Skip to content

Children గురించి బైబిల్ వచనాలు

257 వచనాలు · 102 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. వారు మైదానంలో గడ్డిలా పెరుగుతారు, నీటికాలువల దగ్గర నాటిన నిరవంజి చెట్లలా ఎదుగుతారు.

  2. కొంతమంది, ‘నేను యెహోవా వాడను’ అని అంటారు; ఇతరులు యాకోబు పేరుతో తమను తాము పిలుచుకుంటారు; ఇంకా కొందరు తమ చేతిపై ‘యెహోవా వారము’ అని రాసుకుని ఇశ్రాయేలు పేరును పెట్టుకుంటారు.

  3. “చూడండి, ఇది నా ఎదుట గ్రంథంలో వ్రాయబడింది: నేను మౌనంగా ఉండను, వారికి పూర్తి ప్రతిఫలం చెల్లిస్తాను; మీ పాపాలకు మీ పూర్వికుల పాపాలకు, నేను వారికి వారి ఒడిలో ప్రతిఫలం చెల్లిస్తాను” అని యెహోవా అంటున్నారు. “ఎందుకంటే, వారు పర్వతాలమీద ధూపం వేశారు, కొండలమీద నన్ను అవమానించారు, గతంలో వారు చేసిన వాటన్నిటికి వారి ఒడిలోనే పూర్ణ ప్రతీకారాన్ని కొలిచి పోస్తాను.”

  4. Your iniquities, and the iniquities of your fathers together, saith the LORD, which have burned incense upon the mountains, and blasphemed me upon the hills: therefore will I measure their former work into their bosom.

  5. “ఆ రోజుల్లో ప్రజలు, “ ‘తల్లిదండ్రులు పుల్లని ద్రాక్షలు తిన్నప్పుడు, పిల్లల పళ్లు పులిసాయి’ అనే సామెత చెప్పరు.

  6. ఎవరి పాపానికి వారే చస్తారు; ఎవరు పుల్లని ద్రాక్షలు తింటారో వారి పళ్లే పులుస్తాయి.

  7. నీ జన్మ విధానం చూస్తే, నీవు పుట్టిన రోజున నీ నాభి సూత్రం కత్తిరించబడలేదు, నిన్ను నీళ్లతో శుభ్రం చేయలేదు, ఉప్పుతో రుద్దలేదు, గుడ్డలో చుట్టలేదు.

  8. నీ మీద ఎవరూ జాలిపడలేదు. ఈ పనులలో ఒక్కటైనా చేయాలని ఎవరూ నీ మీద కనికరం చూపించలేదు. పైగా, పుట్టిననాడే నిన్ను అసహ్యించుకుని, బయట పొలంలో విసిరివేశారు.

  9. “ ‘అప్పుడు నేను అటు నుండి వెళ్తూ నీ రక్తంలో కొట్టుకుంటున్న నిన్ను చూసి, నీవు నీ రక్తంలో పడి ఉన్నప్పుడు నేను నీతో, “బ్రతుకు!” అని అన్నాను.

  10. “ ‘నీవు నాకు కనిన కుమారులను, కుమార్తెలను ఆ విగ్రహాలకు ఆహారంగా బలి అర్పించావు. నీవు చేసిన వ్యభిచారం సరిపోలేదా?

  11. నా పిల్లలను నీవు వధించి ఆ విగ్రహాలకు బలి ఇచ్చావు.

  12. యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:

  13. “ఇశ్రాయేలు దేశం గురించి మీరు చెప్పే ఈ సామెతకు అర్థం ఏంటి? “ ‘తల్లిదండ్రులు పుల్లని ద్రాక్షలు తింటే పిల్లల పళ్లు పులిసాయి.’

  14. “నా జీవం తోడు, ఇశ్రాయేలీయుల మధ్య ఈ సామెత మళ్ళీ వినపడదు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.

  15. ఎందుకంటే ప్రతి ఒక్కరూ నా వారే, తండ్రులైనా పిల్లలైనా ఇద్దరూ నా వారే. పాపం చేసేవాడు చనిపోతాడు.

  16. “ఒక నీతిమంతుడు ఉంటే అతడు నీతిని న్యాయాన్ని జరిగిస్తాడు.

  17. అతడు పర్వత క్షేత్రాల మీద భోజనం చేయడు, ఇశ్రాయేలీయుల విగ్రహాలవైపు చూడడు, తన పొరుగువాని భార్యను అపవిత్రం చేయడు, బహిష్టులో ఉన్న స్త్రీతో లైంగికంగా కలవడు,

  18. ఎవరిని బాధించడు, అప్పుకు తాకట్టుగా పెట్టిన దానిని తిరిగి ఇచ్చేస్తాడు, ఎవరినీ దోచుకోడు కాని ఆకలితో ఉన్నవారికి తన ఆహారాన్ని ఇచ్చి దిగంబరికి బట్టలు ఇస్తాడు.

  19. వడ్డీకి అప్పు ఇవ్వడు వారి నుండి లాభం తీసుకోడు. తప్పు చేయకుండా జాగ్రత్తపడతాడు సత్యంగా న్యాయం తీరుస్తాడు.

  20. అతడు నా శాసనాలను అనుసరించి నా ధర్మశాస్త్రాన్ని పాటిస్తాడు. ఇలాంటి వాడే నీతిమంతుడు; అతడు నిజంగా బ్రతుకుతాడు, అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.

  21. “ఒకవేళ అతనికి ఈ మంచి పనులేవి చేయకుండా రక్తం చిందించే ఒక హింసాత్మకుడైన కుమారుడు ఉంటే,

  22. అతడు తన తండ్రి చేయని వీటన్నిటిని చేసేవాడైతే: “అతడు పర్వత క్షేత్రాల దగ్గర తింటాడు. తన పొరుగువాని భార్యను అపవిత్రం చేస్తాడు.

  23. పేదవారిని దరిద్రులను అణచివేస్తాడు. దోపిడీలు చేస్తాడు. అప్పుకు తాకట్టుగా తీసుకున్న దానిని తిరిగి ఇవ్వడు. అతడు విగ్రహాలవైపు చూస్తాడు. అసహ్యమైన పనులు చేస్తాడు.

  24. అతడు వడ్డీలకు అప్పు ఇచ్చి లాభం తీసుకుంటాడు. అలాంటివాడు బ్రతుకుతాడా? అతడు బ్రతకడు! ఎందుకంటే అతడు ఈ అసహ్యమైన పనులన్నీ చేశాడు కాబట్టి, అతనికి మరణశిక్ష విధించబడుతుంది; తన మరణానికి అతడే బాధ్యుడు.

  25. “అయితే అలాంటి వానికి పుట్టిన కుమారుడు తన తండ్రి చేసిన పాపాలన్నిటిని చూసి ఆలోచించి అలాంటి పనులు చేయకపోతే అంటే: