Rocks గురించి బైబిల్ వచనాలు: Christ as a stumbling stone to the wicked
Christ as a stumbling stone to the wicked గురించి వచనాలు
ఆయన పరిశుద్ధ స్థలంగా ఉంటారు; అయితే ఆయన ఇశ్రాయేలుకు, యూదాకు ప్రజలను తడబడేలా చేసే రాయిలా వారిని పడిపోయేలా చేసే బండలా ఉంటారు. ఆయన యెరూషలేము ప్రజలకు బోనుగా, ఉచ్చుగా ఉంటారు.
దీని కోసం ఇలా వ్రాయబడి ఉంది: “ఇదిగో, నేను సీయోనులో ప్రజలు తడబడేలా చేసే అడ్డురాయిని, వారు పడిపోయేలా చేసే అడ్డుబండను వేశాను, ఆయనలో నమ్మకం ఉంచేవారు ఎన్నడూ సిగ్గుపరచబడరు.”
అంతేకాదు, “అది ప్రజలు తడబడేలా చేసే అడ్డురాయి, వారిని పడిపోయేలా చేసే అడ్డుబండ అయ్యింది.” వారిని పడద్రోసేది ఈ రాయే, వారు ఆ వాక్యానికి అవిధేయులు అయినందుకు వారు పతనమయ్యారు. వారిని గురించిన దేవుని సంకల్పం అలాంటిది.