కంటెంట్‌కు వెళ్లండి

Children గురించి బైబిల్ వచనాలు: Share benefits of covenant privileges guaranteed to parents

7 వచనాలు · 102 కోణాలు

Share benefits of covenant privileges guaranteed to parents గురించి వచనాలు

  1. నా నిబంధనను నాకు నీకు మరి నీ తర్వాత వచ్చు నీ వారసులకు మధ్య నిత్య నిబంధనగా స్థిరపరుస్తాను, నీకు దేవునిగా, నీ తర్వాత నీ వారసులకు దేవునిగా ఉంటాను.

  2. నీవు పరదేశిగా ఉంటున్న కనాను దేశమంతా నీకు, నీ తర్వాత నీ వారసులకు నిత్య స్వాస్థ్యంగా ఇస్తాను; వారికి నేను దేవునిగా ఉంటాను.”

  3. కొంతకాలం ఈ దేశంలోనే ఉండు, నేను నీకు తోడుగా ఉండి, నిన్ను ఆశీర్వదిస్తాను. నీకు నీ వారసులకు ఈ దేశాలన్నీ ఇస్తాను, నీ తండ్రియైన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేరుస్తాను.

  4. నీ వారసులను ఆకాశంలోని అనేక నక్షత్రాల్లా విస్తరింపజేసి ఈ దేశాలన్నీ వారికిస్తాను, నీ సంతానం ద్వారా సమస్త భూప్రజలు ఆశీర్వదించబడతారు,

  5. ఎందుకంటే అబ్రాహాము నా మాట విని, నేను చెప్పింది చేశాడు, నా ఆజ్ఞలను, కట్టడలను, సూచనలను పాటించాడు.”

  6. అయినప్పటికీ, వారు తమ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు, వారితో నా నిబంధనను విచ్ఛిన్నం చేస్తూ, వారిని పూర్తిగా నాశనం చేసే విధంగా నేను వారిని తిరస్కరించను, అసహ్యించుకోను. నేను వారి దేవుడనైన యెహోవానై ఉన్నాను.

  7. అయితే వారి కోసం నేను జనముల దృష్టిలో వారి దేవునిగా ఉండాలని ఈజిప్టు నుండి బయటకు తెచ్చిన వారి పూర్వికులతో నేను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను. నేను యెహోవాను.’ ”