Skip to content

Jebusites గురించి బైబిల్ వచనాలు

41 వచనాలు · 7 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నా దూత మీకు ముందుగా వెళ్తూ, అమోరీయుల హిత్తీయుల పెరిజ్జీయుల కనానీయుల హివ్వీయుల యెబూసీయుల దేశానికి మిమ్మల్ని తీసుకువస్తాడు, నేను వారిని నిర్మూలం చేస్తాను.

  2. మీరు వారి దేవుళ్ళ ముందు సాష్టాంగపడకూడదు వాటిని పూజించకూడదు, వారి ఆచారాలను పాటించకూడదు. మీరు వాటిని కూల్చివేసి వారి పవిత్ర రాళ్లను ముక్కలు చేయాలి.

  3. అందుకు యెహోవా: “నీతో నేను ఒక ఒడంబడిక చేస్తున్నాను. ఈ భూమి మీద ఏ దేశంలో ఎప్పుడూ జరుగని అద్భుతాలు నేను నీ ప్రజలందరి ఎదుట చేస్తాను. నీవు ఏ ప్రజలమధ్య నివసిస్తున్నావో వారందరు యెహోవానైన నేను మీ కోసం చేసే భయంకరమైన కార్యాన్ని చూస్తారు.

  4. నేడు నేను మీకు ఆజ్ఞాపించే దానికి లోబడాలి. నేను అమోరీయులు, కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను నీ ఎదుట నుండి వెళ్లగొడతాను.

  5. కాబట్టి ఇశ్రాయేలీయులు కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, ఎబూసీయుల మధ్యలో నివసించారు.

  6. వారు వారి కుమార్తెలను పెళ్ళి కోసం తీసుకుని తమ కుమార్తెలను వారి కుమారులకు ఇచ్చారు, వారి దేవుళ్ళను సేవించారు.

  7. యెబూసీయుల మీద దాడి చేయడానికి రాజు, అతని మనుష్యులు యెరూషలేముకు వెళ్లారు. దావీదు లోపలికి రాలేడని భావించిన యెబూసీయులు దావీదుతో, “నీవు లోపలికి రాలేవు; ఇక్కడున్న గ్రుడ్డివారు కుంటివారు నిన్ను తరిమివేస్తారు” అన్నారు.

  8. అయినా దావీదు సీయోను కోటను స్వాధీనం చేసుకున్నాడు. దానిని దావీదు పట్టణం అంటారు.

  9. ఆ రోజే దావీదు, “యెబూసీయుల మీద దాడి చేయాలనుకునేవారు నీటి సొరంగం గుండా వెళ్లి దావీదు శత్రువులైన గ్రుడ్డివారిని కుంటివారిని చంపాలి” అన్నాడు. ఆ కారణంగానే, “గ్రుడ్డివారు కుంటివారు రాజభవనం లోపలికి రాలేరు” అనే సామెత పుట్టింది.

  10. దావీదు కోటలో నివాసం ఏర్పరచుకున్నాడు, దానికి దావీదు పట్టణం అని పేరు పెట్టాడు. అతడు మిద్దె నుండి ఆ స్థలం లోపల కోట కట్టించాడు.

  11. అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు (ఈ ప్రజలు ఇశ్రాయేలీయులు కాదు) ఇంకా అక్కడ మిగిలి ఉన్నారు.

  12. ఇశ్రాయేలీయులు నాశనం చేయకుండ వదిలిన ఈ ప్రజలందరి వారసులను సొలొమోను బానిసలుగా పని చేయడానికి నిర్బంధించాడు. నేటికీ వారు అలాగే ఉన్నారు.

  13. ఈ విషయాలన్ని జరిగిన తర్వాత నాయకులు నా దగ్గరకు వచ్చి, “ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, అందరు తమ పొరుగువారైన కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఈజిప్టువారు, అమోరీయుల నుండి వేరుగా ఉండకుండా వారితో కలిసిపోయి, వారు చేసే అసహ్యకరమైన ఆచారాలను పాటించారు.

  14. వారి కుమార్తెలను తమకు, తమ కుమారులకు భార్యలుగా చేసుకుంటూ, పరిశుద్ధజాతిగా ఉండకుండా తమ చుట్టూ ఉన్నవారితో కలిసిపోయారు. నాయకులు అధికారులు ఈ విషయంలో అపనమ్మకంగా ఉన్నారు” అని చెప్పారు.

  15. యాజకుల వారసులలో పరాయి దేశపు స్త్రీలను పెళ్ళి చేసుకున్న వారు వీరు: యోజాదాకు కుమారుడైన యెషూవ వారసులు, అతని సహోదరుల నుండి: మయశేయా, ఎలీయెజెరు, యారీబు, గెదల్యా.

  16. (వీరంతా తమ భార్యలను పంపివేస్తామని మాట ఇచ్చారు. తమ దోషాన్ని బట్టి అపరాధపరిహారబలిగా ఒక్కొక్కరు మందలో ఒక్కొక్క పొట్టేలు అర్పించారు.)

  17. ఇమ్మేరు వారసుల నుండి: హనానీ, జెబద్యా.

  18. హారీము వారసుల నుండి: మయశేయా, ఏలీయా, షెమయా, యెహీయేలు, ఉజ్జియా.

  19. పషూరు వారసుల నుండి: ఎల్యోయేనై, మయశేయా, ఇష్మాయేలు, నెతనేలు, యోజాబాదు, ఎల్యాశా.

  20. లేవీయుల నుండి: యోజాబాదు, షిమీ, కెలిథా అనే కెలాయా, పెతహయా, యూదా, ఎలీయెజెరు.

  21. సంగీతకారుల నుండి: ఎల్యాషీబు. ద్వారపాలకుల నుండి: షల్లూము, తెలెము, ఊరి.

  22. ఇతర ఇశ్రాయేలీయుల నుండి: పరోషు వారసుల నుండి: రమ్యా, ఇజ్జీయా, మల్కీయా, మీయామిను, ఎలియాజరు, మల్కీయా, బెనాయా.

  23. ఏలాము వారసుల నుండి: మత్తన్యా, జెకర్యా, యెహీయేలు, అబ్దీ, యెరేమోతు, ఏలీయా.

  24. జత్తూ వారసుల నుండి: ఎల్యోయేనై, ఎల్యాషీబు, మత్తన్యా, యెరేమోతు, జాబాదు, అజీజా.

  25. బేబై వారసుల నుండి: యెహోహనాను, హనన్యా, జబ్బయి, అత్లాయి.