ్యం సముద్రం నుండి సముద్రం వరకు నది నుండి భూమి అంచుల వరకు ఉంటుంది.

  10. నేను లేవీయులతో చేసిన నిబంధన జీవానికి సమాధానానికి సంబంధించింది. వారు నా పట్ల భయభక్తులు చూపాలని అవి వారికి ఇచ్చాను. అప్పుడు వారు నన్ను గౌరవించి నా పేరు పట్ల భయభక్తులు కలిగివుంటారు.

  11. To give light to them that sit in darkness and in the shadow of death, to guide our feet into the way of peace.

  12. “అత్యున్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టమైనవారికి భూమి మీద సమాధానం కలుగును గాక.”

  13. “సర్వశక్తిగల ప్రభువా, నీ మాట ప్రకారం, ఇప్పుడు సమాధానంతో నీ దాసుని వెళ్లనివ్వు.

  14. “మీరు ఒక ఇంట్లో ప్రవేశించినప్పుడు, మొదట, ‘ఈ ఇంటికి సమాధానం కలుగును గాక’ అని చెప్పండి.

  15. “నీకు దేని ద్వార సమాధానం కలుగుతుందో నీవు తెలుసుకొని ఉంటే బాగుండేది, కాని ఇప్పుడది నీ కళ్ల నుండి దాచబడి ఉంది.

  16. నా సమాధానాన్ని మీతో వదిలి వెళ్తున్నాను; నా సమాధానాన్ని మీకు ఇస్తున్నాను. నేను ఈ లోకం ఇచ్చినట్టుగా ఇవ్వడం లేదు మీ హృదయాలను కలవరపడనీయకండి, భయపడకండి.

  17. “ఈ లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి. అయినా ధైర్యం తెచ్చుకోండి! ఎందుకంటే నేను లోకాన్ని జయించాను. నాలో మీకు సమాధానం ఉండాలని ఈ సంగతులను మీకు చెప్పాను” అన్నారు.

  18. అందరికి ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా సమాధాన సువార్తను ప్రకటిస్తూ, ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానం మీకు తెలుసు.

  19. సమాధాన మార్గం వారికి తెలియదు.”

  20. మనం విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం కాబట్టి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనం సమాధానాన్ని కలిగి ఉన్నాము.

  21. శరీరానుసారమైన మనస్సు మరణము; కాని ఆత్మానుసారమైన మనస్సు జీవం సమాధానమై ఉన్నది.

  22. ప్రకటించేవారిని పంపకపోతే ఎలా ప్రకటించగలరు? దీని గురించి, “సువార్తను తెచ్చేవారి పాదాలు ఎంతో అందమైనవి!” అని వ్రాయబడి ఉంది.

  23. దేవుని రాజ్యం తినడం త్రాగడం కాదు. అది నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందం.

  24. పరిశుద్ధాత్మ శక్తిచేత మీరు అత్యధికమైన నిరీక్షణను కలిగి ఉండేలా నిరీక్షణకర్తయైన దేవుడు, మీరు ఆయనలో నమ్మకముంచిన ప్రకారం మిమ్మల్ని సంతోషంతో సమాధానంతో నింపును గాక.

  25. సమాధానకర్తయైన దేవుడు మీ అందరితో ఉండును గాక. ఆమేన్.