Parents గురించి బైబిల్ వచనాలు: Curses entailed
Curses entailed గురించి వచనాలు
మీరు వాటికి నమస్కరించకూడదు పూజింపకూడదు; ఎందుకంటే నేను, మీ దేవుడనైన యెహోవాను, రోషం గల దేవుడను, నన్ను ద్వేషించినవారి విషయంలో మూడు నాలుగు తరాల వరకు తండ్రుల పాపం యొక్క శిక్షను వారి పిల్లల మీదికి రప్పిస్తాను.
స్వయంగా నేనే వారికి వారి కుటుంబానికి వ్యతిరేకంగా మారి వారిని వారితో పాటు కలిసి మోలెకుతో వ్యభిచరించే వారినందరిని ప్రజల్లో నుండి తొలగిస్తాను.
నీవు నీ దేశాన్ని పాడుచేసి నీ ప్రజలను చంపేశావు కాబట్టి నీవు సమాధిలో వారితో పాటు కలిసి ఉండవు. దుర్మార్గుని సంతానం ఎప్పుడూ జ్ఞాపకానికి రాదు.
దానికి బదులు, వారు తమ హృదయాల మొండితనాన్ని అనుసరించారు; వారి పూర్వికులు వారికి బోధించినట్లుగా వారు బయలును అనుసరించారు.”
మా పూర్వికులు పాపం చేశారు, వారు చనిపోయారు, వారి శిక్షను మేము భరిస్తున్నాము.
“ ‘సామెతలు చెప్పే ప్రతి ఒక్కరూ నీ గురించి ఈ సామెత చెప్తారు: “తల్లి ఎలాంటిదో కూతురు అలాంటిదే” అని.
నీవు భర్తను పిల్లలను విడిచిపెట్టిన నీ తల్లికి తగిన కుమార్తెవు; అలాగే నీవు తన భర్తను పిల్లలను విడిచిపెట్టిన నీ అక్కకు తగ్గ చెల్లెలివి. నీ తల్లి హిత్తీయురాలు నీ తండ్రి అమోరీయుడు.