Skip to content

Meat Offerings గురించి బైబిల్ వచనాలు

49 వచనాలు · 28 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. దంచి తీసిన ఒక పావు హిన్ ఒలీవనూనెతో కలిపిన ఒక ఓమెరు నాణ్యమైన పిండిని, ఒక పావు హిన్ ద్రాక్షారసాన్ని పానార్పణగా మొదటి గొర్రెపిల్లతో పాటు అర్పించాలి.

  2. సాయంకాలం మరొక గొర్రెపిల్లతో కలిపి ఉదయకాలం అర్పించినట్లే భోజనార్పణ, పానార్పణ అర్పించాలి. ఇది యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి.

  3. “యెహోవా ఎదుట సమావేశ గుడారపు ద్వారం దగ్గర రాబోయే తరాలన్ని క్రమంగా నిత్యం ఈ దహనబలిని అర్పించాలి. అక్కడే నేను మిమ్మల్ని కలుసుకొని మీతో మాట్లాడతాను.

  4. నీవు దాని మీద ఇతర ధూపాలను గాని దహనబలిని గాని భోజనార్పణ గాని అర్పించకూడదు, దాని మీద పానార్పణ పోయకూడదు.

  5. సమావేశ గుడారపు ద్వారానికి సమీపంగా దహనబలిపీఠాన్ని ఉంచి దాని మీద దహనబలి అర్పించి భోజనార్పణను సమర్పించాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం మోషే ఇది చేశాడు.

  6. “ ‘ఎవరైనా యెహోవాకు భోజనార్పణ తెచ్చినప్పుడు, అది నాణ్యమైన పిండితో చేసినదై ఉండాలి. వారు దాని మీద ఒలీవనూనె పోసి, దానిపై ధూపం వేసి,

  7. దానిని యాజకులైన అహరోను కుమారుల దగ్గరకు తీసుకురావాలి. యాజకుడు ఒక పిడికెడు పిండి, నూనె, ధూపమంతటితో పాటు తీసుకుని బలిపీఠం మీద దానిని ఒక జ్ఞాపకార్థ భాగంగా, యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలిగా దహించాలి.

  8. భోజనార్పణలో మిగిలింది అహరోనుకు అతని కుమారులకు చెందుతుంది; యెహోవాకు అర్పించే హోమబలులలో ఇది అతిపరిశుద్ధమైనది.

  9. “ ‘ఒకవేళ మీరు పొయ్యిలో కాల్చిన భోజనార్పణ తెస్తే, అది నాణ్యమైన పిండితో చేసినదై ఉండాలి: నూనె కలిపి చేసిన పులియని మందమైన రొట్టెలు లేదా నూనె రాసి చేసిన పులియని రొట్టెలు.

  10. ఒకవేళ మీ భోజనార్పణ పెనం మీద కాల్చినదైతే, అది నాణ్యమైన పిండిలో నూనె కలిపి, పులుపు లేకుండ చేయబడాలి.

  11. ఒకవేళ మీ భోజనార్పణ వంటపాత్రలో వండినదైతే, దానిని నాణ్యమైన పిండిలో కొంచెం నూనె కలిపి చేయాలి.

  12. యాజకుడు ఆ భోజనార్పణలో నుండి జ్ఞాపకార్థ భాగాన్ని తీసి బలిపీఠం మీద దానిని యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలిగా కాల్చుతాడు.

  13. “ ‘యెహోవాకు అర్పించే ప్రతి భోజనార్పణ పులిసిన పదార్థం లేకుండా ఉండాలి, ఎందుకంటే యెహోవాకు అర్పించే హోమబలిలో మీరు పులిసిన దానిని లేదా తేనెను దహించకూడదు.

  14. మీ భోజనార్పణలను అన్నిటికి ఉప్పు కలపండి. మీ దేవుని నిబంధన ఉప్పు లేకుండా మీ భోజనార్పణలు ఉండకూడదు; మీ అర్పణలన్నిటికీ ఉప్పు కలపండి.

  15. “ ‘మీరు ప్రథమ ఫలాల భోజనార్పణ యెహోవా దగ్గరకు తీసుకువస్తే, క్రొత్త ధాన్యాన్ని దంచి అగ్నిలో వేయించి అర్పించాలి.

  16. దాని మీద నూనె పోయాలి, ధూపం వేయాలి; అది భోజనార్పణ.

  17. యాజకుడు జ్ఞాపకార్థ భాగమైన నలుగగొట్టిన ధాన్యాన్ని, నూనెను, ధూపంతో కలిపి యెహోవాకు హోమబలిగా దహించాలి.

  18. “ ‘అయితే, ఒకవేళ వారు రెండు పావురాలు లేదా రెండు గువ్వలను కొనలేకపోతే, వారు తమ పాపానికి బలిగా పాపపరిహారబలి కోసం ఒక ఓమెరు నాణ్యమైన పిండి తీసుకురావాలి. వారు దానిపై ఒలీవనూనె గాని ధూపం గాని పెట్టకూడదు, ఎందుకంటే అది పాపపరిహారబలి.

  19. యాజకుడు భోజనార్పణలో నుండి పిడికెడు నాణ్యమైన పిండిని కొంచెం ఒలీవ నూనెను సాంబ్రాణి మొత్తాన్ని తీసుకుని వాటిని జ్ఞాపక భాగంగా బలిపీఠం మీద యెహోవాకు ఇష్టమైన సువాసనగా దహించాలి.

  20. అందులో మిగిలింది అహరోను అతని కుమారులు తినాలి, అయితే పరిశుద్ధాలయ ప్రాంతంలో పులియకుండా దానిని తినాలి; సమావేశ గుడారం యొక్క ఆవరణంలో వారు దానిని తినాలి.

  21. దానిని పులిసిన దానితో కలిపి కాల్చకూడదు; నాకు సమర్పించిన హోమబలులలో నేను దానిని వారి వాటాగా ఇచ్చాను. పాపపరిహారబలిలా అపరాధపరిహారబలిలా, ఇది అతిపరిశుద్ధము.

  22. అహరోను వంశస్థుడు ఎవరైనా దానిని తినవచ్చు. అన్ని తరాలకు ఇది యెహోవాకు సమర్పించబడే హోమబలులలో అతని శాశ్వత వాటా. వాటిని ఏది తాకినా అది పవిత్రమవుతుంది.’ ”

  23. “అహరోను అభిషేకించబడిన రోజున అతడు, అతని కుమారులు యెహోవా దగ్గరకు తీసుకురావలసిన అర్పణ ఇది: భోజనార్పణగా ఒక ఓమెరు నాణ్యమైన పిండి ఉదయం సగం, సాయంత్రం సగం అర్పించాలి.

  24. దానిని పెనం మీద నూనెతో కాల్చాలి; బాగా కాల్చి ముక్కలుగా చేసిన భోజనార్పణను యెహోవాకు ఇష్టమైన సువాసనగా సమర్పించాలి.

  25. ప్రధాన యాజకునిగా అతని తర్వాత వచ్చే కుమారుడు దానిని సిద్ధం చేయాలి. ఇది యెహోవాకు శాశ్వత వాటా, ఇది పూర్తిగా దహించబడాలి.