Skip to content

Babylon గురించి బైబిల్ వచనాలు

186 వచనాలు · 73 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “ఇల్లు కట్టుకుని స్థిరపడండి; తోటలు నాటి వాటి పండ్లను తినండి.

  2. పెళ్ళి చేసుకుని కుమారులు, కుమార్తెలను కనండి; మీ కుమారులకు భార్యలను తెచ్చుకోండి, మీ కుమార్తెలకు పెళ్ళి చేయండి, వారు కూడా కుమారులు కుమార్తెలను కంటారు. అప్పుడు మీ సంఖ్య తగ్గకుండ అధికమవుతుంది.

  3. అలాగే, నేను మిమ్మల్ని బందీలుగా తీసుకువెళ్లిన పట్టణంలో సమాధానం, అభివృద్ధి ఉండాలని కోరుకుని యెహోవాను ప్రార్థించండి, ఎందుకంటే అది అభివృద్ధి చెందితే, మీరు కూడా అభివృద్ధి చెందుతారు.”

  4. బబులోను రాజైన నెబుకద్నెజరు దాడి చేసిన కేదారు, హాసోరు రాజ్యాల గురించి: యెహోవా ఇలా అంటున్నారు: “లేవండి, లేచి కేదారు మీద దాడి చేసి తూర్పు ప్రజలను నాశనం చేయండి.

  5. వారి గుడారాలు, వారి మందలు స్వాధీనం చేసుకోబడ్తాయి; వారి ఒంటెలు, వారి మొత్తం సామాగ్రితో పాటు, వారి గుడారాలను తీసుకెళ్తారు. ‘అన్నివైపులా భయమే!’ అని ప్రజలు వారితో అంటారు.

  6. “త్వరగా పారిపోండి! హాసోరులో నివసించేవారలారా, లోతైన గుహల్లో దాక్కోండి” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “బబులోను రాజైన నెబుకద్నెజరు నీకు వ్యతిరేకంగా కుట్రపన్నాడు. అతడు నీకు వ్యతిరేకంగా ఒక పథకం వేశాడు.

  7. “మీరు లేచి, నిర్భయంగా జీవిస్తూ, ద్వారాలు గాని అడ్డు గడియలు గాని లేకుండ ప్రజలు క్షేమంగా ఉంటున్న, దేశం మీద దాడి చేయండి,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  8. “వారి ఒంటెలు దోచుకోబడతాయి, వారి విస్తారమైన మందలు యుద్ధంలో కొల్లగొట్టబడతాయి. సుదూర ప్రాంతాలకు నలువైపులా వారిని చెదరగొట్టి వారి మీదికి అన్నివైపులా విపత్తు తెస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  9. “హాసోరు నక్కలకు నిలయంగా, ఎప్పటికీ నిర్జన ప్రదేశంగా మారుతుంది. అక్కడ ఎవరూ నివసించరు; దానిలో ఏ ప్రజలు నివసించరు.”

  10. యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:

  11. “మనుష్యకుమారుడా, నీవు ఒక పొడుపు కథ వేసి, దానిని ఇశ్రాయేలీయులకు ఒక ఉపమానంలా చెప్పాలి.

  12. వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: బలమైన రెక్కలు, పొడవైన ఈకలు కలిగి రకరకాల రంగులతో ఉన్న ఒక పెద్ద గ్రద్ద లెబానోను పర్వతానికి వచ్చి, దేవదారు చెట్టు కొమ్మపై వాలి,

  13. దాని అంచున ఉన్న లేత కొమ్మల చిగురు తెంపి వర్తకుల దేశానికి తీసుకెళ్లి వ్యాపారుల పట్టణంలో దానిని నాటింది.

