Skip to content

Covenants గురించి బైబిల్ వచనాలు

42 వచనాలు · 31 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. గిబియోనీయులతో సమాధాన ఒడంబడిక చేసుకున్న మూడు రోజుల తర్వాత, వారు తమ పొరుగువారని, తమ దగ్గర నివసిస్తున్నారని ఇశ్రాయేలీయులు విన్నారు.

  2. కాబట్టి ఇశ్రాయేలీయులు బయలుదేరి మూడవ రోజున వారి పట్టణాలైన గిబియోను, కెఫీరా, బెయేరోతు, కిర్యత్-యారీము చేరుకున్నారు.

  3. అయితే ఇశ్రాయేలీయులు వారిపై దాడి చేయలేదు, ఎందుకంటే సమాజ నాయకులు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా పేరున వారితో ప్రమాణం చేశారు. సమాజమంతా నాయకుల మీద సణుగుకొన్నారు.

  4. అయితే సమాజ నాయకులంతా, “మనం ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరున వారికి ప్రమాణం చేశాం కాబట్టి ఇప్పుడు మనం వారిని తాకకూడదు.

  5. అప్పుడు బోయజు పెద్దలకు, ప్రజలందరికి ఇలా ప్రకటించాడు, “ఎలీమెలెకు, కిల్యోను, మహ్లోనులకు చెందిన ఆస్తినంతా నయోమి దగ్గర నుండి నేను కొనుక్కున్నాను. ఈ రోజు దీనికి మీరు సాక్షులు.

  6. అంతేకాక, చనిపోయిన మహ్లోను యొక్క విధవరాలు, మోయాబీయురాలైన రూతును నా భార్యగా స్వీకరిస్తున్నాను. ఈ విధంగా చనిపోయినవాడి స్వాస్థ్యం మీద అతని పేరు స్థిరంగా ఉంటుంది, అతని కుటుంబం నుండి, అతని స్వస్థలం నుండి కొట్టివేయబడదు. ఈ రోజు మీరు సాక్షులు!”

  7. అప్పుడు పెద్దలు, పట్టణ ద్వారం దగ్గర ఉన్న ప్రజలందరు, “మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వస్తున్న స్త్రీని, ఇశ్రాయేలీయుల వంశాన్ని కట్టిన రాహేలు, లేయాల వలె చేయును గాక. ఎఫ్రాతాలో నీవు ఘనత పొంది, బేత్లెహేములో ఖ్యాతి నొందుదువు గాక.

  8. “కాబట్టి నా కోసం లెబానోనులో దేవదారు చెట్లను నరకమని ఆదేశాలు ఇవ్వండి. నా పనివారు మీ పనివారితో కలసి పనిచేస్తారు, మీ పనివారికి మీరు ఎంత జీతం నిర్ణయిస్తే అంత మీకిస్తాను, ఎందుకంటే సీదోనీయుల్లా మ్రాను నరికే నిపుణులు మా దగ్గర లేరని మీకు తెలుసు.”

  9. హీరాము సొలొమోను చెప్పింది విన్నప్పుడు ఎంతో సంతోషించి, “ఈ గొప్ప దేశాన్ని ఏలడానికి ఈ రోజు దావీదుకు జ్ఞానంగల కుమారుని ఇచ్చిన యెహోవాకు స్తుతి కలుగును గాక” అన్నాడు.

  10. హీరాము సొలొమోనుకు ఇలా జవాబిచ్చాడు: “మీరు నాకు పంపిన సందేశం అంగీకరించాను, నేను మీరు కోరినట్టు దేవదారు, సరళవృక్షాల మ్రానులను ఇస్తాను.

  11. నా పనివారు వాటిని లెబానోను నుండి మధ్యధరా సముద్రతీరానికి తెస్తారు. అక్కడినుండి మీరు చెప్పే స్థలానికి తెప్పలుగా కట్టించి సముద్రం మీదుగా పంపుతాను. అక్కడ వాటిని మీకు అందించే ఏర్పాటు నేను చేస్తాను, మీరు వాటిని తీసుకోవచ్చు. నా కోరిక ప్రకారం మీరు జరిగించి నా రాజకుటుంబానికి ఆహారాన్ని అందించండి.”

  12. ఇలా హీరాము సొలొమోనుకు అతడు కోరిన దేవదారు, సరళవృక్షాల మ్రానులు అన్ని ఇచ్చాడు.

  13. సొలొమోను హీరాముకు అతని ఇంటివారికి ఆహారంగా 20,000 కోరుల గోధుమలను, 20,000 బాతుల స్వచ్ఛమైన ఒలీవ నూనెను ఇచ్చాడు. సొలొమోను హీరాముకు ఈ విధంగా ప్రతి సంవత్సరం ఇచ్చాడు.

  14. వారు నన్ను సంప్రదించకుండా ఈజిప్టుకు వెళ్తారు; వారు సహాయం కోసం ఫరో కాపుదల కోసం చూస్తారు, ఆశ్రయం కోసం ఈజిప్టు నీడ కోసం చూస్తారు.

  15. కాని ఫరో ఇచ్చే రక్షణ మీకు సిగ్గు కలిగిస్తుంది, ఈజిప్టు నీడ మీకు అవమానంగా ఉంటుంది.

  16. వారి అధిపతులు సోయనులో ఉన్నా, వారి రాయబారులు హనేసు చేరుకున్నా

  17. వారికి సహాయకరంగా ఉపయోగకరంగా ఉండకుండా అవమానాన్ని సిగ్గును కలిగించే ప్రజల కారణంగా వారందరు సిగ్గుపరచబడతారు.”