Skip to content

Rocks గురించి బైబిల్ వచనాలు

98 వచనాలు · 54 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. లేమితో ఆకలితో బక్కచిక్కినవారై, పొడిగా ఉన్న భూమిపై తిరుగులాడారు రాత్రివేళ నిర్జనమైన బంజరు భూములలో.

  2. కాబట్టి ఇప్పుడు వారు భయపెట్టే లోయల్లో, బండల మధ్య గుహల్లో నివసిస్తున్నారు.

  3. “కొండమీద తిరిగే అడవి మేకలు ఎప్పుడు ఈనుతాయో నీకు తెలుసా? లేళ్లు పిల్లలను కంటున్నప్పుడు నీవు చూశావా?

  4. ఎవరు ఎక్కలేని కొండచరియలో నివసిస్తుంది రాత్రివేళ అక్కడే గడుపుతుంది; ఏటవాలుగా ఉన్న బండ దానికి బలమైన కోట.

  5. సంగీత దర్శకునికి. యెహోవా దావీదును శత్రువులందరి చేతి నుండి సౌలు చేతి నుండి విడిపించినప్పుడు అతడు పాడిన పాట. యెహోవా సేవకుడైన దావీదు కీర్తన. యెహోవా నా బలమా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను.

  6. యెహోవా నా కొండ, నా కోట నా విమోచకుడు; నా దేవుడు నేను ఆశ్రయించే నా కొండ, నా డాలు నా రక్షణ కొమ్ము, నా బలమైన కోట.

  7. ఆపద సంభవించిన దినాన ఆయన తన ఆశ్రయంలో నన్ను క్షేమంగా ఉంచుతారు; తన పవిత్ర గుడారంలో ఆయన నన్ను దాచిపెడతారు, ఎత్తైన బండ మీద నన్ను నిలుపుతారు.

  8. మీరు నా వైపు చెవియొగ్గి, నన్ను విడిపించడానికి త్వరగా రండి; నా ఆశ్రయదుర్గమై, బలమైన కోటవై నన్ను కాపాడండి.

  9. మీరు నా కొండ, నా కోట; మీ నామాన్ని బట్టి నన్ను నడిపించండి.

  10. నాశనకరమైన గుంటలో నుండి నన్ను పైకి లేపారు, బురద ఊబిలో నుండి లేపి నా పాదాలను బండ మీద నిలిపారు. నిలబడడానికి నాకు స్థిరమైన స్థలాన్ని ఇచ్చారు.

  11. తద్వార భూమి మీద మీ మార్గాలు దేశాలన్నిటికి మీ రక్షణ తెలుస్తాయి,

  12. కానీ మిమ్మల్ని నేను శ్రేష్ఠమైన గోధుమలతో పోషిస్తాను; బండ నుండి తీసిన తేనెతో నేను మిమ్మల్ని తృప్తిపరుస్తాను.”

  13. ‘మీరు నా తండ్రి, నా దేవుడు నా కొండ, నా రక్షకుడు’ అని అతడు నాకు మొరపెడతాడు.

  14. యెహోవా నాకు ఎత్తైన కోట. నా దేవుడు నేను ఆశ్రయించే కొండ.

  15. రండి! యెహోవాను గురించి ఆనంద గానం చేద్దాం; రక్షణ కొండయైన దేవునికి ఆనంద కేకలు వేద్దాము.

  16. అడవి మేకపోతులు ఎత్తైన పర్వతాలమీద మేస్తూ ఉంటాయి; కుందేళ్ళు బండ సందులను ఆశ్రయిస్తాయి.

  17. చిన్న కుందేళ్ళు బలంలేని ప్రాణులైనా, అవి బండ సందుల్లో నివాసాలు ఏర్పరచుకుంటాయి.

  18. బండ సందుల్లో, పర్వత ప్రాంతంలో దాగే స్థలాల్లో ఉన్న నా పావురమా, నీ ముఖాన్ని నాకు చూపించు, నీ స్వరాన్ని విననివ్వు; ఎందుకంటే నీ స్వరం మధురం నీ ముఖం మనోహరము.

  19. యెహోవా భూమిని వణికించడానికి లేచినప్పుడు, ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహాత్మ్యం నుండి పారిపోయి వారు కొండల గుహల్లో నేలలో ఉన్న సందుల్లో దాక్కుంటారు.

  20. ఆయన పరిశుద్ధ స్థలంగా ఉంటారు; అయితే ఆయన ఇశ్రాయేలుకు, యూదాకు ప్రజలను తడబడేలా చేసే రాయిలా వారిని పడిపోయేలా చేసే బండలా ఉంటారు. ఆయన యెరూషలేము ప్రజలకు బోనుగా, ఉచ్చుగా ఉంటారు.

  21. ఓరేబు బండ దగ్గర మిద్యానును చంపినట్లు సైన్యాల యెహోవా తన కొరడాతో వారిని కొడతారు; ఆయన ఈజిప్టులో చేసినట్టు తన దండాన్ని సముద్రం మీద ఎత్తుతారు.

  22. నీ రక్షకుడైన దేవుని నీవు మరచిపోయావు; నీ బలానికి ఆధారమైన బండను గుర్తు చేసుకోలేదు. కాబట్టి నీవు అందమైన తోటలు పెంచినా వాటిలో విదేశీ ద్రాక్షతీగెలు నాటినా,

  23. నీవిక్కడేం చేస్తున్నావు నీకోసం ఇక్కడ సమాధిని ఎందుకు తొలిపించుకున్నావు? నీ సమాధిని ఎత్తైన స్థలంలో తొలిపించుకున్నావు? నీ విశ్రాంతి స్థలాన్ని బండపై ఎందుకు చెక్కించుకున్నావు? నీకు ఎవరు అనుమతి ఇచ్చారు?

  24. వారిలో ప్రతి ఒక్కరు గాలి వీచినప్పుడు దాక్కునే స్థలంలా తుఫానులో ఆశ్రయంగా ఎడారిలో నీటి ప్రవాహాల్లా ఎండిన భూమిలో ఒక గొప్ప కొండ నీడలా ఉంటారు.

  25. వారు ఉన్నత స్థలాల్లో నివసిస్తారు, పర్వతాల కోటలు వారికి ఆశ్రయంగా ఉంటాయి. వారికి ఆహారం దొరుకుతుంది, వారికి నీళ్లు శాశ్వతంగా ఉంటాయి.