  14. “ ‘అది ఆ దేశపు విత్తనాలను తీసుకెళ్లి సారవంతమైన నేలలో నాటింది. విస్తారమైన నీటి ప్రక్కన పెరిగే నిరవంజి చెట్లలా ఆ మొక్కను నాటింది,

  15. అది చిగురు వేసి పైకి పెరగకుండ నేలమీద విస్తరించి పెద్ద ద్రాక్షావల్లి అయింది. దాని కొమ్మలు గ్రద్ద వరకు వెళ్లాయి, కాని దాని వేర్లు గ్రద్ద క్రింద ఉన్నాయి. అలా అది ద్రాక్షవల్లిలా మారి అనేక కొమ్మలతో రెమ్మలు వేసింది.

  16. “ ‘అయితే బలమైన రెక్కలు దట్టమైన ఈకలతో మరొక పెద్ద గ్రద్ద ఉంది. ఆ ద్రాక్షావల్లి అది నాటబడిన చోటు నుండి ఆ గ్రద్ద వైపు తన వేర్లు విస్తరింపజేసుకుని, దాని కొమ్మలను నీటి కోసం దానివైపు విస్తరింపచేసుకుంది.

  17. ఆ ద్రాక్షావల్లికి తీగెలు వచ్చి, పండ్లు ఇచ్చేలా, అద్భుతమైన ద్రాక్షవల్లిలా అయ్యేలా, అది మంచి నేలలో విస్తారమైన నీటి ప్రక్కన నాటబడింది.’

  18. “కాబట్టి వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: అలాంటి ద్రాక్షావల్లి వృద్ధి చెందుతుందా? అది ఎండిపోయేలా ప్రజలు దాని వేరు పెకిలించి, దాని పండ్లు కోయరా? దాని చిగురులన్నీ ఎండిపోతాయి. దానిని వేర్లతో సహా పెకిలించడానికి బలమైన చేయి గాని, చాలామంది వ్యక్తులు గాని అవసరం లేదు.

  19. అది ఒకచోట నుండి మరొక చోట నాటబడింది, అది వృద్ధి చెందుతుందా? తూర్పు గాలి దాని మీద వీచినపుడు అది నాటబడిన చోటనే ఎండిపోదా?’ ”

  20. మరోసారి యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:

  21. “తిరుగుబాటు చేసే ఈ ప్రజలతో ఇలా చెప్పు, ‘ఈ మాటల అర్థం మీకు తెలియదా?’ ఇదిగో, ‘బబులోను రాజు యెరూషలేముకు వెళ్లి దాని రాజును, అధిపతులను పట్టుకుని తనతో పాటు బబులోనుకు తీసుకువచ్చాడు.

  22. తర్వాత అతడు రాజ కుటుంబీకుల్లో ఒకన్ని ఎంచుకుని, అతనితో ప్రమాణం చేయించి, అతనితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంతేకాక ఆ రాజ్యం బలహీనపడి, మరలా అది బలపడకుండా తన ఒప్పందాన్ని పాటించడం ద్వారా మాత్రమే మనుగడ సాగించేలా, దేశంలోని నాయకులను తీసుకెళ్లిపోయాడు.

  23. That the kingdom might be base, that it might not lift itself up, but that by keeping of his covenant it might stand.

  24. అయితే రాజకుటుంబం నుండి ఎంచుకోబడిన వ్యక్తి, తనకు గుర్రాలను పెద్ద సైన్యాన్ని పంపి సహాయం చేయమని అడగడానికి ఈజిప్టు దేశానికి రాయబారులను పంపి బబులోను రాజు మీద తిరుగుబాటు చేశాడు. అతడు విజయం సాధిస్తాడా? అటువంటి పనులు చేసినవాడు తప్పించుకుంటాడా? అతడు ఒప్పందాన్ని ఉల్లంఘించి తప్పించుకుంటాడా?

  25. “ ‘ఏ రాజైతే అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టాడో, ఎవరి ప్రమాణాన్ని అతడు తృణీకరించాడో, ఎవరి ఒప్పందాన్ని అతడు ఉల్లంఘించాడో ఆ రాజు దేశమైన బబులోనులోనే, నా జీవం తోడు అతడు చనిపోతాడు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.