Parents గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
అయితే నీతో నా నిబంధనను స్థిరపరుస్తాను, ఓడలో నీతో పాటు నీ కుమారులు, నీ భార్య, నీ కోడళ్ళు ప్రవేశించాలి.
నోవహుకు మత్తు వదిలిన తర్వాత చిన్నకుమారుడు తనకు చేసింది తెలుసుకుని,
ఇలా అన్నాడు, “కనాను శపించబడాలి! అతడు తన సహోదరులకు దాసులలో అత్యల్పునిగా ఉంటాడు.”
అబ్రాహాము దేవునితో, “మీ ఆశీర్వాదం క్రింద ఇష్మాయేలు జీవిస్తే చాలు!” అని అన్నాడు.
ఎందుకంటే నేను అతన్ని ఎంచుకున్నాను, అతడు తన పిల్లలను తన తర్వాత తన ఇంటివారిని యెహోవా మార్గంలో నీతి న్యాయాలు జరిగిస్తూ జీవించేలా నడిపిస్తాడు, తద్వారా యెహోవా అబ్రాహాముకు చేసిన వాగ్దానాన్ని జరిగిస్తారు.”
అబ్రాహాము చాలా వృద్ధుడయ్యాడు, యెహోవా అతన్ని అన్ని విధాలుగా ఆశీర్వదించారు.
అబ్రాహాము తన ఇంట్లో గృహనిర్వాహకుడైన ముఖ్య సేవకునితో, “నీ చేయి నా తొడ క్రింద పెట్టు.
నేను ఎవరి మధ్య నివసిస్తున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో నుండి నా కుమారునికి భార్యను తీసుకురావని, నా దేశం, నా బంధువుల దగ్గరకు వెళ్లి వారిలో నుండి నా కుమారుడైన ఇస్సాకుకు భార్యను తీసుకువస్తావని భూమ్యాకాశాలకు దేవుడైన యెహోవా పేరిట ప్రమాణం చేయి” అని అన్నాడు.
But thou shalt go unto my country, and to my kindred, and take a wife unto my son Isaac.
ఇస్సాకు యాకోబును పిలిపించి అతన్ని ఆశీర్వదించాడు. అప్పుడు తనకు ఇలా ఆజ్ఞాపించాడు: “కనాను స్త్రీని పెళ్ళి చేసుకోవద్దు.
వెంటనే పద్దనరాములో నీ తల్లికి తండ్రియైన బెతూయేలు ఇంటికి వెళ్లు. అక్కడ నీ తల్లి సోదరుడైన లాబాను కుమార్తెలలో ఒకరిని భార్యగా చేసుకో.
ఏశావు కళ్ళెత్తి స్త్రీలను, పిల్లలను చూశాడు. “నీతో ఉన్న వీరెవరు?” అని అడిగాడు. యాకోబు, “వీరు నీ సేవకునికి దేవుడు దయతో ఇచ్చిన పిల్లలు” అని జవాబిచ్చాడు.
దానికి మేము, ‘నా ప్రభువా, మాకు వృద్ధుడైన తండ్రి, వృద్ధాప్యంలో తనకు పుట్టిన చిన్నకుమారుడు ఉన్నాడు. అతని అన్న చనిపోయాడు, అతని తల్లి కుమారులలో ఆ ఒక్కడే మిగిలాడు, అతని తండ్రికి ఆ చిన్నవాడంటే చాలా ప్రేమ’ అని చెప్పాము.
“కాబట్టి ఇప్పుడు మా తమ్ముడు మాతో లేకుండ, మీ దాసుడైన మా తండ్రి దగ్గరకు మేము తిరిగి వెళ్తే, ఈ చిన్నవానితో ముడిపడి ఉన్న మా తండ్రి,
యోసేపు వారిద్దరిని తీసుకుని, ఎఫ్రాయిమును తన కుడివైపు ఇశ్రాయేలుకు ఎడమవైపు మనష్షేను తన ఎడమవైపు ఇశ్రాయేలుకు కుడివైపు ఉంచి అతని దగ్గరకు తీసుకువచ్చాడు.
అయితే ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా త్రిప్పి చిన్నవాడైన ఎఫ్రాయిం తలపై తన కుడిచేతిని మొదటి కుమారుడైన మనష్షే తలపై తన ఎడమ చేతిని పెట్టాడు.
అప్పుడు అతడు యోసేపును దీవిస్తూ అన్నాడు, “నా పితరులైన అబ్రాహాము ఇస్సాకులు ఎవరి ఎదుట నమ్మకంగా నడిచారో ఆ దేవుడు, నేటి వరకు నా జీవితమంతా నాకు కాపరిగా ఉన్న దేవుడు,
నన్ను ప్రతి హాని నుండి విడిపించిన దూత ఈ బాలురను దీవించును గాక. వారు నా నామాన నా పితరులైన అబ్రాహాము ఇస్సాకుల నామాన పిలువబడుదురు గాక, భూమిపై వారు గొప్పగా విస్తరించుదురు గాక.”
తన తండ్రి ఎఫ్రాయిం తలపై కుడిచేయి పెట్టడం చూసి యోసేపు అసంతృప్తి చెందాడు; ఎఫ్రాయిం తలపై నుండి మనష్షే తలపైకి చేయి మార్చడానికి తన తండ్రి చేతిని పట్టుకున్నాడు.
యోసేపు అతనితో, “లేదు, నా తండ్రి, ఇతడు మొదటి కుమారుడు; ఇతని తలపై నీ కుడిచేయిని పెట్టు” అన్నాడు.
కాని అతని తండ్రి ఒప్పుకోకుండా, “నాకు తెలుసు, నా కుమారుడా, నాకు తెలుసు, అతడు కూడా జనాల సమూహమై గొప్పవాడవుతాడు. అయినా, అతని తమ్ముడు అతనికంటే గొప్పవాడవుతాడు, అతని వారసులు జనాల సమూహం అవుతారు” అని చెప్పాడు.
అతడు వారిని ఆ రోజు దీవిస్తూ అన్నాడు, “నీ నామంలో ఇశ్రాయేలు ఈ ఆశీర్వాదం ప్రకటిస్తున్నాడు: ‘దేవుడు మిమ్మల్ని ఎఫ్రాయిములా మనష్షేలా చేయును గాక.’ ” కాబట్టి ఎఫ్రాయిమును మనష్షేకు ముందుగా పెట్టాడు.
“రూబేనూ, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తి నా బలం యొక్క మొదటి గుర్తు, ఘనతలోను శక్తిలోను ఆధిక్యత గలవాడవు
కానీ నీళ్లలా అస్థిరంగా ఉండే నీవు ఇకపై రాణించవు, ఎందుకంటే నీవు నీ తండ్రి మంచం ఎక్కావు, నా పడకను అపవిత్రం చేశావు.
“షిమ్యోను లేవీ సోదరులు వారి ఖడ్గాలు హింసాయుధాలు.