కంటెంట్‌కు వెళ్లండి

Parents గురించి బైబిల్ వచనాలు

156 వచనాలు · 48 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అతడు ఏలీతో, “యుద్ధభూమి నుండి వచ్చినవాన్ని నేనే, ఈ రోజే నేను యుద్ధంలో నుండి పరుగెత్తుకొని వచ్చాను” అని చెప్పాడు. అప్పుడు ఏలీ, “నా కుమారుడా, ఏమి జరిగింది?” అని అడిగాడు.

  2. అందుకు ఆ వార్త తెచ్చిన అతడు, “ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ముందు నిలబడలేక పారిపోయారు. సైన్యంలో అనేకమంది చంపబడ్డారు. నీ ఇద్దరు కుమారులైన హొఫ్నీ ఫీనెహాసులు కూడా చంపబడ్డారు. దేవుని మందసాన్ని శత్రువులు స్వాధీనం చేసుకున్నారు” అని చెప్పాడు.

  3. దేవుని మందసం గురించి అతడు చెప్పగానే, ఏలీ గుమ్మం దగ్గర ఉన్న తన కుర్చీమీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాడు. ఎందుకంటే అతడు ముసలివాడు, భారీకాయుడు. అతడు నలభై సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు.

  4. ఏలీ కోడలైన ఫీనెహాసు భార్య ప్రసవ సమయం దగ్గరపడిన గర్భవతి. దేవుని మందసాన్ని శత్రువులు స్వాధీనం చేసుకున్నారని, తన మామ, తన భర్త చనిపోయారని ఆమె విని, పురిటినొప్పులు వచ్చి, మోకాళ్లమీద కూలబడి ప్రసవించింది. ఆమె ఆ పురిటినొప్పులు తట్టుకోలేకపోయింది.

  5. ఆమె చనిపోతుండగా, అక్కడ నిలబడి ఉన్న స్త్రీలు ఆమెతో, “భయపడకు, నీకు కుమారుడు పుట్టాడు” అని చెప్పారు, కాని ఆమె జవాబు ఇవ్వలేదు, ఆ మాటలు పట్టించుకోలేదు.

  6. ఆమె దేవుని మందసాన్ని శత్రువులు స్వాధీనం చేసుకున్నారని, తన మామ, తన భర్త చనిపోయారని తెలుసుకొని, “ఇశ్రాయేలీయులలో నుండి మహిమ వెళ్లిపోయింది” అని అంటూ తన కుమారునికి ఈకాబోదు అని పేరు పెట్టింది.

  7. “దేవుని మందసాన్ని శత్రువులు స్వాధీనం చేసుకోవడం వలన, ఇశ్రాయేలీయులలో నుండి మహిమ వెళ్లిపోయింది” అని ఆమె చెప్పింది.

  8. కానీ సౌలు అతన్ని చంపడానికి ఈటె విసిరాడు. తన తండ్రి దావీదును చంపాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడని అప్పుడు యోనాతాను గ్రహించాడు.

  9. దావీదు బిడ్డ కోసం దేవున్ని వేడుకున్నాడు. అతడు ఉపవాసం ఉండి రాత్రులు గోనెపట్టలో నేలపై పడుకున్నాడు.

  10. రాజు యోవాబు, అబీషై, ఇత్తయిలను, “నన్ను బట్టి యువకుడైన అబ్షాలోముపై దయ చూపించండి” అని ఆదేశించాడు. అబ్షాలోము గురించి రాజు దళాధిపతులందరికి ఆజ్ఞ ఇవ్వడం సైన్యమంతా విన్నారు.

  11. అప్పుడు రాజు చాలా కలత చెంది గుమ్మానికి పైన ఉన్న గది లోనికి వెళ్లి, “నా కుమారుడా అబ్షాలోమా! నా కుమారుడా, నా కుమారుడా అబ్షాలోమా! నీకు బదులు నేను చనిపోతే ఎంత బాగుండేది. అబ్షాలోమా! నా కుమారుడా! నా కుమారుడా” అని అంటూ ఏడ్చాడు.

  12. అకస్మాత్తుగా అతడు తన తండ్రితో, “నా తల! నా తల!” అన్నాడు. అతని తండ్రి తన సేవకులలో ఒకనితో, “బాలున్ని అతని తల్లి దగ్గరకు తీసుకెళ్లు” అని చెప్పాడు.

