కంటెంట్‌కు వెళ్లండి

Meat Offerings గురించి బైబిల్ వచనాలు

49 వచనాలు · 28 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యాజకుడు అర్పించే ప్రతి భోజనార్పణను పూర్తిగా దహించబడాలి; దానిని తినకూడదు.”

  2. “అహరోను కుమారుడును యాజకుడునైన ఎలియాజరు, దీపానికి నూనె, పరిమళ వాసనగల ధూపద్రవ్యం, నిత్యం అర్పించే భోజనార్పణ, అభిషేక తైలం మొదలగువాటిని పర్యవేక్షిస్తాడు. అతడు సమావేశ గుడారమంతటిని, అందులో ఉన్న సామాగ్రిని, పరిశుద్ధ ఉపకరణాలతో పాటు ప్రతిదీ పర్యవేక్షిస్తాడు.”

  3. అతడు తన భార్యను యాజకుని దగ్గరకు తీసుకెళ్లాలి. అతడు ఆమె పక్షంగా ఒక ఓమెరు యవల పిండి తీసుకురావాలి. దాని మీద ఒలీవనూనె పోయకూడదు ధూపం వేయకూడదు ఎందుకంటే అది అసూయ కోసం అర్పించే భోజనార్పణ, చేసిన తప్పును జ్ఞాపకం చేసే జ్ఞాపక అర్పణ.

  4. అతని అర్పణ: పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నూట ముప్పై షెకెళ్ళ బరువు ఉన్న వెండి చిలకరింపు పాత్ర, డెబ్బై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పాత్ర, భోజనార్పణ కోసం ఈ రెండింటి నిండా ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండి;

  5. అతని అర్పణ: పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నూట ముప్పై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పళ్ళెం, డెబ్బై షెకెళ్ళ బరువు ఉన్న వెండి చిలకరింపు పాత్ర, భోజనార్పణ కోసం ఈ రెండింటి నిండా ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండి;

  6. అతని అర్పణ: పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నూట ముప్పై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పళ్ళెం, డెబ్బై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పాత్ర, భోజనార్పణ కోసం ఈ రెండింటి నిండా ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండి;

  7. యెహోవాకు ఇష్టమైన సువాసన కలుగునట్లు మీ మందల నుండి లేదా పశువుల నుండి అర్పణలు అంటే దహనబలులు గాని బలులు గాని, ప్రత్యేకమైన మ్రొక్కుబడులు గాని స్వేచ్ఛార్పణలు గాని, లేదా పండుగ అర్పణలు గాని అర్పించవచ్చు.

  8. అప్పుడు అర్పణ తెచ్చే వ్యక్తి ఒక పావు హిన్ నూనెలో ఒక ఓమెరు నాణ్యమైన పిండి కలిపి యెహోవాకు భోజనార్పణ సమర్పించాలి.

  9. దహనబలి లేదా బలి కోసం తెచ్చే ప్రతి గొర్రెపిల్లతో పాటు ఒక పావు హిన్ ద్రాక్షరసం పానార్పణంగా తేవాలి.

  10. “ ‘భోజనార్పణ కోసం పొట్టేళ్ళతో పాటు రెండు ఓమెర్ల నాణ్యమైన పిండి ఒక హిన్‌లో మూడవ వంతు నూనెతో కలిపి తేవాలి,

  11. దానితో పాటు ఒక హిన్‌లో మూడవ వంతు ద్రాక్షరసం పానార్పణం కోసం తేవాలి. యెహోవాకు ఇష్టమైన సువాసన గలదిగా అర్పించాలి.

  12. “ ‘యెహోవాకు ప్రత్యేకమైన మ్రొక్కుబడి లేదా సమాధానబలి కోసం దహనబలిగా లేదా బలిగా అర్పించడానికి కోడెను సిద్ధపరిచేటప్పుడు,

  13. కోడెతో పాటు అయితే భోజనార్పణగా మూడు ఓమెర్ల నూనె కలిపిన అర హిన్ లో నాణ్యమైన పిండి,

  14. దానితో పాటు అర హిన్ ద్రాక్షరసం పానార్పణం కోసం తేవాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసన గలదిగా ఉంటుంది.

