Skip to content

Falsehood గురించి బైబిల్ వచనాలు

55 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. వంకర మాటలు మాట్లాడుతూ తిరిగేవాడు, పనికిరానివాడు దుష్టత్వం నిండిన మనుష్యుడు.

  2. వాడు ద్వేషపూరితంగా కన్నుగీటుతూ, తన పాదాలతో సైగలు చేస్తూ తన వ్రేళ్ళతో సంజ్ఞలు చేస్తాడు.

  3. యెహోవాకు హేయమైనవి ఆరు, ఆయనకు హేయమైనవి ఏడు కలవు.

  4. అవి ఏమనగా, అహంకారపు కళ్లు, అబద్ధమాడే నాలుక, నిర్దోషులను చంపే చేతులు.

  5. చెడ్డ పన్నాగాలు చేసే హృదయం, కీడు చేయడానికి త్వరపడే పాదాలు,

  6. అబద్ధాలు చెప్పే అబద్ధసాక్షి, సమాజంలో గొడవ రేపే వ్యక్తి.

  7. యథార్థంగా ప్రవర్తించేవారు క్షేమంగా జీవిస్తారు, కానీ మోసం చేసేవారు పట్టుబడతారు.

  8. కళ్లతో సైగ చేసేవారు దుఃఖాన్ని కలిగిస్తారు, వ్యర్థ కబుర్లు చెప్పే మూర్ఖులు నాశనమవుతారు.

  9. నిజాయితీగల పెదవులు శాశ్వతంగా ఉంటాయి, అబద్ధాలు మాట్లాడే నాలుక క్షణికమే ఉంటుంది.

  10. కీడును కలిగించువారి హృదయంలో మోసము కలదు సమాధానపరచడానికి ఆలోచన చెప్పువారు సంతోషముగా ఉందురు.

  11. తన పొరుగువానిని మోసం చేసి, మరణకరమైన “నేను సరదాగా చేశాను!” అని అనేవాడు మండుతున్న బాణాలు విసిరే ఉన్మాది లాంటివాడు.

  12. So is the man that deceiveth his neighbour, and saith, Am not I in sport?

  13. పగవారు పెదవులతో మాయ మాటలు చెప్పి హృదయాల్లో కపటాన్ని దాచుకుంటారు.

  14. వారి మాటలు ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ, వాటిని నమ్మవద్దు, వారి హృదయాలు ఏడు అసహ్యకరమైన వాటితో నిండి ఉంటాయి.

  15. వారి దుర్మార్గం మోసం ద్వారా దాచబడవచ్చు, కాని వారి దుష్టత్వం సమాజం ముందు బయటపడుతుంది.

  16. మీ చేతులు రక్తంతో మీ వ్రేళ్లు దోషంతో మలినమయ్యాయి. మీ పెదవులు అబద్ధాలు పలికాయి, మీ నాలుక చెడ్డ మాటలు మాట్లాడింది.

  17. న్యాయం గురించి ఎవరూ పట్టించుకోరు; ఎవరూ నిజాయితితో వాదించరు. వారు వట్టి వాదనలను నమ్ముకుని అబద్ధాలు చెప్తారు; వారు హింసను గర్భం దాల్చి చెడును కంటారు.

  18. మా అపరాధాలన్నీ మా ఎదుట ఉన్నాయి మా పాపాలు మామీద సాక్ష్యం ఇస్తున్నాయి. మా అపరాధాలన్నీ ఎల్లప్పుడు మాతో ఉన్నాయి, మా దోషాలు మాకు తెలుసు.

  19. తిరుగుబాటు చేసి యెహోవాకు ద్రోహం చేశాం, మా దేవునికి విరుద్ధంగా ఉంటూ, తిరుగుబాటును ప్రేరేపించడం బాధపెట్టడం, మా హృదయంలో ఆలోచించుకుని, అబద్ధాలు చెప్పడము.

  20. స్నేహితుడు స్నేహితుడిని మోసం చేస్తాడు, ఎవరూ సత్యం మాట్లాడరు. వారు అబద్ధాలు చెప్పడానికి తమ నాలుకలకు శిక్షణ ఇచ్చారు; వారు పాపం చేసి తమను తాము అలసటకు గురిచేసుకుంటారు.

  21. నీవు మోసం మధ్య జీవిస్తున్నావు; వారి మోసాన్ని బట్టి వారు నన్ను తెలుసుకోవడానికి నిరాకరిస్తున్నారు,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  22. ఇశ్రాయేలీయులారా, యెహోవా వాక్కు వినండి, యెహోవా ఈ దేశ వాసులైన మీమీద నేరం మోపుతున్నారు: “ఈ దేశంలో నమ్మకత్వం, ప్రేమ దేవుని గురించిన జ్ఞానం అనేవి లేవు.

  23. శపించడం, అబద్ధాలు చెప్పడం, హత్య చేయడం, దొంగిలించడం, వ్యభిచారం చేయడం మాత్రమే ఉన్నాయి; వారు దౌర్జన్యాలు మానలేదు, నిత్యం రక్తపాతం జరుగుతూ ఉంది.

  24. “అందుకు వారు, ‘ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలితో ఉండడం లేదా దాహంతో ఉండడం లేదా పరదేశిగా ఉండడం లేదా బట్టలు లేనివానిగా ఉండడం లేదా రోగిగా లేదా చెరసాలలో ఉండడం చూసి సహాయం చేయలేదు?’ అడుగుతారు.

  25. “అందుకు రాజు, ‘ఈ నా సహోదర సహోదరీలలో బహు అల్పులైనవారికి చేయలేదు కాబట్టి నాకు చేయనట్లే అని ఖచ్చితంగా మీతో చెప్తున్నాను’ అని వారితో అంటాడు.