Passover గురించి బైబిల్ వచనాలు: Reinstituted by Ezekiel
Reinstituted by Ezekiel గురించి వచనాలు
“ ‘మొదటి నెల పద్నాలుగవ రోజు పస్కా పండుగ ఆచరించాలి, ఆ పండుగ జరిగే ఏడు రోజులు మీరు పులియని రొట్టెలు తినాలి.
ఆ రోజు అధిపతి తన కోసం, దేశంలోని ప్రజలందరి కోసం పాపపరిహారబలిగా ఒక ఎద్దును అందించాలి.
పండుగ జరిగే ఏడు రోజుల్లో ప్రతిరోజు అతడు యెహోవాకు దహనబలిగా లోపం లేని ఏడు ఎద్దులు ఏడు పొట్టేళ్లను, పాపపరిహారబలిగా ఒక మేకపోతును ఇవ్వాలి.
అతడు భోజనార్పణగా ప్రతి కోడెతో పాటు ఒక ఏఫా పిండిని, ప్రతీ ఒక్క కోడెకు ఒక ఏఫా పిండిని, ప్రతీ ఒక్క పొట్టేలుకు ఒక ఏఫా పిండిని, ప్రతీ ఏఫా పిండికి ఒక హిన్ ఒలీవ నూనెను కూడా ఇవ్వాలి.