  15. ప్రతి కోడె లేదా పొట్టేలు, ప్రతి గొర్రెపిల్ల లేదా మగ మేకపిల్ల ఈ విధంగా సిద్ధపరచబడాలి.

  16. ఇలా ప్రతి దానిలోకి, మీరు ఎన్ని సిద్ధం చేస్తారో, అన్నిటికి చేయాలి.

  17. ఇశ్రాయేలీయులు, లేవీయులతో సహా ధాన్యాన్ని, క్రొత్త ద్రాక్షరసాన్ని, నూనెను విరాళంగా తీసుకువచ్చినప్పుడు పరిచర్య చేసే యాజకులు, ద్వారపాలకులు సంగీతకారులు వాటిని తీసుకుని పరిశుద్ధాలయపు ఉపకరణాలు ఉండే గిడ్డంగులలో ఉంచాలి. “మేము మా దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకూడదని నిర్ణయించుకున్నాము.”

  18. అంతేకాదు, అతడు గతంలో భోజనార్పణలు, ధూపద్రవ్యాలు, ఆలయ వస్తువులను, లేవీయులు, సంగీతకారులు ద్వారపాలకుల కోసం కేటాయించిన ధాన్యంలో, క్రొత్త ద్రాక్షరసంలో, ఒలీవ నూనెలో పదవ వంతును, అలాగే యాజకులకు ఇవ్వవలసిన విరాళాలను నిల్వ ఉంచే స్థలం దగ్గర ఒక పెద్ద గదిని టోబీయాకు ఏర్పాటు చేశాడు.

  19. కనుమలలోని నున్నని రాళ్ల మధ్యలో ఉన్న విగ్రహాలు మీ భాగము; నిజంగా అవే మీకు భాగము. అవును వాటికి మీ పానార్పణలు పోశారు, భోజనార్పణలు చెల్లించారు. ఇదంతా చూసి నేను క్షమించాలా?

  20. అప్పుడతడు నాతో ఇలా అన్నాడు, “ఆలయ ఆవరణానికి ఎదురుగా ఉత్తర గదులు, దక్షిణ గదులు యాజకులకు చెందినవి; అక్కడ యెహోవా సన్నిధికి వచ్చే యాజకులు అతి పరిశుద్ధ అర్పణలను తింటారు. అక్కడే వారు అతి పరిశుద్ధ అర్పణలను అనగా భోజనార్పణలు, పాపపరిహార బలులు, అపరాధబలులను ఉంచుతారు. ఆ స్థలం అతిపరిశుద్ధమైనది.

  21. దేశంలోని ప్రజలందరూ ఇశ్రాయేలులోని యువరాజుకు ఈ ప్రత్యేక కానుక ఇవ్వాలి.

  22. భోజనార్పణలు పానార్పణలు యెహోవా మందిరంలోకి రాకుండ నిలిచిపోయాయి. యెహోవ ఎదుట సేవచేసే యాజకులు శోకంలో ఉన్నారు.

  23. యాజకులారా, మీరు గోనెపట్ట కట్టుకుని ఏడవండి; బలిపీఠం దగ్గర సేవ చేసేవారలారా, మీరు రోదించండి. నా దేవుని ఎదుట సేవ చేసేవారలారా, రండి, రాత్రంత గోనెపట్ట కట్టుకుని గడపండి; ఎందుకంటే దేవుని మందిరంలోకి భోజనార్పణలు పానార్పణలు రాకుండ నిలిచిపోయాయి.

  24. మీరు నాకు దహనబలులు, భోజనార్పణలు సమర్పించినా, నేను వాటిని స్వీకరించను. మీరు క్రొవ్విన జంతువులను సమాధానబలులుగా సమర్పించినా, నేను వాటిని లెక్కచేయను.