  13. సేవకుడు బాలున్ని ఎత్తుకుని అతని తల్లి దగ్గరకు తీసుకెళ్లాడు, బాలుడు ఆమె ఒడిలో మధ్యాహ్నం వరకు కూర్చుని ఆ తర్వాత చనిపోయాడు.

  14. “సొలొమోనూ, నా కుమారుడా! నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశోధిస్తారు, ఆలోచనల ఉద్దేశాలన్నిటిని గ్రహిస్తారు కాబట్టి నీవు ఆయనను తెలుసుకుని పూర్ణహృదయంతో చిత్తశుద్ధితో ఆయనను సేవించు. నీవు ఆయనను వెదికితే, ఆయన నీకు దొరుకుతారు; అయితే నీవు ఆయనను విడిచిపెడితే, ఆయన నిన్ను శాశ్వతంగా తిరస్కరిస్తారు.

  15. నా కుమారుడైన సొలొమోను మీ ఆజ్ఞలను, శాసనాలను, నియమాలను పాటిస్తూ, నేను ఆలయ నిర్మాణం కోసం సమకూర్చిన వాటితో అతడు కట్టించడానికి అతడు పూర్ణహృదయంతో భక్తి కలిగి ఉండునట్లు చేయండి.”

  16. అతని తల్లి అతనికి దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పించింది కాబట్టి అతడు కూడా అహాబు ఇంటివారి మార్గాలను అనుసరించాడు.

  17. అతడు తన పిల్లలను బెన్ హిన్నోము లోయలో అగ్నిలో బలి ఇచ్చాడు, భవిష్యవాణిని, చేతబడిని ఆచరించాడు, శకునాలను కోరాడు, మృతులతో మాట్లాడేవారిని ఆత్మలతో మాట్లాడేవారిని సంప్రదించాడు. అతడు యెహోవా దృష్టిలో చాలా చెడుగా ప్రవర్తిస్తూ, ఆయనకు కోపం రేపాడు.

  18. విందులు ముగిసిన వెంటనే యోబు, “నా పిల్లలు పాపం చేసి తమ హృదయాల్లో దేవుని శపించారేమో” అని అనుకుని వారందరిని పిలిపించి పవిత్రపరచడానికి ఏర్పాట్లు చేసేవాడు. తెల్లవారుజామునే తన పిల్లల్లో ఒక్కొక్కరి కోసం దహనబలి అర్పించేవాడు. యోబు నిత్యం అలా చేస్తూ ఉండేవాడు.

  19. దేశమంతటిలో యోబు కుమార్తెలంత అందమైనవారు ఎవరూ లేరు. వారి తండ్రి వారి అన్నదమ్ములతో పాటు వారికి కూడా వారసత్వాన్ని పంచి ఇచ్చాడు.

  20. వారి వారసులకు తెలియకుండా వాటిని దాచిపెట్టము; యెహోవా చేసిన స్త్రోత్రార్హమైన కార్యాలను, ఆయన శక్తిని, ఆయన చేసిన అద్భుతాలను గురించి తర్వాతి తరానికి మేము చెప్తాం.

  21. ఆయన యాకోబుకు చట్టాలు విధించారు ఇశ్రాయేలులో నిబంధనలను స్థాపించారు, వారి పిల్లలకు దానిని బోధించుమని మన పూర్వికులకు ఆజ్ఞాపించారు.

  22. తద్వార తర్వాతి తరం వాటిని తెలుసుకుంటారు, ఇంకా పుట్టబోయే పిల్లలు కూడా తెలుసుకుంటారు, వారు వారి పిల్లలకు బోధిస్తారు.

  23. తండ్రి తన పిల్లల మీద కనికరం కలిగి ఉన్నట్లు, తనకు భయపడేవారి పట్ల యెహోవా కనికరం కలిగి ఉన్నారు;

  24. ఆయనకు భయపడేవారి పట్ల యెహోవా మారని ప్రేమ వారి పిల్లల పట్ల ఆయన నీతి నిత్యం నిలిచి ఉంటుంది,

  25. వారి పిల్లలు భూమిపై బలవంతులుగా ఉంటారు; యథార్థవంతుల తరం దీవించబడుతుంది.