Persia గురించి బైబిల్ వచనాలు: Prophecies concerning
Prophecies concerning గురించి వచనాలు
చూడండి, వారి మీద దాడి చేయడానికి నేను మెదీయ వారిని రేపుతాను. వారు వెండిని లెక్కచేయరు. బంగారం మీద వారికి ఆసక్తి లేదు.
సముద్రపు తీరాన ఉన్న ఎడారికి వ్యతిరేకంగా ప్రవచనం: దక్షిణ దిక్కున సుడిగాలి వీచినట్లుగా ఎడారిలో నుండి భయంకరమైన దేశం నుండి దోచుకునేవాడు వస్తాడు.
భయంకరమైన దర్శనం నాకు వచ్చింది: మోసం చేసేవారు మోసం చేస్తారు, దోచుకొనేవారు దోచుకుంటారు. ఏలామూ, వెళ్లి దాడి చేయి! మెదీయా, ముట్టడించు! దాని మూలుగు అంతటిని నేను ఆపివేస్తాను.
కాబట్టి నా నడుము చాలా నొప్పిగా ఉంది, ప్రసవించే స్త్రీ వేదన నాకు కలిగింది; నేను విన్నదానిని బట్టి నేను తడబడ్డాను, నేను చూసిన దానిని బట్టి నేను దిగ్భ్రాంతి చెందాను.
నా గుండె దడదడలాడుతుంది భయంతో వణుకు పుడుతుంది; నేను ఇష్టమైన సంధ్యవేళ నాకు భయం పుట్టించింది.
వారు భోజనపు బల్లలను సిద్ధం చేశారు, వారు తివాసీలు పరిచారు, వారు తిని త్రాగుతారు! అధిపతులారా! లేవండి డాళ్లకు నూనె రాయండి.
ప్రభువు నాతో చెప్పిన మాట ఇదే: “వెళ్లి కాపలా పెట్టండి అతడు చూసింది తెలియజేయాలి.
అతడు రథాలను గుర్రాల జట్లను గాడిదల మీద వచ్చేవారిని ఒంటెల మీద వచ్చేవారిని చూడగానే అతడు జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఉండాలి.”
కావలివాడు సింహంలా కేకలు వేసి “నా ప్రభువా, ప్రతిరోజు పగలంతా కావలి గోపురం మీద నిలబడుతున్నాను; రాత్రంతా కాపలా కాస్తూనే ఉన్నాను.
చూడు, జతలు జతలుగా గుర్రపు రౌతులతో కలిసి రథం మీద ఓ మనిషి వస్తున్నాడు అనగా అతడు ఇలా సమాధానం చెప్పాడు: ‘బబులోను కూలిపోయింది, కూలిపోయింది! దాని దేవతల విగ్రహాలన్నీ నేలమీద బద్దలై పడి ఉన్నాయి.’ ”
నూర్పిడి కళ్ళాల్లో నలిగిపోతున్న నా ప్రజలారా! సైన్యాల యెహోవా నుండి ఇశ్రాయేలు దేవుని నుండి నేను విన్నది నీకు చెప్తాను.
యూదా రాజైన సిద్కియా పాలనలో ఏలామును గురించి యిర్మీయా ప్రవక్తకు వచ్చిన యెహోవా వాక్కు ఇది:
సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “చూడండి, నేను ఏలాము బలానికి మూలమైన విల్లును విరగ్గొడతాను.
నేను ఏలాముకు వ్యతిరేకంగా ఆకాశంలోని నాలుగు దిక్కుల నుండి నాలుగు గాలులను రప్పిస్తాను; నేను వారిని నాలుగు గాలులకు చెదరగొడతాను, చెదిరిపోయిన ఏలాము వారు వెళ్లని దేశమే ఉండదు.
నేను ఏలామును వారి శత్రువుల ఎదుట, వారిని చంపాలనుకున్న వారి ఎదుట వారిని చెదరగొడతాను. నేను వారి మీదికి విపత్తును, నా కోపాగ్నిని కూడా రప్పిస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “నేను వారిని అంతం చేసే వరకు ఖడ్గంతో వారిని వెంటాడుతాను.
ఏలాములో నా సింహాసనాన్ని స్థాపించి, దాని రాజును, అధికారులను నాశనం చేస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
“అయినప్పటికీ నేను రాబోయే రోజుల్లో ఏలాముకు చెందిన వారిని చెర నుండి తిరిగి రప్పిస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
“బాణాలకు పదును పెట్టండి, కవచాలను తీసుకోండి! యెహోవా మాదీయుల రాజులను రెచ్చగొట్టారు, ఎందుకంటే బబులోనును నాశనం చేయడమే ఆయన ఉద్దేశము. యెహోవా ప్రతీకారం తీర్చుకుంటారు, తన మందిరం కోసం ప్రతీకారం తీర్చుకుంటారు.
బబులోను గోడలకు వ్యతిరేకంగా జెండా ఎత్తండి! రక్షకభటులను బలపరచండి, కావలివారిని నిలబెట్టండి, మాటుగాండ్రను సిద్ధం చేయండి! యెహోవా తన ఉద్దేశాన్ని, బబులోను ప్రజలకు వ్యతిరేకంగా తన శాసనాన్ని నెరవేర్చబోతున్నారు.
అనేక జలాల ప్రక్కన నివసించేదానా, సమృద్ధి సంపదలు కలిగి ఉన్నదానా, నీ అంతం వచ్చింది, నీవు నాశనమయ్యే సమయం వచ్చింది.
సైన్యాల యెహోవా తన జీవం తోడని ప్రమాణం చేశారు: మిడతల దండులా నేను నిన్ను నిశ్చయంగా మనుష్యులతో నింపుతాను, వారు నీపై విజయ కేకలు వేస్తారు.
“ఆయన తన శక్తితో భూమిని చేశారు; ఆయన తన జ్ఞానంతో లోకాన్ని స్థాపించారు, తన తెలివితో ఆకాశాన్ని వ్యాపింపజేశారు.
ఆయన ఉరిమినప్పుడు, ఆకాశ జలాలు గర్జిస్తాయి; ఆయన భూదిగంతాల నుండి మేఘాలు లేచేలా చేస్తారు. ఆయన వర్షంతో మెరుపులు పంపి తన గిడ్డంగుల నుండి గాలిని రప్పిస్తారు.
“మనుష్యులందరు బుద్ధి జ్ఞానం లేనివారు; ప్రతి కంసాలివాడు తన విగ్రహాలను చూసి సిగ్గుపడతాడు. అతడు చేసే చిత్రాలు మోసం; వాటిలో ఊపిరి లేదు.
అవి పనికిరానివి, అపహాస్యం కొరకైనవి; వాటికి తీర్పు వచ్చినప్పుడు అవి నశించిపోతాయి.