Children గురించి బైబిల్ వచనాలు: Rebellious, punished by the civil power
Rebellious, punished by the civil power గురించి వచనాలు
“ఎవరైనా తన తండ్రి మీద గాని తల్లి మీద గాని దాడి చేస్తే వారికి మరణశిక్ష విధించాలి.
“ఎవరైనా ఎవరినైనా ఎత్తుకెళ్లిన తర్వాత ఒకవేళ అమ్మివేయబడినా లేదా వారి దగ్గరే ఉన్నా, ఎత్తుకెళ్లిన వారికి మరణశిక్ష విధించబడాలి.
“ఎవరైనా తన తండ్రిని గాని తల్లిని గాని శపిస్తే వారికి తప్పక మరణశిక్ష విధించబడాలి.
ఒకవేళ ఎవరికైనా తండ్రికి తల్లికి లోబడని, వారు వాన్ని క్రమశిక్షణ చేసినప్పుడు వారికి వినని, మొండితనం గల తిరుగుబాటు చేసే కుమారుడు ఉంటే,
అతని తండ్రి, తల్లి అతన్ని పట్టుకుని పట్టణ ద్వారం దగ్గర ఉన్న పెద్దల దగ్గరకు తీసుకురావాలి.
వారు పెద్దలతో, “ఈ మా కుమారుడు మొండివాడు, తిరుగుబాటు చేసేవాడు. వీడు మాకు లోబడడు. వీడు తిండిబోతు, త్రాగుబోతు” అని చెప్పాలి.
అప్పుడు అతని పట్టణంలోని పురుషులందరు వాన్ని రాళ్లతో కొట్టి చంపాలి. మీరు మీ మధ్య నుండి చెడును ప్రక్షాళన చేయాలి. ఇశ్రాయేలీయులందరు దాని గురించి విని భయపడతారు.