Skip to content

Company గురించి బైబిల్ వచనాలు

66 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అంతేకాక నేను, ‘వారిని మీ ఎదుట నుండి తరమను; వారు మీకు ఉచ్చుగా ఉంటారు, వారి దేవుళ్ళు మీకు ఉరిగా మారుతారు’ అని చెప్పాను.”

  2. అయితే చేతులతో పోగుచేయలేని ముళ్ళలా, దుష్టులందరు పారవేయబడాలి.

  3. ముళ్ళను పట్టుకునేవారు ఇనుప పనిముట్టునైనా లేదా బల్లెపు పిడినైనా ఉపయోగిస్తారు; అవి పడిన చోటనే కాల్చివేయబడతాయి.”

  4. నేను మోసగాళ్ళతో కూర్చోను, వేషధారులతో నేను సహవాసం చేయను.

  5. కీడుచేసేవారి గుంపు నాకు అసహ్యం దుష్టులతో నేను కూర్చోను.

  6. యెహోవా నాశనం చేస్తానన్న జాతులను వీరు విడిచిపెట్టారు.

  7. ఇతర జనాంగాలలో కలిసిపోయి, వారి జీవిత విధానాలు నేర్చుకున్నారు.

  8. నేను మెషెకులో నివసించినందుకు, కేదారు గుడారాల మధ్యలో జీవించినందుకు నాకు శ్రమ!

  9. సమాధానాన్ని ద్వేషించేవారి మధ్యలో చాలా కాలం నివసించాను.

  10. నేను సమాధానం కోరుతున్నాను; కానీ వారు యుద్ధాన్ని కోరుతున్నారు.

  11. యెహోవా, మిమ్మల్ని ద్వేషించేవారిని నేను ద్వేషించనా, మీకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవారిని అసహ్యించుకోనా?

  12. వారి పట్ల ద్వేషము తప్ప ఇంకొకటి లేదు; వారిని నా శత్రువులుగా లెక్కగడతాను.

  13. నా కుమారుడా, పాపిష్ఠి మనుష్యులు నిన్ను ప్రలోభపెడితే, నీవు వారికి లొంగిపోవద్దు.

  14. ఒకవేళ వారు, “మాతో కూడా రా; నిర్దోషుల రక్తాన్ని చిందించడానికి దాగి ఉందాం; హాని చేయని ప్రాణం మీద ఆకస్మిక దాడి చేద్దాం;

  15. మాతో చీట్లు వేయండి; మనం దొంగిలించిన దానిని మనమందరం పంచుకుందాము.”

  16. నా పిల్లలారా, వారితో కలిసి వెళ్లకండి, వారి దారుల్లో నీ పాదాలు పెట్టకు;

  17. బుద్ధి నిన్ను కాపాడుతుంది, వివేకం నీకు కావలి కాస్తుంది.

  18. దుష్టుల చెడు మార్గాల నుండి, మూర్ఖంగా మాట్లాడేవారి నుండి జ్ఞానం నిన్ను కాపాడుతుంది.

  19. దుర్మార్గుల త్రోవలో నీ పాదం ఉంచవద్దు కీడుచేసేవారి మార్గంలో నడవవద్దు.

  20. దాన్ని నివారించు, దానిపై ప్రయాణించవద్దు; దాని నుండి తొలగిపోయి నీ మార్గంలో సాగిపో.

  21. కోపిష్ఠియైన వ్యక్తితో స్నేహం చేయవద్దు, ఊరకనే కోప్పడే వ్యక్తితో సహవాసం చేయవద్దు,

  22. నీవు వాని మార్గాలను అనుసరించి నీ ప్రాణానికి ఉరి తెచ్చుకుంటావేమో.

  23. ఈ ప్రజల మార్గాన్ని అనుసరించకూడదని యెహోవా నన్ను హెచ్చరించి నాతో ఖచ్చితంగా చెప్పిన మాట ఇదే:

  24. “ఈ ప్రజలు కుట్ర అని చెప్పే ప్రతిదాన్ని కుట్ర అనకండి. వారు భయపడే దానికి భయపడకండి. దానికి బెదిరిపోకండి.

  25. “ఎఫ్రాయిం దేశాలతో కలిసిపోతుంది; ఎఫ్రాయిం తిరిగేయని అప్పం లాంటిది.