కంటెంట్‌కు వెళ్లండి

Passover గురించి బైబిల్ వచనాలు

161 వచనాలు · 14 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “పులిసిన దానితో కలిపి నాకు బలి యొక్క రక్తాన్ని అర్పించకూడదు. “నా పండుగ అర్పణల క్రొవ్వును ఉదయం వరకు ఉంచవద్దు.

  2. “పులియని రొట్టెల పండుగ జరుపుకోవాలి. ఎందుకంటే నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారం, ఏడు రోజులు మీరు పులియని పిండితో చేసిన రొట్టెలే తినాలి. అబీబు నెలలో నిర్ణీత సమయంలో మీరిలా చేయాలి, ఎందుకంటే ఆ నెలలో మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చారు.

  3. “ ‘ఇవి యెహోవాకు నియమించబడిన పండుగలు, వీటిని మీరు పరిశుద్ధ సమాజానికి వాటి నియామక సమయాల్లో ప్రకటించాలి:

  4. మొదటి నెల పద్నాలుగవ రోజు సాయంత్రం యెహోవా యొక్క పస్కా పండుగ ప్రారంభము.

  5. ఆ నెల పదిహేనవ రోజు యెహోవా యొక్క పులియని రొట్టెల పండుగ మొదలవుతుంది; ఏడు రోజులు మీరు పులియని రొట్టెలు తినాలి.

  6. మొదటి రోజు పరిశుద్ధ సభను నిర్వహించాలి, పనులేవీ చేయకూడదు.

  7. ఏడు రోజులు యెహోవాకు హోమబలులు అర్పించాలి. ఏడవ రోజు పరిశుద్ధ సభను నిర్వహించాలి, జీవనోపాధి కోసమైన పనులేవీ చేయకూడదు.’ ”

  8. “ఇశ్రాయేలీయులు నిర్ణీత సమయంలో పస్కా పండుగ జరుపుకోవాలి.

  9. దాని నిర్ణీత సమయంలో అనగా, ఈ నెల పద్నాలుగవ రోజు సాయంకాల సమయంలో, నియమ నిబంధనలతో ఈ పండుగ జరుపుకోవాలి.”

  10. కాబట్టి మోషే పస్కాను జరుపుకోమని ఇశ్రాయేలీయులకు చెప్పాడు,

  11. వారంతా అదే విధంగా మొదటి నెల పద్నాలుగవ రోజు సాయంకాలం సీనాయి అరణ్యంలో పస్కాను జరుపుకుంటారు. ఇశ్రాయేలీయులు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతా చేశారు.

  12. అయితే కొందరు మనుష్యులు మృతదేహాన్ని బట్టి ఆచారరీత్య అపవిత్రులైనందుకు ఆ రోజున పస్కాను జరుపుకోలేకపోయారు. కాబట్టి అదే రోజు వారు మోషే అహరోనుల దగ్గరకు వచ్చి,

  13. వారు మోషేతో, “ఒక మనుష్యుని మృతదేహాన్ని బట్టి మేము అపవిత్రులం అయ్యాము, అయితే యెహోవా అర్పణను ఇతర ఇశ్రాయేలీయులతో పాటు నిర్ణీత సమయంలో మేము ఎందుకు సమర్పించకూడదు?” అని అడిగారు.

  14. అందుకు మోషే వారితో, “మీ గురించి యెహోవా ఏమి ఆజ్ఞాపిస్తారో తెలుసుకునే వరకు ఆగండి” అని జవాబిచ్చాడు.

  15. అప్పుడు యెహోవా మోషేతో,

  16. “ఇశ్రాయేలీయులతో చెప్పు: ‘ఇప్పుడున్న మీలో ఎవరైనా లేదా రాబోయే తరాల వారైనా మృతదేహాన్ని బట్టి గాని దూర ప్రయాణాన్ని బట్టి గాని అపవిత్రులైతే, వారు యెహోవా పస్కాను జరుపుకోవచ్చు,

  17. అయితే వారు రెండవ నెల పద్నాలుగవ రోజు సాయంకాలం జరుపుకోవాలి. వారు పులియని రొట్టెలతో, చేదు కూరలతో పాటు గొర్రెపిల్లను తినాలి.

  18. తెల్లవారేటప్పడికి దానిలో ఏది మిగులకూడదు లేదా దాని ఎముకల్లో ఒక్కటి కూడా విరువకూడదు. పస్కాను జరుపుకున్నప్పుడు వారు నియమాలన్నీ పాటించాలి.

  19. అయితే ఎవరైనా ఆచార ప్రకారం పవిత్రంగా ఉంటూ ప్రయాణంలో లేదా ఉన్న చోటే ఉంటూ, పస్కాను జరుపుకోకుండా ఉంటే, నిర్ణీత సమయంలో యెహోవాకు అర్పణను అర్పించనందుకు వారిని ప్రజల నుండి తొలగించాలి. వారి పాపానికి వారే పాపశిక్షను భరిస్తారు.

  20. “ ‘మీ మధ్యలో ఉంటున్న విదేశీయులు కూడా యెహోవా పస్కాను నియమ నిబంధనలతో జరుపుకోవాలి. విదేశీయులకు స్వదేశీయులకు ఒకే నియమాలు ఉండాలి.’ ”

  21. “ ‘మొదటి నెల పద్నాలుగవ రోజు యెహోవా యొక్క పస్కా పండుగ ఆచరించాలి.

  22. ఆ నెల పదిహేనవ రోజు ఒక పండుగ జరగాలి; ఏడు రోజులు పులియని రొట్టెలు తినాలి.

  23. మొదటి రోజు పరిశుద్ధ సభను నిర్వహించాలి, పనులేవీ చేయకూడదు.

  24. యెహోవాకు హోమబలిగా లోపం లేని రెండు కోడెలు, ఒక పొట్టేలు, ఏడాది వయస్సున్న ఏడు మగ గొర్రెపిల్లలు దహనబలిగా అర్పించాలి.

  25. ప్రతి కోడెతో పాటు ఒలీవనూనెతో కలిపిన మూడు ఓమెర్ల నాణ్యమైన పిండిని భోజనార్పణగా అర్పించాలి; పొట్టేలుతో, రెండు ఓమెర్లు;