Skip to content

Falsehood గురించి బైబిల్ వచనాలు

55 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “అప్పుడు వారు నిత్య శిక్షలోనికి ప్రవేశిస్తారు, కాని నీతిమంతులు నిత్య జీవంలోనికి ప్రవేశిస్తారు.”

  2. మీరు మీ తండ్రియైన అపవాదికి చెందినవారు, కాబట్టి మీరు మీ తండ్రి కోరికలను నెరవేర్చాలని కోరుతున్నారు. మొదటి నుండి వాడు హంతకుడే, వానిలో సత్యం లేదు, కాబట్టి వాడు సత్యాన్ని పట్టుకుని ఉండడు. వాడు అబద్ధం చెప్పినప్పుడు వాడు తన స్వభావాన్ని బట్టి మాట్లాడతాడు. ఎందుకంటే వాడు అబద్ధికుడు అబద్ధాలకు తండ్రి.

  3. అయినాసరే నేను మీకు నిజం చెప్తున్నా మీరు నన్ను నమ్మరు!

  4. అంతేకాక ధర్మశాస్త్రం నీతిమంతుల కోసం కాదు గాని, చట్టానికి విరుద్ధంగా ఉన్నవారికి, తిరుగుబాటు చేసేవారికి, భక్తిహీనులకు, పాపులకు, అపవిత్రులకు, నాస్తికులకు, తమ తల్లిదండ్రులను చంపేవారి కోసం, హంతకుల కోసం

  5. లైంగిక అనైతికత కలిగినవారి కోసం, స్వలింగసంపర్కులకు, బానిస వ్యాపారం చేసేవారికి, అబద్ధాలు చెప్పేవారికి, దొంగ సాక్ష్యం చెప్పేవారికి, స్వచ్ఛమైన బోధకు వ్యతిరేకంగా ఉన్న వారి కోసం నియమించబడిందని మనకు తెలుసు.